S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/02/2017 - 21:49

ఇటీవలే బాహుబలి సినిమాతో దేవసేనగా అందరి మన్ననలు అందుకున్న అనుష్కకు, ఆ చిత్రం తరువాత క్రేజ్ మామూలుగా లేదు. అటు గ్లామర్ పాత్రలు, ఇటు డీగ్లామరైజ్డ్ పాత్రలతో ఇప్పటికే అనుష్క తనకంటూ సెపరేట్ ట్రాక్ వేసుకుంది. మహిళా ప్రాధాన్యత కలిగిన పెద్ద చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. ఆ సమయంలో ఆమె చేసిన బాహుబలి సాధించిన విజయం గురించి చెప్పాల్సిన పనిలేదు.

06/02/2017 - 21:48

బిపిన్, రమ్య జంటగా బిపిన్ దర్శకత్వంలో షిరిడీ సాయి క్రియేషన్స్ పతాకంపై అంజిరెడ్డి సమర్పణలో మందల విజయభాస్కర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘బంగారు తెలంగాణ’.

06/02/2017 - 21:47

అక్కినేని అఖిల్ హీరోగా విక్రంకుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఏప్రిల్ 4 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో మరో షెడ్యూల్‌ను మొదలుపెట్టనుంది. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాటి గ్లామర్ హీరోయిన్ టబు నటిస్తుందట.

06/02/2017 - 21:46

ఒకపక్క డిజె లక్షల్లో లైక్స్‌తో దూసుకుపోతుంటే, మరోపక్క వివాదాలూ అంతేవేగంగా చుట్టుముడుతున్నాయి. ఆమధ్య విడుదల చేసిన పాట ప్రొమో ‘శరణం భజే’ ఇప్పటికి 30 లక్షల వ్యూస్ దాటేస్తే, తాజాగా విడుదల చేసిన సాంగ్ ప్రోమో ‘గుడిల బడిలో వొడిలో’ ఐదు లక్షల వ్యూస్ దాటింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్దె హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం దువ్వాడ జగన్నాథం.

06/02/2017 - 21:45

చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు సంచలనం సృష్టిస్తుంటాయి. మరికొన్ని కాంబినేషన్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతాయి. ఇప్పుడు అలాంటి ఆసక్తిని రేకెత్తించే కొత్త కాంబినేషన్ ఒకటి సెట్ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఆ కాంబినేషన్ ఎవరిదో కాదు, పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్, మాస్ దర్శకుడు వినాయక్‌ది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది.

06/01/2017 - 23:24

‘బాహుబలి’ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది బాహుబలి. రాజవౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ చిత్రం కోసం ఐదేళ్ల సమయాన్ని తీసుకున్నారు. ఒక సినిమా కోసం హీరో ఐదేళ్ల కెరీర్‌ను పణంగా పెట్టడం మామూలు విషయం కాదు. కానీ రాజవౌళి కోసమే తాను ఐదేళ్లు కేటాయించానని చెబుతున్నాడు ప్రభాస్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ-

06/01/2017 - 23:35

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’ చిత్రం ఈమధ్యే విడుదలై ఘనవిజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా హిందీలో డబ్ అయి జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిందీ వెర్షన్ సోనీ టీవీలో ప్రసారం చేసింది.

06/01/2017 - 23:23

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ఆర్ సినిమా, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ‘స్పైడర్’ టీజర్ గురువారం ఉదయం విడుదలై సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో టీజర్ విడుదలైన ఐదు గంటల్లోనే 5 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేయడమే కాకుండా లక్షా 20వేల లైక్స్‌ని సాధించింది. నిజంగా ఇది సంచలనమని చెప్పాలి.

06/01/2017 - 23:22

ప్రముఖ నటుడు శ్రీకాంత్, నాజియా ముఖ్యపాత్రల్లో శ్రీమిత్ర చౌదరి సమర్పణలో వి.జి.చరిష్ యూనిట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ ఎంటర్‌టైనర్ ‘రారా’. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ- ఇటీవలే మోహన్‌లాల్ విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హాస్యంతో కూడిన హర్రర్ థ్రిల్లర్ చిత్రమిది.

06/01/2017 - 23:21

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 101వ చిత్రం విదేశాల్లో జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. ఈ చిత్రంలో ఐటెమ్ సాంగ్‌లో ఖైరాదత్ నటిస్తుందట. కింగ్‌ఫిషర్ మాడల్‌గా మంచి పాపులర్ అయిన ఈమె, గతంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ చిత్రంలో ‘బూచోడే బూచోడే’ అంటూ సాగే పాటలో నర్తించి ఆకట్టుకుంది.

Pages