S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/13/2017 - 02:16

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: దేశంలో మొట్టమొదటిగా ఒడిశా రాష్ట్రంలోని మహానది, గోదావరి నదుల మధ్య అనుసంధానం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మంగళవారం విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కారీ ఆధ్వర్యంలో నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సొసైటీ 31వ వార్షిక సాధారణ సమావేశం జరిగింది.

09/13/2017 - 02:02

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: విడాకులకు సంబంధించి హిందూ వివాహ చట్టంలో కీలక మార్పులను సుప్రీం కోర్టు సూచించింది. విడాకుల నిర్ణయం వాస్తవికంగా అమలు కావాలంటే సదరు దంపతులు హిందూ వివాహ చట్టం ప్రకారం 18నెలలు ఆగాల్సి ఉంటుంది. ఇందులో పనె్నండు నెలలు వీరు వేరువేరుగానే జీవించినట్టు నిర్థారణ ఉండాలి. తర్వాత ఆర్నెల్ల పాటు సయోధ్యకు సంబంధించి అవకాశం ఉంటుంది.

09/13/2017 - 02:00

ఏఐడిఎంకె వ్యవస్థాపకుడు ఎంజి రామచంద్రన్ శతజయంత్యుత్సవం సందర్భంగా వంద రూపాయల నాణేన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ నాణెం 44 మిల్లీమీటర్ల వ్యాసార్థం, 35 గ్రాముల బరువు ఉంటుందని పేర్కొంది. ఒకవైపు దేవనగరి భాషలో సత్యమేవ జయతే అని, రెండోవైపు ఎంజిఆర్ బొమ్మ ఉంటుందని పేర్కొంది.

09/13/2017 - 01:58

ముంబయి, సెప్టెంబర్ 12: మోదీ ప్రభుత్వం పాత వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేసి పది నెలలు గడిచిపోయిన తర్వాత కూడా దాదాపు 70 శాతం మంది తిరిగి వెయ్యి రూపాయల నోటును ప్రవేశపెట్టాలని కోరుకొంటున్నట్లు తాజాగా నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది.

09/13/2017 - 01:56

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌లోని నరసన్నపేట నుంచి రణస్థలం వరకు ఉన్న 16వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు మార్గాల రహదారిగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. నరసన్నపేట- రణస్థలం జాతీయ రహదారిని ఆరు లేన్ల మార్గంగా అభివృద్ధి చేసేందుకు 1,423 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

09/13/2017 - 01:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పుడున్న 4 శాతం కరవు భత్యం (డిఏ/డిఆర్)ను 5 శాతానికి పెంచాలని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.

09/13/2017 - 01:49

చెన్నై, సెప్టెంబర్ 12: తమిళనాడు అధికార అన్నా డిఎంకెలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న విభేదాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. మంగళవారం ఇక్కడ సమావేశమైన అధికార అన్నాడిఎంకె వర్గం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవినుంచి శశికళను బర్తరఫ్ చేసింది. దివంగత జయలలితనే ‘శాశ్వత ప్రధాన కార్యదర్శి’గా నియమిస్తూ ఓ తీర్మానం చేసింది.

09/12/2017 - 23:42

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రూ. 1000 కోట్లు నాబార్డు నిధులు త్వరలో విడుదల కానున్నాయని ఏపి జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావువెల్లడించారు. మంగళవారాం ఇక్కడ విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్వర్యంలో నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజన్సీ సొసైటీ 31 వార్షిక సమావేశం జరిగింది.

09/12/2017 - 23:40

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: సదావర్తి భూములను ఉమ్మడి హైకోర్టు ఆదేశానుసారం తిరిగి వేలం నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మంగళవారం విచారణ సందర్భంగా ‘మీరు మా కళ్లు ఎలా కప్పుతారు’అని పిటిషనర్‌పై ధర్మాసనం మండిపడింది.

09/12/2017 - 02:27

శ్రీనగర్, సెప్టెంబర్ 11: కాశ్మీరు లోయలో గత ఏడాది కాలంగా పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, రాష్ట్రంలో ఇప్పుడు కొంతమేర శాంతియుత పరిస్థితులు కనిపిస్తున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దీర్ఘ కాలం నుంచి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత భాగస్వాములెవరితోనైనా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు.

Pages