S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/15/2017 - 03:34

ముంబయి, నవంబర్ 14: ఆర్‌పార్, బర్సాత్‌కీ రాత్, మిలన్, శారద సహా దాదాపు 175 చిత్రాల్లో భిన్న పాత్రలు పోషించి అలనాటి ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటి శ్యామా (82) మంగళవారం నాడిక్కడ కన్నుమూశారు. గురుదత్ కథానాయకుడిగా నటించి ఆర్‌పార్ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. శారద చిత్రంలో ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు పొందారు.

11/15/2017 - 03:33

న్యూఢిల్లీ, నవంబర్ 14: భారతీయులకు ఓ తీపి కబురు. 1990నుంచీ జీవన ప్రమాణ అంచనా పదేళ్లకుమించి పెరిగినట్టు అధ్యయనాలు తేటతెల్లం చేశాయి. కానీ, ఈ జీవన ప్రమాణకాలంలో రాష్ట్రాల మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉందని లానె్సట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది. లానె్సట్ నివేదిక ప్రకారం మహిళల జీవన ప్రమాణం ఉత్తరప్రదేశ్‌లో 66.8 ఏళ్లుంటే, కేరళలో 78.7 సంవత్సరాలుగా ఉంది.

11/15/2017 - 03:32

న్యూఢిల్లీ, నవంబర్ 14: ఓ కేసులో నిందితులకు ‘అనుకూల తీర్పు’ కోసం న్యాయమూర్తుల పేరిట లంచాలు వసూలు చేశారన్న ఆరోపణలపై ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్) ఏర్పాటుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. న్యాయమూర్తులకు లంచాల ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారించాలన్న వ్యాజ్యాలను త్రోసిపుచ్చడమే గాక పిటిషనర్లను సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా మందిలించింది.

11/15/2017 - 03:31

న్యూఢిల్లీ, నవంబర్ 14: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాలను నవంబర్‌లో నిర్వహించకుండా డిసెంబర్‌కు వాయిదా వేయటంతోపాటు సమావేశాల నిడివిని కుదించివేయటంపై రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేయాలని ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. ఎన్‌డీయే అధికారంలోకి వచ్చినప్పటినుండి పార్లమెంటు నిర్లక్ష్యానికి గురవుతోందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

11/15/2017 - 03:30

న్యూఢిల్లీ, నవంబర్ 14: రసగుల్లా ‘్భగోళిక మూలాల’పై పశ్చిమ బెంగాల్, ఒడిశా మధ్య చిరకాలంగా నెలకొన్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. మిఠాయిల్లో విశిష్టతను కలిగిన రసగుల్లాపై ‘యాజమాన్య హక్కుల’ కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలైన బెంగాల్, ఒడిశా మధ్య పోరాటం ఇక ముగిసినట్టే. రసగుల్లా భౌగోళిక మూలాలపై చరిత్రారులను సంప్రదించి ఇరు రాష్ట్రాలూ తమ వాదనలను వినిపిస్తూ, కొన్ని పురాతన పత్రాలను కేంద్రానికి సమర్పించాయి.

11/15/2017 - 03:30

న్యూఢిల్లీ, నవంబర్ 14: అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలం సమస్య పరిష్కారానికి కేంద్రం అత్యుత్సాహం చూపిస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తోసిపుచ్చారు. వివాద పరిష్కారానికి జరుగుతున్న చర్చల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుందన్న కథనాలను మంగళవారం ఆయన ఖండించారు.

11/15/2017 - 02:10

న్యూఢిల్లీ, నవంబర్ 14: ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర శాసనసభ సీట్ల పెంపకం, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయటంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి, సీనియర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

11/13/2017 - 05:17

పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా గాంధీనగర్‌లో రాజ్‌పుత్ కర్ని సేన సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించిన దృశ్యం... సూరత్‌లోనూ నిరసన ప్రదర్శన నిర్వహించిన రాజ్‌పుత్‌లు

11/13/2017 - 04:43

పలన్‌పూర్ (గుజరాత్), నవంబర్ 12: మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పాల్పడిన నీతి బాహ్యమయిన చర్యపై మీ సమాధానం ఏమిటంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. రాహుల్ గాంధీ తన ఉత్తర గుజరాత్ పర్యటనలో రెండో రోజయిన ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీని, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని ప్రసంగించారు.

11/13/2017 - 04:41

న్యూఢిల్లీ, నవంబర్ 12: దేశంలోని తొమ్మిది హైకోర్టులకు 40 మంది కొత్త న్యాయమూర్తులను నియమించడంపై సుప్రీంకోర్టు కొలీజియం దృష్టి సారించనుంది. 40 మంది కొత్త న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి తొమ్మిది హైకోర్టుల నుంచి వచ్చిన సిఫారసులను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించి, సుప్రీంకోర్టు కొలీజియంకు పంపించిందని ఒక అధికారి తెలిపారు.

Pages