S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర

09/10/2017 - 20:58

సచిన్, ఈషా గుప్తా జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో వైకింగ్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రైనా జోషి నిర్మించిన వీడెవడు చిత్రం ఈ నెల 15న విడుదలవుతున్న సందర్భంగా హీరో సచిన్ జోషి చెప్పిన విశేషాలు.

09/10/2017 - 20:56

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అయిన రాజ్‌కిరణ్ స్వయంగా సంగీతం సమకూర్చి పాడిన పాటను ఫిలిం చాంబర్‌లో విడుదల చేసారు. ముఖ్య అతిథులుగా నిర్మాత జెమినీ కిరణ్, ప్రతాని రామకృష్ణాగౌడ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. జమిని కిరణ్ వీడియో సాంగ్‌ను లాంచ్ చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌పై చేసిన పాట అద్భుతంగా వుంది. రాజ్‌కిరణ్ మంచి సంగీతం అందించాడు.

09/10/2017 - 20:54

పెళ్లి చూపులు వంటి ఘన విజయం తర్వాత నిర్మాత రాజ్‌ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం మెంటల్ మదిలో. వివేక్ ఆత్రేయ దర్శకుడు. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మాజిక్ జరుగుతుంది. ఆ మేజిక్ జరగడానికి సపోర్టు అవసరం.

09/10/2017 - 20:52

నేను పబ్లిక్ ఫిగర్‌ని. అలాగని పబ్లిక్ ప్రాపర్టీని కాదు. నా సొంత అభిప్రాయాలు నాకుంటాయి. నేను చేస్తుంది తప్పు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. దేశంలో ఎంతోమంది వున్నారు. వారందరినీ అడగని ప్రశ్నలు ననె్నందుకు అడుగుతారు? ముఖ్యంగా నా బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నిబోన్ గురించి గుచ్చి గుచ్చి అడగాల్సిన అవసరం ఏమిటి అని అగ్గిమీద గుగ్గిలమవుతోంది గోవా బ్యూటీ ఇలియానా.

09/10/2017 - 20:49

కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శే్వత బసు ప్రసాద్ మొదటి సినిమా తోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలు ఆమెకు పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. దాంతో అడపాదడపా సినిమాలు చేసిన శే్వత వ్యభిచారం కేసులో ఇరుక్కుంది.ఆ తర్వాత బయటికి వచ్చిన శే్వత బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దగ్గర స్క్రిప్ట్ సహాయకురాలిగా పనిచేస్తోంది.

09/10/2017 - 20:47

సునీల్, మియాజార్జి జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై పరచూరి కిరీటి నిర్మించిన ఉంగరాల రాంబాబు ఈ నెల 15న విడుదలవుతున్న సందర్భంగా ఆదివారం పరిశ్రమలో వున్న కమెడియన్లందరితో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

09/10/2017 - 00:35

శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం 3సరసుడు2. శింబు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్ ఫిలింస్ పతాకాలపై పాండీరాజ్ దర్శకత్వంలో టి.రాజేందర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

09/10/2017 - 00:34

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేకమంది గొప్ప కళాకారులున్నారు. వారి ప్రతిభను నమ్ముకుని ఉన్నత శిఖరాలకు చేరిన కళాకారులు తమ మూలాలు మరచిపోతున్నారని తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో చాలామంది ప్రతిభావంతులున్నారని, వారి కళను గుర్తించేవారు లేక నష్టపోతున్నారని, అలాంటివారికి చేయూతనిచ్చి ఇపుడున్న కళాకారులు ప్రోత్సాహమివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

09/10/2017 - 00:33

ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ విడుదలకు సిద్ధమైంది. తదుపరి ప్రాజెక్టుల కోసం కథలు విం టూనే ఉన్నాడు ఎన్టీఆర్. కుటుంబ కథలపై దృష్టిపెట్టిన ఎన్టీఆర్‌కు శతమానంభవతితో సూపర్‌హిట్ అందుకున్న సతీష్ వేగెశ్న కనెక్టైనట్టు ఇండస్ట్రీ టాక్. చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నా, ప్రాజెక్టు కన్ఫర్మ్ అన్నది ఇండస్ట్రీ మాట.

09/10/2017 - 00:33

మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో పరిశ్రమకు వచ్చినట్టు చెప్పారు వివై బ్యానర్ అధినేత సత్యనారాయణ బొక్క. బ్యానర్ లోగోను దాసరి కుమారుడు అరుణ్‌కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సమర్పకుడు సత్యనారాయణ మాట్లాడుతూ ఏదో ఒకటో రెండో సినిమాలు చేయాలన్న తలంపుతో బ్యానర్‌ను తేలేదు. వరుసగా చిత్రాలను నిర్మించి వివై కంబైన్స్ గుర్తింపు పొందాలన్న ప్యాషనేట్‌తో పరిశ్రమకు వచ్చామని చెప్పారు.

Pages