S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/27/2017 - 02:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: పోలవరం ప్రాజెక్టును ఫాస్ట్ ట్రాక్‌లో పెట్టి ఆటో పైలెట్ ప్రాజెక్టు కింద జల వనరులు, ఆర్థిక శాఖలు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తే తప్ప సకాలంలో పూర్తికాదని సిఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జేట్లీ, జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీలతో మంగళవారం సమావేశమై పరిస్థితిని వివరించారు. 3ఇది చాలా ముఖ్యమైన విషయం.

09/26/2017 - 02:42

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: గుజరాత్‌లో అధికారంకోసం బిజెపి, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరాటం ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలును ఈ నెలాఖరుకు ప్రకటించే అవకాశాలున్నాయి. ఆయితే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల షెడ్యూలు విడుదల కాకముందే బిజెపికి కంచుకోటలాంటిదైన గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించి అందరిని ఆశ్చర్యపరిచారు.

09/26/2017 - 02:37

లక్నో / వారణాసి, సెప్టెంబర్ 25: బెనారస్ హిందూ యూనివర్సిటీ (బిహెచ్‌యు)లో గురువారం జరిగిన ఈవ్ టీజింగ్, అనంతరం విసి ఇంటివద్ద శనివారం రాత్రి జరిగిన లాఠీచార్జీ ఘటనపై పూర్తి వివరాలు సేకరించేందుకు ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని నియమిస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ సోమవారం వెల్లడించారు.

09/26/2017 - 02:31

జంషెడ్‌పూర్, సెప్టెంబర్ 25: జార్ఖండ్‌లోని తూర్పు సింఘ్‌భూమ్ జిల్లాలో ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా నలుగురు గాయపడ్డారు. ప్రమాదానికి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచానే కారణమని రూరల్ ఎస్పీ ప్రభాత్ కుమార్ వెల్లడించారు. ఘట్‌షిలా సబ్ డివిజన్ పరిధిలోని కుమార్‌దుబి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

09/26/2017 - 02:28

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ఆన్‌లైన్లో ఐఆర్‌టిసి ద్వారా టికెట్లు బుకింగ్‌కు అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులను అనుమతిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. కొన్ని బ్యాంకుల డెబిట్ కార్డులు మాత్రమే అనుమతిస్తున్నట్టు వినియోగదారులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. పేటియం సహా పలు గేట్‌వేలద్వారా బుకింగ్‌కు అనుమతిస్తుండం, కొన్ని బ్యాంకుల డెబిట్ కార్డులపై ఆంక్షలు విధించారని గగ్గోలు పెట్టేవారు.

09/26/2017 - 02:46

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: జర్మనీ చాన్స్‌లర్‌గా ఏంజెలా మెర్కెల్ నాలుగోసారీ విజయం సాధించారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంనాటి నుంచీ ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ఇటు అధికార కన్జర్వేటివ్ పార్టీకి, నేషనలిస్ట్ పార్టీకి కూడా ప్రతికూలమైన తీర్పునే ప్రజలు అందించారు. గతంతోపోలిస్తే కన్జర్వేటివ్‌ల ఓటు శాతం గణనీయంగా తగ్గింది. తొలిసారిగా వలసవాద వ్యతిరేక పార్టీ పార్లమెంట్‌లో అడుగు పెట్టబోతోంది.

09/26/2017 - 02:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: సామాజిక దురాచారమైన దేవదాసి వ్యవస్థ కొనసాగుతుందన్న ఆరోపణలపై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం (ఏన్‌హెచ్‌ఆర్సీ) నోటీసులు జారీచేసింది. తమిళనాడు తిరువల్లూరు జిల్లాలో మాతమ్మ తల్లి దేవాలయానికి తీసుకెళ్లి బాలికలు, మహిళలను బలవంతంగా దేవదాసీలుగా మారుస్తున్నారని వచ్చిన ఫిర్యాదులు, మీడియాలో వార్తలు ఆధారంగా నోటీసులు జారీ చేసినట్టు కమిషన్ వెల్లడించింది.

09/26/2017 - 02:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: దళిత హక్కులకోసం పోరాడుతున్న ప్రొ. కంచె ఐలయ్యపై వరంగల్‌లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏఐసిసి అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐలయ్యను నడి బజారులో చంపాలంటూ బిజెపి మిత్రపక్షమైన తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ బహిరంగ ప్రకటన చేయటం హేయమైన చర్య అని విమర్శించారు.

09/26/2017 - 02:00

కాకినాడ, సెప్టెంబర్ 25: భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు బంగ్లాదేశ్‌లోని శరణార్థులకు అందించడానికి సుమారు 620 టన్నుల ఆహార పదార్థాలతో ఐఎన్‌ఎస్ ఘరియార్ నౌక సోమవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్టు నుండి బయలుదేరివెళ్లింది. నాఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఈ ప్రత్యేక నౌకలో బంగ్లా శరణార్థులకు ఆహార పదార్ధాలను పంపింది. వివిధ ఆహార పదార్ధాలతో కూడిన సుమారు 62వేల ప్యాకెట్లను నౌకలో పంపారు.

09/26/2017 - 01:23

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటన సోమవారం మొదలైంది. ద్వారక నుంచి జామ్‌నగర్ వరకూ రోడ్ షో నిర్వహించేందుకు రాహుల్ సిద్ధమవుతున్న తరుణంలో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, రాహుల్ రెండెడ్ల బండి ఎక్కారు. ఇలా ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Pages