S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/04/2019 - 20:19

అర్జున్‌రెడ్డితో బ్లాక్‌బస్టర్ అందుకున్న షాలినీ పాండేకు -ఆలస్యంగానైనా ఆమె కష్టానికి తగిన అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందట. నిజానికి అర్జున్‌రెడ్డిలో ఆమె బోల్డ్ పెర్ఫార్మెన్స్‌కు -లెక్కలేనన్ని చాన్స్‌లు వరుస పెడతాయనే అంతా ఊహించారు. కాని సీన్ రివర్స్ అయ్యింది. అరకొర చాన్స్‌లు తప్ప, షాలిని కెరీర్‌ను మలుపుతిప్పే సినిమా ఒక్కటీ పడలేదు.

09/04/2019 - 20:17

ప్రయోగాత్మక కథలు, వైవిథ్యమైన పాత్రలతో ఆడియన్స్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు సూర్య. గజని, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సింగం సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ సూర్యకు స్టార్ ఇమేజ్ వచ్చింది. సూర్యనుంచి వస్తోన్న తాజా చిత్రం -బందోబస్తు. కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న సినిమాను దర్శకుడు కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు.

09/04/2019 - 20:15

రీమేక్‌ను రీ బిగినింగ్‌గా ప్రకటించుకున్న హీరో -బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఆ రీమేక్ సినిమా -రాక్షసుడు. అల్లుడుశీను తరువాత అరడజను ఫ్లాపులతో విసిగిపోయిన సాయి శ్రీనివాస్ -రాక్షసుడి చిత్రాన్ని రీబిగినింగ్‌గా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే ప్రదర్శించిన నమ్మకం నిజమై -అతని కెరీర్‌లో భారీ హిట్టేపడింది.

09/04/2019 - 20:14

అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు మర్డర్ మిస్టరీలో లాకై -దాన్ని ఎలా ఛేదించాడు? ఎలా బయటపడ్డాడు అన్నదే -దర్పణం. సెకెండాఫ్‌లో ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంది అంటున్నాడు హీరో తనిష్క్ రెడ్డి. ఎలక్సియస్, శుభాంగిపంత్ హీరోయిన్లుగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో క్రాంతి కిరణ్ వెల్లంకి నిర్మిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ -దర్పణం.

09/04/2019 - 20:12

మేడమ్ టుస్సాడ్స్‌లో అతిలోకసుందరి ప్రత్యక్షమైంది. దివంగత నటి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో బుధవారం ఆవిష్కరించారు. శ్రీదేవి భర్త, నిర్మాత బోనీకఫూర్, ఇద్దరు పిల్లల జాన్వీ, ఖుషీకఫూర్ సమక్షంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.

09/04/2019 - 20:11

కొత్త ఆర్టిస్టులు, నిజజీవిత సంఘటనలతో నిర్మించిన ప్రేమకథా చిత్రం -నీకోసం. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి ఆదరణపొందాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంగీత దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ -ప్రతి ఒక్కరి జీవితంలో ఏదోక సంఘటన ఈ సినిమాలో ఏదోక సీన్‌కి కనెక్టవుతుంది. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. హీరో అరవింద్ రెడ్డి మాట్లాడుతూ -ఈ సినిమా నా ఫ్యామిలీ సపోర్టుతో చేశా.

09/04/2019 - 20:09

ఐదేళ్లు చేసిన ఐటీ జాబ్ వదిలేసి -సినిమాపై ఆసక్తితో కథ రాశా. విజయ్ దేవరకొండతో సినిమా తీయాలన్నది ఆలోచన. విజయ్ దేవరకొండ అందనంత ఎత్తుకు ఎదిగిపోవడంతో -ఆ కథను తానే హీరోగా సినిమా చేశానంటున్నాడు శ్రీపవార్. శ్రీనిక క్రియేటివ్ వర్క్స్‌పై రూపొందిన చిత్రం -2 అవర్స్ లవ్. రచయిత, దర్శకుడు, హీరోగా పరిచయం అవతున్నాడు శ్రీపవార్. కృతిగార్గ్ హీరోయిన్.

09/04/2019 - 20:07

ఓ మంచి ఉద్దేశంతో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తొందర్లోనే వృద్ధిలోకి రావాలని సీనియర్ నటి గీతాంజలి ఆకాంక్షించారు. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ కొత్తగా ఏర్పాటైన ‘టిమా’ కార్యవర్గాన్ని బుధవారం హైదరాబాద్‌లో ప్రకటించారు.

09/03/2019 - 20:41

సైరా విడుదలపై సందిగ్ధ కథనాలు కొనసాగుతుండటంతో -దసరా వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ థియేటర్లు వెతుక్కుంటున్నాయి. ఒక మీడియం, మరో చిన్న సినిమా. సీనియర్ హీరో చిరంజీవినుంచి 151వ ప్రాజెక్టుగా రానున్న సినిమా -సైరా. కొణిదెల ప్రొడక్షన్స్‌పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సినిమాను అక్టోబర్ 2న థియేటర్లకు తేవాలనుకున్నారు. భారీ బడ్జెట్ సినిమా కనుక -బాలీవుడ్‌లోనూ పెద్దఎత్తున విడుదలకు నిర్ణయించారు.

09/03/2019 - 20:39

టాక్‌తో సంబంధం లేకుండా సాహో సత్తా చాటుతున్నాడు. సినిమాలో పసలేదంటూ సమీక్షకులు యునీక్ స్టేట్‌మెంట్ ఇచ్చేసినా -తొలి వారాంతంలో కలెక్షన్ల రికార్డు ట్రేడ్ పండితులకే విస్మయం కలిగిస్తోంది. వినాయక చవితి రూపంలో సోమవారం సెలవు కలిసి రావడంతో -మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్‌ని సాహో దాటేశాడంటూ కథనాలు వస్తున్నాయి.

Pages