S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/11/2019 - 19:54

వెనె్నలలో నిలబడిన పాలరాతి బొమ్మలా ఎప్పటికప్పుడు తళుకులు మెరిపిస్తోంది తమన్నా. పాలమీగడలాంటి అందంతో యువకుల హృదయాలను రెచ్చగొట్టేలా రోజురోజుకీ తన అందాన్ని రెట్టింపు చేసుకుంటోంది ఈ మిల్కీ భామ. ఇప్పటికి పరిశ్రమకు వచ్చి పదేళ్ళు దాటినా వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్‌గా సినిమాలను చేస్తోంది.

11/11/2019 - 19:51

తెలుగులో అద్భుతమైన ఇమేజ్‌ను అందుకున్న టాప్ హీరోయిన్‌గా మన్ననలు అందుకుంటున్న అనుష్క ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంపిక చేసుకుంటూ స్లో అండ్ స్టడీగా చిత్రాలను వదులుతోంది. ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యత వున్న సినిమాలవైపు ఆమె పూర్తి దృష్టి పెట్టినట్లుగా వుంది. అంతలా అటువంటి పాత్రలో ఇమిడిపోయి ఓవైపు నటన, మరోవైపు గ్లామర్ పండిస్తోంది అనుష్క. బాక్సాఫీస్ వద్ద అనుష్క సినిమాలకు మంచి మార్కెట్టే వుంది.

11/11/2019 - 19:50

పవన్‌కళ్యాణ్ తాజాగా రాజకీయాలను పక్కనబెట్టి పింక్ రీమేక్‌లో నటించనున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఈ చిత్రంలో ఆయన నటిస్తున్నారన్నది నిజమే. కానీ ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాతలు కూడా ఓకె.. మేం చేస్తున్నామంటూ ప్రకటించారు.

11/11/2019 - 19:49

రాంగోపాల్‌వర్మ ఏ చిత్రం తీసినా అదొక సంచలనం. ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలను రూపొందించే ప్రయత్నంలో భాగంగా ఆయన తాజాగా టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో అందిస్తున్న చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో పప్పులాంటి అబ్బాయి పాటకు విశేష స్పందన వస్తోంది.

11/11/2019 - 19:48

తెలుగు తెరపై మరో కొత్త తార పరిచయం అవుతోంది. ఆమే సితార. ఎవరనుకుంటున్నారు, మహేష్‌బాబు తనయ. ఏడేళ్ల వయసులోనే ఆమె ఇప్పుడు డిస్నీ ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న ఫ్రాజెన్ 2 చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్‌లో యువరాణి ఎల్సాకు డబ్బింగ్ చెబుతోంది.

11/11/2019 - 19:46

తెలుగులో విజయ్ సేతుపతిగా ఈనెల 15న విడుదలకానున్న చిత్రానికి సంబంధించిన కథను పవన్‌కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అది ఆయనతో తీయడం వీలుకాక, అంతే ఫాలోయింగ్ వున్న విజయ్ సేతుపతితో రూపొందించాను అని తెలిపారు దర్శకుడు విజయ్‌చందర్. విజయ్‌సేతుపతి, రాశీఖన్నా జంటగా విజయ ప్రొడక్షన్స్, హర్షిత మూవీస్ పతాకంపై రావూరి వి శ్రీనివాస్ అందిస్తున్న చిత్రం ‘విజయ్ సేతుపతి’.

11/11/2019 - 19:45

మొదట నేను దర్శకుడిగా నా కెరీర్ ప్రారంభించినా ఇపుడు నటుడిని అయ్యాక ఓ విద్యార్థిగా మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటాను. ఓ నటుడిగా మాత్రమే షూటింగ్‌కు వెళతాను. అంతకు తప్పితే అనవసరమైన పనులలో నా ప్రమేయం ఏదీ ఉండదు అంటూ తెలిపారు దర్శకుడు, నటుడు దేవీప్రసాద్.

11/11/2019 - 19:43

గౌతమ్ వ్యాస్, దీపికా వదాని జంటగా శ్రీ శివాయ్ ఫిలింస్ పతాకంపై స్రవంతి మురళీమోహన్ తెరకెక్కిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కె.రమేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హరీష్ ఉత్తమన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, అర్థనారి అర్జున్ విలన్‌గా నటిస్తుండడం విశేషం.

11/11/2019 - 19:42

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న సమంత, ఓ వైపు కమర్షియల్ హిట్స్‌తో కూడా హీరోలను ఆకట్టుకుంటోంది. పెళ్ళయ్యాక తన కెరీర్‌కు మరింత ఊపు వచ్చిందని ఆమే చెప్పడం విశేషం. ఎంతోమంది హీరోలు సరైన హిట్స్ లేక కథలకోసం వెతుకుతుంటే, సమంతకు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథనాలు ఎదురవుతున్నాయి. దాంతో ప్రేక్షకులకు దగ్గరవుతోంది. గతంలో కన్నా ఉత్సాహం ఆమెలో రెట్టింపు అయిందని చెబుతున్నారు.

11/11/2019 - 19:40

తెనాలి రామకృష్ణ బి.ఎ బిఎల్ అంటే పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా రూపొందించాం. జీవితంలో ప్రతిదీ కాంప్రమైజ్ కావాలి అనే మాటను కామెడీ టచ్‌లో ప్రేక్షకులకు నవ్వులు పండించడానికి ఈ సినిమా రూపొందించాము అని దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. సందీప్‌కిషన్ కథానాయకుడిగా ఎస్.ఎస్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్’.

Pages