S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/11/2017 - 03:05

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ‘మనది లౌకిక దేశం, జాతి వివక్షను సమర్థించే ప్రసక్తే రాదని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ స్పష్టం చేశారు. లోక్‌సభలో జరిగిన చర్చకు బదులిస్తూ తరుణ్‌విజయ్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారని తెలిపారు. తమిళ మహిళ దత్తపుత్రుడైన తరుణ్‌విజయ్ తిరువల్లూవర్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటే వ్యక్తి అని ఆయన చెప్పారు. తాను తప్పు చేసినట్లు తరుణ్‌విజయ్ అంగీకరించారని రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు.

04/11/2017 - 03:04

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: తమిళనాడులో ఉప ఎన్నిక జరగాల్సిన రాధాకృష్ణన్ నగర్ (ఆర్‌కె.నగర్) అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార ఎఐఎడిఎంకె నాయకులు విచ్చలవిడిగా భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేశారన్న వార్తల నేపథ్యంలో ఆ ఎన్నికను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ (ఇసి) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అభినందించారు.

04/11/2017 - 03:02

పూణె, ఏప్రిల్ 10: ఉస్మానాబాద్ శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ రైలు ప్రయాణంపైనే మొగ్గుచూపుతున్నారా? అవుననే అంటున్నారు ఎంపీ అనుచరులు. గైక్వాడ్ ఎయిర్ ఇండియా మేనేజర్‌పై దౌర్జన్యం చేసి వివాదంలో చిక్కుకోవడం, విమాన ప్రయాణాలపై నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పార్లమెంటును సైతం గైక్వాడ్ వివాదం కుదిపేసింది. ఎంపీ క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో ఏమో!

04/11/2017 - 03:01

చండీగఢ్, ఏప్రిల్ 10: భారత నావికాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించడంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని, ఆయనకు మరణ శిక్ష అమలు కాకుండా చూడాలని దల్బీర్ కౌర్ విజ్ఞప్తి చేశారు. దల్బీర్ కౌర్ సోదరుడు సరబ్‌జీత్ సింగ్ 2013లో పాకిస్తాన్ జైలులో మృతి చెందిన విషయం విదితమే.

04/11/2017 - 02:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: దక్షిణాది ప్రజలు నల్ల వారంటూ జాతి వివక్ష ప్రదర్శించిన బిజెపి మాజీ ఎంపీ, ఆర్గనైజర్ మాజీ ఎడిటర్ తరుణ్‌విజయపై చర్య తీసుకోవాలంటూ కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు సోమవారం లోక్‌సభను స్తంభింపచేశాయి. జీరో అవర్‌లో కాంగ్రెస్, వామపక్షాలతోపాటు పలువురు దక్షిణాదికి చెందిన ఎంపీలు పోడియం వద్దకు వచ్చి ఎన్‌డిఏ ప్రభుత్వంపై ముప్పేటదాడి చేశారు. దీంతో లోక్‌సభ రెండు సార్లు వాయిదా పడింది.

04/11/2017 - 01:54

ఇస్లామాబాద్/ న్యూఢిల్లీ, ఏప్రిల్ 10:గూఢచర్యం, కుట్రపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న అభియోగాలపై భారత జాతీయుడు కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించిన భారత్ పాక్ సైనిక కోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. జాదవ్‌ను ఉరితీస్తే అది ఓ పథకం ప్రకారం జరుగుతున్న హత్యే అవుతుందంటూ నిప్పులు చెరిగింది.

04/11/2017 - 02:00

నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా
ప్రధాని మాల్కం టోర్నబుల్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని చారిత్రక అక్షరథామ్ ఆలయాన్ని సోమవారం సందర్శించారు. ఆలయ పెద్దల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నమస్కారం చేస్తున్న మాల్కం, మోదీ

04/11/2017 - 01:39

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై కమీషన్ పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్న పెట్రోల్ పంపుల యజమానులు దాన్ని సాధించుకోవడానికి కఠిన నిర్ణయమే తీసుకున్నారు. కమీషన్ పెంచడం సహా తమ డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చేంత వరకు దేశ వ్యాప్తంగా పెట్రోలు పంపులను మే 10వ తేదీ నుంచి ప్రతి ఆదివారం మూసివేస్తామని అల్టిమేటం జారీ చేశారు.

04/11/2017 - 01:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: రాజ్యాంగ ప్రతిపత్తితో కూడిన జాతీయ బీసీ కమిషన్ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. సభలో 360మంది సభ్యులు మద్దతు తెలుపగా, ఇద్దరు మాత్రం ప్రతికూలంగా ఓటు వేశారు. దీనిపై రాజ్యసభ మంగళవారం చర్చ జరిపి ఆమోదం తెలిపిన అనంతరం బిల్లు చట్టరూపం దాలుస్తుంది.

04/11/2017 - 01:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: దేశంలో నాలుగు కాలాలపాటు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కొనసాగేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై భాగస్వామ్య పక్షాల భేటీలో చర్చించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం ప్రవాసభారతి కార్యాలయంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అధినేతల సమావేశం జరిగింది.

Pages