S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర

01/14/2018 - 23:54

ప్రస్తుతం టాలీవుడ్‌లో వున్న హీరోయిన్‌లలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యామీనన్. గ్లామర్ పాత్రలకు ఆమడ దూరంలో వున్న ఈ భామ, నటిగా తనదైన సత్తా చాటుకునే పాత్రల్లో మాత్రమే నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈమధ్యే అల్లు అర్జున్ సరసన ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో నటించిన నిత్య, మరోసారి శర్వానంద్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు సిద్ధమైంది.

01/14/2018 - 23:53

నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకి కుడుముల దర్శకత్వంలో ఉషా మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బేనర్‌పై శంకర్‌ప్రసాద్ మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘్ఛలో’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక ఈనెల 25న జరగనున్నది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.

01/14/2018 - 23:51

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం విజయవంతంగా ప్రదర్శించ బడుతుంది. ఈ చిత్రంలో మరో నటుడు వెంకటేశ్ కూడా నటించాడు. అయతే ఇన్ని రోజులు ఆయనకు సంబంధించిన సన్నివేశాలేవి సినిమాలో పెట్టలేదు, తాజాగా నేటి నుండి వెంకటేశ్ నటించిన సన్నివేశాలను కలుపుతున్నారు. ఇప్పటివరకు అజ్ఞాతవాసిగా ఉన్న వెంకి ఈ చిత్రంలో కొద్దిసేపే కనిపిస్తాడట.

01/14/2018 - 23:50

సాహో సెట్లో
అనుష్క సందడి..!

01/14/2018 - 20:22

గాయత్రి గుప్త, శే్వతావర్మ, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో ప్రశాంత్‌కుమార్ దర్శకత్వంలో రెడ్ యాంట్స్ బేనర్‌పై తెరకెక్కుతున్న ‘మిఠాయి’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి విజయ్ దేవరకొండ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో దర్శకులు క్రాంతి మాధవ్, సందీప్ వంగా తదితరులు పాల్గొన్నారు.

01/14/2018 - 20:21

నవీన్‌బాబు, సంజన, అమృత హీరోహీరోయిన్లుగా శ్రీమతి రమాదేవి సమర్పణ లో రామ్‌సాయి గోకులం క్రియేషన్స్ బేనర్‌పై షాలినీ ఫేమ్ షేరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అనగనగా ఓ రాజకుమారుడు’. పి.వి.రాఘవులు నిర్మాత. కమెడియన్ సుమన్‌శెట్టి ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూలును గోవాలో పూర్తి చేసుకుంది.

01/14/2018 - 20:20

తమిళ హీరో అయినా తెలుగు హీరోలతో సమానంగా మార్కెట్‌ను, అభిమానాన్ని సంపాదించుకున్న నటుడు సూర్య. ఆయన సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకూ అంతే ఆసక్తి. సూర్య నటించిన ‘తానా సెరెందాకూట్టమ్’ తమిళ చిత్రాన్ని ‘గ్యాంగ్’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత సూర్య, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

01/14/2018 - 20:18

ఆట టీవీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు ఓంకార్, ఆ తరువాత దర్శకుడిగా మారి రాజుగారి గది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దానికి సీక్వెల్‌గా వచ్చిన రాజుగారి గది-2 కూడా మంచి విజయం సాధించడంతో ఓంకార్ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదు. తాజాగా ఆయన మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈసారి హర్రర్ నేపథ్యంలో కాకుండా ఓ ఆట నేపథ్యంలో సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

01/14/2018 - 20:17

పటాస్ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన నందమూరి కల్యాణ్‌రామ్ ఆ తర్వాత నటించిన రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయాయి. అందుకే ఈసారి కొత్తగా ఆ కట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి ఆయన ఎంఎల్‌ఏ అవతారం ఎత్తాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఆదివారం విడుదల చేసారు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది.

01/14/2018 - 20:16

యువ హీరో నాని దూకుడు మామూలుగా లేదు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్న నాని మరో హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న కృష్ణార్జున యుద్ధం చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని సంక్రాంతి కానుకగా విడుదల చేసారు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తుండడంతో కృష్ణ పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది.

Pages