S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/16/2017 - 19:49

ఎన్.శంకర్ దర్శకత్వంలో మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై సునీల్, మనీషారాజ్ జంటగా రూపొందించిన చిత్రం ‘2 కంట్రీస్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ- మలయాళంలో ఇదే పేరుతో వచ్చిన చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం వినోదాత్మకంగా రూపొందించామని తెలిపారు.

11/16/2017 - 19:48

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ ప్రముఖులు, అభిమానులు అవార్డుల ఎంపిక న్యాయంగా జరగలేదని విమర్శిస్తుండగా, దర్శకుడు గుణశేఖర్ మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేశారు.

11/15/2017 - 21:41

బాలకృష్ణ కథానాయకుడిగా 102వ చిత్రం ‘జై సింహ’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలుగా నయనతాన, నటాషా జోడి, హరిప్రియలు నటిస్తున్నారు.

11/15/2017 - 21:38

తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో వర్క్ చేసిన తమన్నా తాజాగా ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ప్రస్తుతం క్వీన్ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది ఈ మిల్కీ బ్యూటీ. ఇకపోతే తమన్నా ఒక బాలీవుడ్ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. తమిళంలో 2014లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ‘జిగర్‌థండా’ను హిందీలో రీమేక్ చేయనున్నారు.

11/15/2017 - 21:37

‘ప్రేమతో మీ కార్తీక్’ సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమవుతున్నాడు యువ హీరో కార్తికేయ. సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను కార్తికేయ తెలియజేస్తూ- ‘చిన్నప్పటినుండే సినిమాల్లోకి రావాలనుకున్నా. బిటెక్ పూర్తయ్యాక కొన్ని షార్ట్ ఫిలింస్‌లో చేశా.

11/15/2017 - 21:35

రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ పతాకంపై అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో అయితం ఎస్ కమల్ రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఉందా లేదా’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సార్‌కు సిద్ధమైన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో విడుదలచేశారు.

11/15/2017 - 21:34

సిద్ధార్థ్, ఆండ్రియా జంటగా సిద్ధార్థ్ వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మిలింద్‌రావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గృహం’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రిమియర్ షోను బుధవారం హైదరాబాద్‌లో ప్రదర్శించారు. ఈసందర్భంగా హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ- హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనుకున్నా వీలుకావడంలేదని, ఈనెల 17న తెలుగులో విడుదల చేస్తున్నామని తెలిపారు.

11/15/2017 - 21:32

మాస్టర్ రోహిత్ చంద్రా, నితిన్ చంద్రా, బేబి ప్రణీత, బేబి శ్రీయా ముఖ్యపాత్రల్లో కలసాధన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేనే మైఖేల్’ సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ బి.ఎస్.రాములు ఆడియో సీడీని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ- 550 మంది పిల్లలతో ఈ సినిమాను రూపొందించడం గొప్ప విషయమని, మంచి విజయాన్ని అందుకోవాలని తెలిపారు.

11/15/2017 - 21:31

దుల్కర్ సల్మాన్, సాయిపల్లవి జంటగా మలయాళంలో సూపర్‌హిట్ అయిన చిత్రం ‘కలి’. ఈ చిత్రాన్ని తెలుగులో లక్ష్మీ చెన్నకేశవ ఫిలింస్ పతాకంపై డి.వి.కృష్ణస్వామి అందిస్తున్నారు. సమీర్ తాహిర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగులో ‘హేయ్..పిల్లగాడ’ అనే పేరును నిర్ణయించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 24న విడుదలకు సిద్ధమైంది.

11/15/2017 - 21:28

అనేకమంది దర్శక నిర్మాతలు డిజిటల్ రేట్లు చిన్న సినిమాలకు కూడా పెద్ద చిత్రాల స్థాయిలోనే వసూలు చేస్తూండడంతో నష్టాలపాలు అవుతున్నారు. క్యూబ్ తదితర మాధ్యమాల ధరలు తగ్గించాలి అని ‘షాలిని’ దర్శకుడు షెరాజ్ కోరారు. స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమోగ్ దేశ్‌పతి, అర్చన, శ్రేయావ్యాస్ ప్రధాన తారాగణంగా షెరాజ్ దర్శకత్వంలో పి.వి.సత్యనారాయణ రూపొందించిన హారర్ థ్రిల్లర్ ‘షాలిని’ విడుదలైన సంగతి తెలిసిందే.

Pages