S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/17/2016 - 20:49

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సాయిధరమ్‌తేజ్. ‘నక్షత్రం’ చిత్రంలో గెస్ట్ పాత్రలో నటిస్తున్న సాయి ధరమ్ మరో క్రేజీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దక్షిణాదిలో ట్రెండ్ క్రియేట్ చేసి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు గౌతమ్ మీనన్. ఆయన సినిమాలంటే ప్రేక్షకులకు చాలా ఆసక్తి. ముఖ్యంగా ప్రేమకథల్ని కొత్తగా డీల్ చేయడంలో ఆయన శైలే వేరు.

11/17/2016 - 20:48

చిన్న సినిమాను బతికించాలంటే ఏం చేయాలి. అదే ఆలోచనతో కొన్ని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కొత్త ఆలోచనలు, అభిరుచులతో సిద్ధమైన లోబడ్జెట్ సినిమాలు బాగుంటున్నా ప్రేక్షకుల చెంతకు వెళ్లడం లేదు. పెద్ద సినిమాలకు లభించినంతగా చిన్న సినిమాలకు థియేటర్లు దొరకకపోవడమే పెద్దసమస్య. ఆ సమస్యను పరిష్కరించాలంటే ప్రతి థియేటర్‌లో రోజుకు ఒక షో అయినా చిన్న సినిమాకు కేటాయించాలి.

11/16/2016 - 23:12

తెలుగు సినిమాలో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగు నేర్చుకుంటారు కానీ ఆదాశర్మ హిందీ సినిమా ఛాన్స్ కోసం తెలుగు నేర్చుకుంటోంది. మీరు విన్నది నిజమే. హిందీ సినిమా కోసం హిందీ వస్తే సరిపోతుందిగా? అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కథ. పూరి దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్‌ఎటాక్’ సినిమాతో బాలీవుడ్ నుండి టాలీవుడ్‌కి పరిచయం అయింది ఆదాశర్మ. ఈ సినిమా తరువాత ఈ అమ్మడికి చాలా సినిమా అవకాశాలే వచ్చాయి.

11/16/2016 - 23:11

ఈమధ్య టెలివిజన్ రంగంలో యాంకర్‌గా హాట్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది అనసూయ. జబర్దస్త్ కార్యక్రమంతో బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు.. అటు సినిమాల్లో కూడా నటిస్తోంది. మరోవైపు అనసూయకు ఐటెం సాంగ్స్ చేయమని తెగ ఆఫర్స్ వస్తున్నాయట. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ వచ్చినా కూడా నో చెప్పింది. మామకు నో చెప్పి అల్లుడి సినిమాలో ఐటెం సాంగ్‌కు ఓకె చెప్పి షాక్ ఇచ్చింది.

11/16/2016 - 23:09

తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితుల్లో ‘స్వామిరారా’ సినిమానుంచి తన ప్రతి సినిమాకూ ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ వస్తోన్న యువ హీరో నిఖిల్, తాజాగా తన కొత్త సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ను విడుదలకు సిద్ధం చేశారు. ఈ శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా గురించి నిఖిల్ చెప్పిన విశేషాలు..

11/16/2016 - 23:05

కొత్త లుక్‌తో కనిపిస్తున్న ఎన్టీఆర్ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. ‘జనతా గ్యారేజ్’ తరువాత ఇంకా ఏ సినిమా మొదలుపెట్టలేదు. తన కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తరువాతి సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలనే ప్లాన్‌లో భాగంగా ఆయన పావులు కదుపుతున్నాడు. ఇక ‘జనతా గ్యారేజ్’ విడుదలై చాలా రోజులు అవుతోంది. ప్రస్తుతం ఇటివద్దనే ఉంటున్న ఎన్టీఆర్ లుక్ ఒకటి సంచలనం రేపుతోంది? అసలు ఎన్టీఆర్ ఏంటి ఇలా తయారయ్యాడు?

11/16/2016 - 23:02

కొత్త టాలెంట్ ఎక్కడ ఉన్నా.. దాన్ని అట్టే పట్టేయడం నాగార్జున స్పెషాలిటీ. కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు ప్రయోగాత్మక సినిమాలతో ఆకట్టుకున్న నాగార్జున ప్రస్తుతం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఓం నమో వేంటేశాయ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి చివర్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత నాగార్జున తన నెక్స్ట్ సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడు.

11/16/2016 - 22:59

ముంబైలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో బాలీవుడ్ తారలు మెరిసిపోయారు.
దర్శకుడు మునేష్ భరద్వాజ్ రూపొందిస్తున్న ‘మోహ్ మాయ మనీ’ చిత్రానికి సంబంధించిన కార్యక్రమంలో నేహాధూపియా అలరిస్తే తను రాసిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో
అలనాటి నటి ట్వింకిల్‌ఖన్నా పాల్గొని అందరినీ ఆకట్టుకుంది.

11/16/2016 - 22:54

ఈమధ్య తెలుగులో మళ్లీ మల్టీస్టారర్ సినిమాల హవా బాగానే ఉంది. ముఖ్యంగా ‘సీతమ్మ వాకిట్లో..’ సినిమాతో ఇద్దరు స్టార్ హీరోలు ఈ మల్టీస్టారర్ సినిమాలకు తెరలేపారు. ఆ తరువాత అలాంటి సినిమాలు రూపొందుతున్నాయి కూడా. అయితే ఇప్పుడు ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమా రానుంది. ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు హీరోలు నటిస్తారట! అవును.. వింటనే షాకింగ్‌గా వుందా.. ఆ వివరాల్లోకి వెళితే..

11/16/2016 - 22:50

ప్రియాంక, బేబీ యులీనా పార్థవి ప్రధాన తారాగణంగా కె.ఆర్.కె. ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ పతాకంపై సంయుక్తంగా లోహిత్ దర్శకత్వంలో కె.రవికుమార్, ఎమ్.ఎమ్.ఆర్ అందిస్తున్న చిత్రం చిన్నారి. తెలుగు,కన్నడ భాషల్లో రూపొందించిన ఈ చిత్రం ఈనెల 25న అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.

Pages