S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/24/2017 - 02:48

బెంగళూరు, సెప్టెంబర్ 23: ప్రముఖ శాస్తవ్రేత్త సిఎన్‌ఆర్ రావుకు ప్రతిష్ఠాత్మక వాన్ హిపెల్ అవార్డు లభించింది. ఆసియాకు చెందిన ఒక సైంటిస్టుకు ఈ అవార్డు దక్కడం ఇదే మొదటిసారి. పదార్ధాలు (మెటీరియల్స్)పై విస్తృతంగా పరిశోధనలు చేసిన రావును, ఆయన సేవలకు గుర్తింపుగా అవార్డుకు ఎంపిక చేశారు.

09/24/2017 - 02:27

మొహాలి, సెప్టెంబర్ 23: పంజాబ్‌లోని మొహాలిలో సీనియర్ జర్నలిస్టు, ఆయన తల్లి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. వారి మెడపై కత్తిగాట్లున్నాయి. ఇటీవలే కర్నాటకలో ప్రముఖ జర్నలిస్టు గౌరీ శంకర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఒకరి తర్వాత ఒకరుగా పత్రికా రంగానికి చెందినవారు హత్యకు గురవుతుండటం సంచలనాలు సృష్టిస్తోంది.

09/24/2017 - 01:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: నోయిడాలో గ్యాంగ్ రేప్‌కు గురైన బిపివో ఉద్యోగిని దుండగులు ఢిల్లీలో వదలి వెళ్లారు. నోయిడాలో కిడ్నాప్ చేసిన యువతిపై కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు కారులోనే పలుమార్లు అత్యాచారం చేశారని, ఆతర్వాత బాధితరాలిని ఢిల్లీ గోల్ఫ్ కోర్స్ మెట్రో సమీపంలో పడేసి వెళ్లిపోయారని పోలీసు అధికారులు తెలిపారు.

09/23/2017 - 02:32

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: సరిహద్దుల్లో తరచూ కాల్పుల ఉల్లంఘనలతో కవ్వింపులకు దిగుతున్న పాకిస్తాన్‌కు శుక్రవారం భారత్ గట్టి హెచ్చరిక చేసింది. నియంత్రణ రేఖవద్ద అలజడి ధోరణి కట్టిపెట్టకుంటే ప్రతీకార దాడులు జరిపే హక్కును భారత్ ఏ క్షణంలోనైనా వినియోగిస్తుందని తెగేసి చెప్పింది.

09/23/2017 - 02:28

వారణాసి, సెప్టెంబర్ 22: గత ప్రభుత్వాలకు అభివృద్ధి అంటే ఇష్టం లేదని, ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రభుత్వ ఖజానాను నాశనం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రంగా ధ్వజమెత్తారు.

09/23/2017 - 02:23

చిత్రం..అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సుస్మిత దేవ్‌కు మిఠాయ తినిపిస్తున్న మాజీ అధ్యక్షురాలు శోభా ఓఝా

09/23/2017 - 02:20

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: అన్నాడిఎంకె పార్టీ గుర్తయిన రెండాకులపై తలెత్తిన వివాదంపై ఎన్నికల కమిషన్ అక్టోబర్ 5న విచారణ జరుపుతుంది. రెండాకుల గుర్తు తమకే కేటాయించాలంటూ పార్టీలోని ప్రత్యర్థి వర్గాలయిన పన్నీర్‌సెల్వం, శశికళ వర్గాలు డిమాండ్ చేయడంతో ఇసి ఆరునెలల క్రితం ఈ గుర్తును స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఈ రెండు వర్గాలు తాజాగా తమ వాదనలను సమర్పించడానికి ఇసి ఈ నెల 29 వరకు గడువు ఇచ్చింది.

09/23/2017 - 02:19

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: అత్యాచార బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకు ఏర్పాటుచేసిన నిర్భయ నిధి వినియోగానికి సంబంధించి ఓ విధానమంటూ లేకపోవడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యంగా బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించే విషయంలో పరిస్థితి దారుణంగా ఉందని ఏ రకమైన స్పష్టత లేదని తెలిపింది.

09/23/2017 - 02:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: అవినీతి ఆరోపణలతో పదవీచ్యుతుడైన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. నవాజ్ షరీఫ్, ఆయన సన్నిహిత కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయాలని, ఆస్తులను జప్తు చేయాలని పాక్ అవినీతి నిరోధక సంస్థ అయిన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌బిఏ) ఆదేశించింది.

09/23/2017 - 02:17

డెహ్రాడూన్, సెప్టెంబర్ 22: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తన జిల్లా యూనిట్ల సంఖ్యను 23 నుంచి 13కు తగ్గించాలని బిజెపి నిర్ణయించింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల రెండు రోజుల పాటు చేసిన రాష్ట్ర పర్యటన సందర్భంగా పార్టీ జిల్లా యూనిట్ల సంఖ్యను 13కు పునర్ వ్యవస్థీకరించాలని ఆదేశించారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ శుక్రవారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు.

Pages