S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/24/2017 - 20:56

సూర్య, శ్రుతి హాసన్, అనుష్క నటించిన చిత్రం ఎస్3 (యముడు-3’. ఈ చిత్రానికి హరి దర్శకుడు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సగర్వంగా సమర్పిస్తూ తెలుగులో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్ నిర్మించారు. హారీస్ జైరాజ్ సంగీతం అందించారు. జనవరి 26న విడుదల కావలసిన ఈ చిత్రం తమిళనాట నెలకొన్న పరిస్థితుల కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నారు.

01/24/2017 - 20:54

ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా తన ప్రతిభతో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగుతోంది ప్రియాంకా చోప్రా. అక్కడి నుండి హాలీవుడ్‌కి కూడా వెళ్లింది. అమెరికాలోని క్వాంటికో షోతో హాలీవుడ్ రిలయాలిటీ షోలతో బిజీ బిజీగా వుంది ప్రియాంక. ఇటీవల ఆమె ‘కాఫీ విత్ కరన్ షో’లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో కరన్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆశ్చర్యపోయే సమాధానాలు ఇచ్చింది.

01/24/2017 - 20:51

వరుణ్‌తేజ్ వరుస చిత్రాలతో బిజీగా మారిపోతున్నాడు. ఇప్పటికే మిస్టర్, ఫిదా చిత్రాలతో బిజీగా వున్న వరుణ్‌తేజ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం కృష్ణగాడి వీరప్రేమగాధ ఫేమ్ మెహ్రీన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఎస్.వి.సి.సి బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా మెహ్రీన్ రవితేజ, సాయిధరమ్ తేజ్‌ల సరసన కూడా నటించనుంది.

01/24/2017 - 20:48

రజత్, నేహాహింగే జంటగా రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ బృందావనం, సునీత సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం శ్రీవల్లీ. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి ఆడియో సీడీని విడుదల చేశారు. థియేటర్ ట్రైలర్‌ను దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు.

01/24/2017 - 20:46

ఓమ్ శ్రీ క్రియేషన్స్ పతాకంపై ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో ఎం.ఎన్.బైరారెడ్డి, నాగరాజు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ప్రేమభిక్ష. అనీల్‌కుమార్, శ్రుతిలయ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

01/24/2017 - 20:44

అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ చిత్రం రూపొందుతోంది. తెలుగులో చిత్రాంగద పేరుతో, తమిళంలో యార్నీ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ థ్రిల్లర్, కామెడీ చిత్రాన్ని దర్శకుడు శ్రీవిఘ్నేష్, కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.

01/24/2017 - 20:43

సన్నజాజి నడుము సుందరి, అందాల హాట్ భామ ఇలియానా టాలీవుడ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రస్తుతం బాలీవుడ్‌కి చెక్కేసింది. ఇక్కడ టాప్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లో వెలిగిపోవాలని అనుకున్నా ఆ కలలు కల్లలయ్యాయి. బాలీవుడ్‌లో చేసిన రెండు, మూడు సినిమాలు ఆమెకు పెద్దగా క్రేజ్ తీసుకురాలేదు. ఎలాగూ సినిమాలు లేవు కదా అని ప్రేమాయణంలో జోరు పెంచింది.

01/22/2017 - 22:09

తొమ్మిదేళ్ల విరామం అనంతరం తాజాగా 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సంక్రాంతికి విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాతో మళ్లీ మెగాస్టార్ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. పది రోజుల్లో 100 కోట్ల మార్కెట్‌ను క్రాస్ చేశాక జోరు మీదున్న చిరు ఇపుడు తన 151వ చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు.

01/22/2017 - 22:08

‘అ ఆ’ సినిమాతో కమర్షియల్ విజయాన్ని అందుకుని, 50 కోట్ల క్లబ్‌లో చేరాడు యువ హీరో నితిన్. ఆ సినిమా తర్వాత ఆచితూచి అడుగులేస్తూ సినిమాలు చేస్తున్నాడు. విభిన్నమైన కథలతో సినిమాలు చేసేందుకు డిసైడైన నితిన్ ప్రస్తుతం అను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. పాతబస్తీకి చెందిన మిడిల్ క్లాస్ కుర్రాడిగా సరికొత్త గెటప్‌లో నితిన్ కనిపించనున్నాడు.

01/22/2017 - 21:01

నవదీప్, కావ్యాశెట్టి జంటగా ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో లెజెండ్ పిక్చర్స్ పతాకంపై రమేష్‌బాబు కొప్పుల నిర్మిస్తున్న చిత్రం ‘నటుడు’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలవుతున్న సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడుతూ, ‘ఈ చిత్రం నటుడిగా నా కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది. అన్నిరకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అన్నారు.

Pages