S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/27/2017 - 02:37

శ్రీనగర్, సెప్టెంబర్ 26: జమ్మూ, కాశ్మీర్‌లో శాంతి మొగ్గ తొడుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు గౌరవప్రదమైన జీవితం గడిపేలా చూసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

09/27/2017 - 02:35

ముంబయి, సెప్టెంబర్ 26: మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితుల్లో ఒకరయిన రిటైర్డ్ ఆర్మీ మేజర్ రమేశ్ ఉపాధ్యాయ్‌కు బాంబే హైకోర్టు మంగళవారం బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో మిగతా ప్రధాన నిందితులందరికీ హైకోర్టు, సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసినందున న్యాయమూర్తులు రంజిత్ మోరే, సాధనా జాదవ్‌లతో కూడిన బెంచ్ ఉపాధ్యాయ్‌కు లక్ష రూపాయల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి రెండు పూచీకత్తులపై బెయిలు మంజూరు చేసింది.

09/27/2017 - 02:34

చిత్రం..కర్నాటకలోని గదగ్ జిల్లాలో వ్యర్థాల పునర్వినియెగం విధానాన్ని ప్రారంభిస్తున్న ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు

09/27/2017 - 02:33

చిత్రం..ముంబయలోని బాంద్రాలో మంగళవారం ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ క్రికెటర్ సచిన్ తెండూల్కర్, ఆయన కుమారుడు అర్జున్.

09/27/2017 - 02:16

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 26: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం షార్‌లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సీనియర్ టెక్నిషియన్ శ్రీకాంత్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అందిన సమాచారం మేరకు శ్రీహరికోటలోని స్రాప్ వద్ద 140 నెంబరుగల భవనంలో ఘన ఇంధన తయారీ కేంద్రంలో వ్యర్థాలు తొలగించే సమయంలో మంటలు చెలరేగాయి.

09/27/2017 - 02:03

వడోదర, సెప్టెంబర్ 26: దేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి 10,881 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం డెయిరీ ప్రాసెసింగ్, వౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (డిపిఐడిఎఫ్)ను ఏర్పాటు చేసింది. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ మంగళవారం నాడు ఈ విషయాన్ని ప్రకటించారు.

09/27/2017 - 01:17

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: దేశ స్వాతంత్య్రయోధులు కలలుగన్న నవభారతాన్ని ఆవిష్కరించే దిశగా ఉమ్మడి స్ఫూర్తి, చిత్తశుద్ధితో పని చేయాలని యువ ఐఏఎస్‌లకు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్లకాలంలో సమరయోధుల కలలను నెరవేర్చే దిశగా భారతావనిని తీర్చిదిద్దే బాధ్యతను స్ఫూర్తిదాయక రీతిలో భుజాన వేసుకోవాలని సూచించారు.

09/27/2017 - 01:15

ఢిల్లీ, సెప్టెంబర్ 26: డేరా బాబా దత్తపుత్రికగా చెలామణీ అవుతోన్న హనీప్రీత్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించింది. పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. మంగళవారం హనీప్రీత్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం, పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదంటూ ఆమెతరఫు న్యాయవాదిని నిలదీసింది.

09/28/2017 - 19:53

శ్రీనగర్, సెప్టెంబర్ 26: కరుడుకట్టిన ఉగ్రవాది లష్కరే తోయిబా ఇస్లాం అధినేత అబ్దుల్ ఖయూమ్ నజార్‌ను భద్ర తా దళాలు మంగళవారం అంతం చేశా యి. యూరి సెక్టార్‌లోని జోరావార్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఖయూం హతుడయ్యాడు. అతడికి హిజ్బుల్ ముజాహిదీన్‌తో కూడా సంబంధాలు ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

09/27/2017 - 02:23

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద కేంద్రాలున్నా సహించేది లేదని అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ మంగళవారం నాడిక్కడ ఉద్ఘాటించారు. ఇలాంటి ఉగ్రవాద సురక్షిత కేంద్రాలను నిర్మూలించడమే ధ్యేయంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఈ ఉగ్రవాద మహమ్మారిని తుదముట్టించేందుకు కలిసికట్టుగా పని చేయాలని భారత్, అమెరికాలు తీర్మానించుకున్నాయని తెలిపారు.

Pages