S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/25/2017 - 02:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం ఇక్కడ జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ పనితీరును సమీక్షించారు. రెండు రోజులపాటు సాగే జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభించిన అమిత్ షా, అనంతరం పార్టీ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు, రాష్ట్ర శాఖల అధ్యక్షులు, ఇతర నాయకులతో సమావేశమై జాతీయ కార్యవర్గంలో చర్చించాల్సిన అంశాలకు, చేయాల్సిన తీర్మానాలకు తుదిరూపం ఇచ్చారు.

09/25/2017 - 02:09

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎం సేవలను విస్తృతం చేయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు.

09/24/2017 - 03:17

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ముంబాయి పేలుళ్ల సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం భార్య మెహజబీన్ షేక్ గత సంవత్సరం ముంబాయికి దొంగచాటుకు వచ్చిపోవటంపై ఎన్‌డిఏ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా డిమాండ్ చేశారు.

09/24/2017 - 03:15

షాహన్‌షాపూర్, సెప్టెంబర్ 23: భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అభివృద్ధే అజెండాగా పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం వారణాసిలో శనివారం రెండోరోజు మోదీ పర్యటన సాగింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని తోసిపుచ్చారు. ‘కొందరు రాజకీయ నాయకులు ఓట్లకోసమే రాజకీయాలు చేస్తుంటారు.

09/24/2017 - 03:12

జైపూర్, సెప్టెంబర్ 23: న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న అభియోగంపై రాజస్థాన్‌లోని ఫలహారీ బాబాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆల్వార్‌లోని మధుసూదన్ ఆశ్రమానికి వెళ్లిన తనపై స్వామి కౌశలేంద్ర ప్రపన్నాచారి ఫలహారీ మహారాజ్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కొద్దిరోజుల క్రితం చత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్ జిల్లాకు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

09/24/2017 - 03:11

జమ్ము, సెప్టెంబర్ 23: పాకిస్తాన్ బలగాలు శుక్రవారం రాత్రంతా జమ్ము, సాంబా, పూంచ్ జిల్లాల్లోని భారత సరిహద్దు ఔట్‌పోస్టులను, గ్రామాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డాయి. ఫిరంగి గుండ్లను కురిపించాయి. ఈ దాడుల్లో భారత సరిహద్దు దళం (బిఎస్‌ఎఫ్)కు చెందిన ఇద్దరు జవాన్లు, అయిదుగురు పౌరులు గాయపడ్డారని అధికారులు శనివారం తెలిపారు.

09/24/2017 - 03:08

ముంబయి, సెప్టెంబర్ 23: ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త అంజలి దమానియాకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి బిజెపి నేత ఏక్‌నాథ్ ఖాడ్సెకు వ్యతిరేకంగా ఆమె వేసిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాడు. కాల్ వచ్చిన నెంబర్‌ను ట్రూకాలర్ యాప్ ‘దావూద్’ ఫోన్‌గా గుర్తించింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

09/24/2017 - 03:07

కోల్‌కతా, సెప్టెంబర్ 23: భారత్-చైనాల బంధం ఏమాత్రం సడలిపోదని చైనా కాన్సుల్ జనరల్ మా జాన్వు స్పష్టం చేశారు. వివాదాస్పద డొక్లామ్ అంశాన్ని పక్కనపెట్టి ధ్రుఢచిత్తంతో రెండు దేశాలూ మైత్రి దిశగా ముందడుగు వేస్తున్నాయన్నారు. పరస్పరం సహాయ సహకారాలు అందించుకునేందుకు దూరదృష్టితో ముందుకు వెళ్తున్నామని జాన్వు ఉద్ఘాటించారు. ‘్భరత్-చైనా కలిసే పని చేస్తున్నాయి.

09/24/2017 - 03:06

కోచి / తిరువనంతపురం, సెప్టెంబర్ 23: తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని, మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని కేరళ రవాణా మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు థామస్ చాందీ తేల్చిచెప్పారు. అలప్పుజా జిల్లాలో బ్యాక్‌వాటర్ ప్రాంతంలో చాందీ ఆక్రమణలకు పాల్పడ్డాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

09/24/2017 - 03:05

సమాజ్‌వాదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న యుపి మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్, తదితరులు

Pages