S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/09/2017 - 22:44

మున్నాభాయ్ చిత్రాల పరంపరంలో మూడోదైన మున్నాభాయ్-3కు కథ సిద్ధమైందని బాలీవుడ్ నటుడు, ఆ చిత్రాల్లో నటించిన అర్షద్‌వర్షి ప్రకటించారు. ప్రస్తుతం ‘సంజయ్‌దత్’ బయోపిక్ చిత్రీకరణలో బిజీగా ఉన్నందున అది పూర్తయిన వెంటనే మున్నాభాయ్-3 మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 2018లో ఈ చిత్రం ప్రారంభించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

02/09/2017 - 21:07

‘ఇజం’ తరువాత నందమూరి కల్యాణ్‌రామ్ ఇంతవరకు ఏ సినిమాకు ఓకె చెప్పలేదు. సినిమాల విషయంలో చాలా కేర్‌తో ఉన్న కల్యాణ్‌రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ సినిమాను నిర్మిస్తున్నాడు. దాంతోపాటు ఓ మల్టిస్టారర్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పాడు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ సాధినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.

02/09/2017 - 21:05

ఈతరం అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఉంటున్నారనే అంశంతో వారి లైఫ్ స్టైల్‌ని తెరపై ఆవిష్కరిస్తూ సహజత్వానికి దగ్గరగా ఉండేలా వెంకటేష్.కె ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ స్పైసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రశాంత్, మహీధర్, లలిత, ఇషితా హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రశ్నార్ద్ తాతా నిర్మించారు.

02/09/2017 - 21:01

విజయ్ ఆంటోని కథానాయకుడిగా లైకా ప్రొడక్షన్స్, ద్వారకా క్రియేషన్స్ పతాకాలపై జీవశంకర్ దర్శకత్వంలో మిర్యాల రవిందర్‌రెడ్డి తెలుగులో అందిస్తున్న చిత్రం యమన్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. మహాశివరాత్రి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాతలు తెలియజేస్తున్నారు.

02/09/2017 - 20:59

విలక్షణ నటుడు విక్రమ్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘్ధృవ నచ్చత్తిరం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. దీంతో విక్రమ్ విజయ్‌చందర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. ఈనెల 10 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూట్ మొదలవుతుంది. మొదట ఈ ప్రాజెక్టులో విక్రమ్ జోడీగా ‘ప్రేమమ్’ ఫేం సాయి పల్లవిని అనుకున్నారు.

02/07/2017 - 21:11

నూతన తారలు మనోజ్ నందన్, భారతి జంటగా కె.పి.ఆర్ క్రియేషన్స్ పతాకంపై పురందర్ దాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నీ ఊహల్లోనే ఉంటా’. షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాల్లో భాగంగా సెన్సార్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా పురందరదాస్ మాట్లాడుతూ- ‘రాయలసీమలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు.

02/07/2017 - 21:09

రవితేజ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అనీల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ రూపొందిస్తున్న చిత్రం ‘రాజా ది గ్రేట్’ (వెల్‌కమ్ టు మై వరల్డ్). రవితేజ, కథానాయిక మెహరీన్‌లపై ముహూర్తపు సన్నివేశానికి కళ్యాణ్‌రామ్ క్లాప్‌నిచ్చారు.

02/07/2017 - 21:07

భిన్నమైన సినిమాలు చేస్తూ హీరోగా రోజురోజుకూ తన మార్కెట్ స్థాయిని పెంచుకుంటున్నాడు హీరో సూర్య. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘సింగం-3’. గతంలో వచ్చిన సింగం, సింగం- 2 సినిమాలు సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పణలో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించారు.

02/07/2017 - 21:05

పవన్‌కళ్యాణ్, శ్రుతిహాసన్ హీరోహీరోయిన్లుగా నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కిశోర్ పార్థాసాని దర్శకత్వంలో శరత్ మరార్ రూపొందిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలను ఇటీవల విడుదల చేయగా మంచి ఆదరణ పొందుతున్నాయని దర్శక నిర్మాతలు తెలియజేశారు. తాజాగా ఓ కొత్త లుక్‌ను మీడియాలో విడుదల చేశారు.

02/07/2017 - 21:03

అర్జున్ మహి, అశ్విని జంటగా శ్రీ మూవీ మేకర్స్ పతాకంపై రిమ్మలపూడి వీరగంగాధర్ రూపొందిస్తున్న చిత్రం ‘నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్’. రవిచంద్ర కన్నికంటి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకులు వీరశంకర్, దేవిప్రసాద్, బాబ్జి, రావిపల్లి రాంబాబు సంయుక్తంగా సీడీని విడుదల చేశారు.

Pages