S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/22/2016 - 01:42

న్యూఢిల్లీ, జనవరి 21: భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజాస్ ఉత్పత్తి వచ్చే సంవత్సరం పూర్తి స్థాయిలో మొదలవుతుందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు.

01/22/2016 - 01:41

త్రిసూర్, జనవరి 21: సెక్యురిటీ గార్డు హత్యకేసులో కేరళకు చెందిన బీడీ వ్యాపారి మహ్మద్ నషామ్‌కు కోర్టు 39 ఏళ్ల జైలుశిక్ష విధించింది. బీడీ బరాన్‌గా పిలిచే నషామ్ తన లగ్జరీకారుతో వాచ్‌మెన్‌ను ఢీకొట్టి మృతికి కారణమయ్యాడు. కేసుసు విచారించిన మొదటి అదనపుజిల్లా, సెషన్స్ న్యాయమూర్తి కెపి సుధీర్ 40 ఏళ్ల బీడీ బరాన్‌కు ఏకంగా 39 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు.

01/22/2016 - 02:35

అహ్మదాబాద్, జనవరి 21: ప్రసిద్ధ శాస్ర్తియ నృత్య కళాకారిణి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మృణాళిని సారాభాయ్ (97) గురువారం ఉదయం కన్నుమూశారు. భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాల పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ సతీమణే మృణాళిని. వయోభారంతో అస్వస్థతకు గురైన మృణాళిని బుధవారం నగరంలోని ఓ ఆసుప్రతిలో చేరారు. ఆసుపత్రిలోనే గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

01/22/2016 - 01:39

న్యూఢిల్లీ, జనవరి 21: ఈ ఏడాది ఏప్రిల్ నాటికల్లా తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడం జరుగుతుందని కేంద్ర ఆహార మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ గురువారం చెప్పారు. ఇప్పటివరకు 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని అమలు చేశాయని, మరో 11 రాష్ట్రాలు అమలు చేసే ప్రక్రియలో ఉన్నాయని ఆయన చెప్పారు.

01/22/2016 - 01:25

న్యూఢిల్లీ, జనవరి 21: గణతంత్ర దినోత్సవ వేడుకలకు కనీవినీ ఎరుగని భద్రత కల్పిస్తున్నారు. 67వ రిపబ్లిక్‌డే వేడుకలను భగ్నం చేయడానికి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ కుట్రపన్నిందన్న ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో పూర్తి అప్రమత్తత పాటిస్తున్నారు.

01/22/2016 - 01:23

పఠాన్‌కోట్‌లోని వైమానిక కేంద్రంపై జరిగిన దాడికి సంబంధించి కుట్రపన్నిన వారిపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవల్సిందేనని భారత్ తెగేసి చెప్పింది. ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్‌లో జరుగుతున్న దర్యాప్తు తీరును తాము లోతుగా పరిశీలిస్తున్నామని విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం ఇక్కడ స్పష్టం చేశారు.

01/21/2016 - 18:54

చెన్నై: చెన్నై తీరంలో నావికాదళ పడవ నీటమునిగింది. పడవలో మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఘటనపై నావికాదళం విచారణకు ఆదేశించింది.

01/21/2016 - 18:47

తిరువనంతపురం: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ప్రతిష్టాత్మక నిశగంధీ పురస్కారాన్ని పొందారు. కేరళ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్‌చాందీ ఇళయరాజాకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. నిశగంధీ అవార్డు కింద రూ.1,50లక్షల నగదుతోపాటు జ్ఞాపిక, కాంస్య ప్రతిమను అందజేశారు.

01/21/2016 - 16:29

న్యూఢిల్లీ : బీజేపీ పాలనలో దేశంలో దళితులకు భద్రత లేకుండా పోయిందని ఆప్‌ నేత అశుతోష్‌ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందుత్వ వాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించి తీరాలని అన్నారు.

01/21/2016 - 16:28

ముంబయి: రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ముంబయిలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) గురువారం ర్యాలీ నిర్వహించింది. బీజేపీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పని చేస్తోందంటూ మండిపడింది. కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయలు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ ఎన్‌సీపీ డిమాండ్‌ చేసింది.

Pages