S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/18/2016 - 21:01

చాలామంది నటీనటులకు బుల్లితెర తొలి వేదికగా నిలుస్తోంది. టీవీ షోల్లో నటించి మెప్పించినవారు సినిమాల్లోనూ నటిస్తున్నారు. మరికొందరు నటీనటులు వెండితెరపై అవకాశాలు మందగించినప్పుడు.. మంచి పారితోషికం ఇస్తే బుల్లితెరకు ఓకే చెప్పేస్తారు. ఆ విధంగానైనా ప్రేక్షకులకు చేరువగా ఉండొచ్చన్నది వారి ఆలోచన. ఇంతలా నటీనటులకు ఉపయోగపడుతున్న టీవీ షో అవకాశం బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసా బసుకు మాత్రం కష్టంగా అనిపిస్తోందట.

11/18/2016 - 20:59

విశాల్, తమన్నా జంటగా హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై యువ నిర్మాత జి.హరి అందిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. సురాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ నెలలోనే విడుదలకావలసిన ఈ చిత్రం ప్రస్తుతం నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

11/18/2016 - 20:58

ఆనంద్‌కృష్ణ, స్వరూప జంటగా బేబి హర్షిత ప్రధాన పాత్రలో నీలిమా ప్రొడక్షన్స్ పతాకంపై సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నీలిమలై’. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ వనపర్తి పరిసర ప్రాంతాల్లో జరుపుతున్నారు.

11/18/2016 - 20:57

దర్శక ధీరుడు రాజవౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. రవితేజ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కథ అందించిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా సీక్వెల్ కోసం కథను సిద్ధం చేస్తున్నాడు.

11/18/2016 - 20:56

ఇండియాలోనే మొట్టమొదటిసారి మోడ్రన్ టెక్నాలజీతో రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన రోబో ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘2.0’. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

11/18/2016 - 20:55

బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ అండర్‌వరల్డ్ డాన్ దావూద్ కుటుంబ సభ్యులను కలవడం బాలీవుడ్‌లో కలకలం రేపింది. దావూద్ సోదరి హసీనాకు సంబంధించి కథతో బాలీవుడ్‌లో ‘హసీనా’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హసీనా పాత్రను శ్రద్ధాకపూర్ పోషిస్తోంది. దీనికి సంబంధించిన వివరాల కోసం దావూద్ కుటుంబ సభ్యులను శ్రద్ధాకపూర్ కలసింది. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఆమె హోంవర్క్ చేస్తోంది.

11/18/2016 - 20:54

సౌత్ బ్యూటీ నయనతార.. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో పీకలోతు ప్రేమలో ఉందనే సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా.. ఆఖరికి విదేశాల్లో జరిగే అవార్డు ఫంక్షన్స్‌కు వెళ్లినపుడు కూడా విఘ్నేష్‌ను వెంట తీసుకెళ్లిపోవడం.. అక్కడ నయన్ చూసి ఈ దర్శకుడు మురిసిపోవడం లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. ఇదంతా ప్రేమపక్షుల వ్యవహారం అనుకుంటున్నారు కానీ.. కొత్త పెళ్లి జంటగా పడుతున్నపాట్లు అనే టాక్ మొదలైపోయింది.

11/17/2016 - 20:56

తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది హాట్ హాట్ అందాల రాశిఖన్నా. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ భామకు వచ్చిన క్రేజ్ మాత్రం ఎక్కువే. బొద్దు బొద్దు అందాలతో ఆకట్టుకుంటున్న రాశిఖన్నా అటు కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అసలే బొద్దు అందాలంటే అక్కడి ప్రేక్షకులకు అదో కిక్. అందుకే ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే రాశికి మూడు సినిమాల ఛాన్సులు వచ్చాయి.

11/17/2016 - 20:54

జయ.బి దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

11/17/2016 - 20:53

యన్నమల్ల ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సుప్రీమ్, పావని జంటగా కిషన్ కన్నయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇది ప్రేమేనా..!’ ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హీరో సుప్రీమ్ మాట్లాడుతూ, విచక్షణ అనే చిత్రంలో సెకెండ్ హీరోగా నటించాను. సోలో హీరోగా చేస్తోన్న తొలి చిత్రమిది. దర్శక నిర్మాత కిషన్ నేను మంచి మిత్రులం. నామీద నమ్మకంతో ఈ సినిమా చేశాడు.

Pages