S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/12/2019 - 19:59

భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించేలా తాను మోడలింగ్ చేస్తానంటూ వచ్చిన నభా నటేష్, ఆ తరువాత కథానాయిగా మారింది. తొలుత తన మాతృభాష కన్నడంలోనే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, తెలుగులో నన్నుదోచుకుందువటే చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది. మోడల్‌గా చేసిన అనుభవం ఇపుడు చిత్రాలలో నటించడానికి పనికివస్తుందంటున్న ఈ అమ్మడు, తన మూడవ చిత్రం డిస్కోరాజాతో దశ తిరుగుతుందని భావిస్తోంది.

11/12/2019 - 19:58

రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, శివశంకర్ మాస్టార్ ప్రధాన తారాగణంగా భవాని శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం క్లైమాక్స్. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో శ్రీరెడ్డి నటించడం విశేషం. కైపాస్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ పతాకంపై పి.రాజశేఖర్‌రెడ్డి, కె.కరుణాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

11/12/2019 - 19:57

ఇటీవల అనసూయ ప్రధాన పాత్రలో కథనం చిత్రాన్ని రూపొందించిన మొవ్వ విజయచౌదరి తాజాగా ఎమ్ స్క్రీన్స్ పతాకాన్ని నెలకొల్పి వరుసగా మూడు చిత్రాలను నిర్మించేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువ ప్రతిభను ప్రోత్సహించడానికి, ప్రేక్షకులను వైవిధ్యమైన కథ, కథనాలున్న చిత్రాలను అందించి ఆనందింపజేయడానికి తాను ఈ కొత్త సంస్థను నెలకొల్పానని అన్నారు.

11/12/2019 - 19:55

టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై నైనా, సూరి ప్రధాన తారాగణంగా అగస్త్య మంజు దర్శకత్వంలో రామ్‌గోపాల్‌వర్మ అందిస్తున్న చిత్రం ‘బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే నెల 6న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం విశేషాలను తెలుపుతూ ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్‌కు మొదటి సింగల్‌కు మంచి స్పందన లభించిందని తెలిపారు.

11/12/2019 - 19:54

గతంలో కామెడీతో కొన్ని సన్నివేశాలు, చిత్రాలు చేసినా, ఇపుడు మాత్రం వస్తున్న తెనాలి రామకృష్ణ పూర్తిగా కామెడీ జోనర్‌లోనే సాగుతుంది నటుడు సందీప్ కిషన్ తెలిపారు. జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో హన్సిక, వరలక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందించిన తెనాలి రామకృష్ణ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న విడుదలకు సిద్ధమైంది.

11/12/2019 - 19:53

రాజ్, షాలు, మేఘనా చౌదరి ప్రధాన తారాగణంగా శ్రీ లక్ష్మీ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఆది అరవల దర్శకత్వంలో కావలి రాజు రూపొందించిన చిత్రం రణస్థలం. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 22న విడుదలకు సిద్ధమైంది. మంగళవారం ఉదయం ఆడియో సక్సెస్ వేడుకను హైదరాబాద్ చాంబర్ హాల్‌లో నిర్వహించారు.

11/12/2019 - 19:51

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సర్వేశ్వర మూవీ పతాకంపై రూపొందిస్తున్న ‘రుద్రనాగు’ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను క్లాప్‌నిచ్చి నటీనటులపై ప్రారంభించిన విజయచందర్. కార్తీక పౌర్ణమి సందర్భంగా
సినిమాను ఆరంభించారు.

11/12/2019 - 19:49

వాహిని క్రియేషన్స్ పతాకంపై శ్రీ తారక్ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం ‘వీధి బాలలం’. మాకూ స్వతంత్రం కావాలి అనేది ఈ సినిమాకు ఉపశీర్షికగా నిర్ణయించారు. సుమారు 1200 మంది పిల్లలను అనేక పాఠశాలలనుండి ఎంపిక చేసి వారికి నటనలో మెళకువలు నేర్పించి ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు తెలియజేస్తున్నారు.

11/12/2019 - 19:47

హేమంత్ ఆర్ట్స్ పతాకంపై క్రాంతి, శీమర్ జంటగా హేమంత్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం పిచ్చోడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను సోషల్ మీడియాలో నటుడు సుధీర్‌బాబు విడుదలచేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ, పిచ్చోడు అన్న టైటిల్ క్యాచ్‌బుల్‌గా వుందని, యూత్‌ఫుల్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందన్నారు.

11/12/2019 - 19:45

హీరో అంటే కేవలం హీరోయిజమ్ చూపించడానికి మాత్రమే పరిమితం. కథలో పాత్రలన్నీ అతడి చుట్టూ తిరిగి ఆ హీరోయిజానికి బూస్టప్ ఇస్తాయి. కానీ హీరో మాత్రం మిగతా పాత్రలకు అంత ప్రాముఖ్యత ఇచ్చినట్టు కనబడదు ప్రతి స్క్రిప్ట్‌లో. ఎక్కడో తల్లీ, చెల్లి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఈమధ్య వచ్చే చిత్రాలలో బావా బావమరుదులు, మరదళ్ల పాత్రలకు కూడా ప్రాధాన్యత వుంటుంది. ఇదంతా కెమెరాకు ముందు జరిగే తతంతం.

Pages