S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/08/2019 - 22:25

రెజ్లర్‌గా కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ పోషిస్తోన్న యాక్షన్ డ్రామా -పహిల్వాన్. దర్శకుడు ఎస్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ట్రైలర్ ఇటీవలే తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ సాధించింది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి తెలుగులో సెప్టెంబర్ 12న సినిమా విడుదల చేస్తున్నారు.

09/08/2019 - 22:22

శుభాంగి పంత్

09/08/2019 - 22:20

చేస్తే మళ్లీ మాస్ లైన్‌తోనే ప్రాజెక్టు చేయాలన్న థాట్‌కు ఫిక్సయ్యాడట రామ్. వరుస ఫ్లాపుల కారణంగా యంగ్ హీరోల రేసులో వెనకబడిన రామ్ -ఇస్మార్ట్ శంకర్‌తో బాక్సాఫీస్ వద్ద మోత మోగించాడు. పూరి -రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ -ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

09/06/2019 - 19:57

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ‘కన్‌క్లూజన్’ క్వొశ్చన్‌కి సమాధానం కోసం -కోట్లు కుమ్మరించారు ఆడియన్స్. దాంతో బాహుబలి పార్ట్ 2 బ్లాక్‌బస్టరైంది. అంతటి బాహుబలి... తరువాతి ప్రాజెక్టు ఏం చేయాలి? ఈ క్వొశ్చన్‌కు కోట్లు కుమ్మరించారు నిర్మాతలు. సాహో సెమీ రిజల్టిచ్చింది. సో, ‘వ్వాట్ నెక్ట్స్?’ క్వొశ్చన్ -మళ్లీ ప్రభాస్ ముందుకొచ్చింది. దీనిపై ప్రభాస్ డెసిషన్ కోసం ఎదురు చూడక తప్పదు.

09/06/2019 - 19:52

హెబ్బాపటేల్ పేరెత్తగానే గుర్తుకొచ్చే సినిమా -కుమారి 21ఎఫ్. తొలి ప్రాజెక్టుతో సంపాదించుకున్న క్రేజ్‌ను -తరువాత చేసిన చిత్రాల్లో నిలబెట్టుకోలేకపోయింది హెబ్బా. గ్లామర్ పాత్రల్లో గట్స్ చూపించినా -ఎంచుకున్న కథల్లో విషయం లేక పూర్తిగా వెనకబడిపోయింది. కొత్త హీరోయిన్ల రేసులో అడ్రెస్ లేనంత వెనకబడిపోయిన హెబ్బా -తాజాగా ఓ పెద్ద సినిమాలో చాన్స్ దక్కించుకుందట.

09/06/2019 - 19:50

నాపేరు సూర్యతో తగిలిన ఎదురుదెబ్బ బన్నీలో పెద్ద మార్పే కనిపిస్తోంది. ఆ సినిమా తరువాత కొత్త ప్రాజెక్టు ప్రకటించడానికి కథ విషయంలో భారీగానే కసరత్తు చేశాడు. అటుతిరిగి ఇటుతిరిగి చివరకు -హ్యాట్రిక్ సక్సెస్‌పై నమ్మకంతో ప్రాజెక్టును దర్శకుడు త్రివిక్రమ్ చేతిలో పెట్టాడు. అలా -అల.. వైకుంఠపురం మొదలైందో లేదో మరో ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడని వినిపిస్తోంది.

09/06/2019 - 19:48

మందు, సిగరెట్, అమ్మాయిలూ... శత్రువు కూడా వ్యసనమే. ఆ వ్యసనానికి నేనూ బానిసనే -అంటున్నాడు హీరో శ్రీవిష్ణు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, కృష్ణవిజయ్ ఎల్ ప్రొడక్షన్స్, శ్రీ ఓం సినిమా బ్యానర్లపై కృష్ణవిజయ్ ఎల్ తెరకెక్కిస్తోన్న చిత్రం -తిప్పరా మీసం. తాజాగా సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా టీజర్‌ను కట్ చేశారు.

09/06/2019 - 19:46

నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిపోయింది -అనుష్క. లేడీ ఓరియంటెడ్‌గా ఆమె చేసిన చిత్రాలు మంచి విజయాలందుకున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో వస్తోన్న మరో చిత్రం -నిశ్శబ్ధం. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నాడు.

09/06/2019 - 19:45

సత్యదేవ్, ఇషా రెబ్బ హీరో హీరోయిన్లుగా ప్రముఖ కథానాయకుడు శ్రీరామ్, పైసా వసూల్ ఫేం ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రల్ల నటించిన చిత్రం రాగల 24 గంటల్లో. ఈ చిత్రానికి శ్రీనివాస్ కానూరి నిర్మాత. ఢమరుకం శ్రీనివాస్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ విభిన్నంగా జరిగింది. రెండు పోస్టర్లను విడుదలచేసింది చిత్ర యూనిట్. మొదటి పోస్టర్‌ను సి. కల్యాణ్ విడుదల చేశారు.

09/06/2019 - 19:43

‘బిచ్చగాడు’ హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు విజయ్ ఆంటోనీ. ఏ సినిమాతో వచ్చినా ఏదోక వైవిధ్యం ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించాడు. అదే విజయ్ ఆంటోనీ హీరోగా మరో వైవిధ్యమైన సినిమా రూపుదిద్దుకుంటోంది. తమిళంలో సినిమా రూపుదిద్దుకుంటున్నా, తెలుగు హీరో కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం కనుక -ఇక్కడి ఆడియన్స్‌ను టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది.

Pages