S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/26/2017 - 01:21

చెన్నయి, సెప్టెంబర్ 25: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

09/26/2017 - 01:19

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఇవ్వాల్సిన వాటా లో పెండింగ్ నిధులు సహా రూ.2800 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. సోమవారం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి పర్యటన ముగించుకున్న సిఎం చంద్రబాబు సాయంత్రం ఢిల్లీకి చేరుకుని కేంద్ర ఉపరితల రవాణా, జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమయ్యారు.

09/26/2017 - 01:17

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: భారత కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్‌గా (కాగ్) మాజీ హోం కార్యదర్శి రాజీవ్ మెహర్షి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం పదవీ విరమణ చేసిన శశికాంత్ స్థానే ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. రాష్టప్రతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 62ఏళ్ల మెహర్షి చేత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు.

09/26/2017 - 01:12

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: అవినీతికి వ్యతిరేకంగా తాను చేపట్టిన పోరాటంలో రాజీ పడే ప్రసక్తేలేదని, ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టే పరిస్థితీ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇక్కడ పునరుద్ఘాటించారు. బిజెపి జాతీయ కార్యనిర్వాహకవర్గ సమవేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన మోదీ, అవినీతి వ్యతిరేక పోరాటంలో రక్షించుకోడానికి తనకంటూ ఎవరూ బంధువులు లేరని ప్రతిపక్షాలకు చురక వేశారు.

09/26/2017 - 01:09

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: పేదలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు అందించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం సోమవారం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. వచ్చే ఏడాది డిసెంబర్ 18నాటికల్లా నాలుగు కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని హిందూత్వ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు.

09/25/2017 - 02:19

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ప్రతి నెలా తాను రేడియో ద్వారా ఇస్తున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమం పట్ల ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ప్రజల స్పందనను రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రతిఫలింపజేయడానికే ప్రయత్నించానని తన మనసులోని భావలను మరోసారి వ్యక్తం చేశారు.

09/25/2017 - 02:16

వారణాసి / లక్నో, సెప్టెంబర్ 24: బెనారస్ హిందూ యూనివర్సిటీ (బిహెచ్‌యు)లో శనివారం రాత్రి పోలీసులు జరిపిన లాఠీ చార్జీలో పలువురు విద్యార్థులతోపాటు ఒక మహిళ, ఇద్దరు జర్నలిస్టులు గాయపడ్డారు. ఈ సంఘటనతో సోమవారం నుంచి అక్టోబర్ రెండు వరకు యాజమాన్యం యూనివర్సిటీకి సెలవులు ప్రకటించింది. ఈ సంఘటనపై యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డివిజనల్ కమిషన్‌ను వివరణ కోరారు.

09/25/2017 - 02:12

శ్రీనగర్/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులను సమకూరుస్తున్నారన్న సమాచారం మేరకు కాశ్మీర్ యూనివర్సిటీలో పిహెచ్‌డి చదువుతున్న ఓ విద్యార్థికి, వాణిజ్య సంఘాల నేతకు, ఇద్దరు హురియత్ నేతలకు సోమవారం హాజరు కావాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సమన్లు జారీ చేసింది.

09/25/2017 - 02:11

తిరువనంతపురం, సెప్టెంబర్ 24: పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు గోరక్షకులు అవరోధంగా మారారని కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి కె. రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక పాల దిగుబడిని ఇచ్చే గుజరాత్‌కు చెందిన గిర్ ఆవులను దిగుమతి చేసుకోవాలన్న ప్రభుత్వ ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు.

09/25/2017 - 02:11

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: దేశవ్యాప్తంగా మిగిలిపోయిన సూపర్ స్పెషాలిటీ సీట్లను భర్తీ చేయాలని కేంద్రానికి టిఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి ఆయన లేఖ రాశారు. మిగిలిపోయిన సీట్ల భర్తీకోసం అక్టోబర్ ఏడవ తేదీ లోపు కౌన్సిలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వినోద్ కోరారు.

Pages