S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/14/2017 - 02:25

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13:దీర్ఘకాలంగా భవిష్య నిధి చందాదారులుగా కొనసాగుతున్న వారికి ఇపిఎఫ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇరవైఏళ్లకు పైగా ఇపిఎఫ్ సభ్యులుగా ఉన్నవారికి విధేయత, జీవిత కాల ప్రయోజనం కింద పదవీ విరమణ సమయంలో 50వేల రూపాయలు అందించాలని నిర్ణయించింది. ఇరవై ఏళ్లకంటే తక్కువ కాలంపాటు చందాదారులుగా ఉన్న శాశ్వత దివ్యాంగులకు కూడా ఈ లబ్ధిని వర్తింపజేస్తారు.

04/14/2017 - 02:16

ముంబయి, ఏప్రిల్ 13: మహిళలు పెళ్లయిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న తర్వాత పాస్‌పోర్టుపై తమ అసలు పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతేకాదు వారు తమ తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరి పేరు ఇచ్చినా పాస్‌పోర్టు లభిస్తుందని ఆయన తెలిపారు.

04/14/2017 - 02:15

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తం గా జూలై ఒకటి నుంచి అమలుకావడానికి సిద్ధమవుతున్న చారిత్ర క జిఎస్‌టి ప్రక్రియలో మరో ముందడుగు పడింది. ఒకే దేశం..ఒకే పన్ను నినాదంతో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ చట్టానికి సంబంధించిన నాలుగు బిల్లులను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు.

04/14/2017 - 02:14

శ్రీనగర్/ న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల బందోబస్తులో పాల్గొన్న సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని కొంత మంది యువకులు కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఈ నెల 9న జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా భద్రతా విధుల్లో పాల్గొన్న సిఆర్‌పిఎఫ్ జవాన్లను యువకులు కొడుతున్న దృశ్యాలతో కూడిన ఒక వీడియో బయటికి వచ్చింది.

04/14/2017 - 02:13

కోల్‌కతా, ఏప్రిల్ 13: సుప్రీంకోర్టుకు, కోల్‌కతా హైకోర్టు జడ్జి సిఎస్ కర్ణన్‌కు మధ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టునుంచి కోర్టు ధిక్కరణ నోటీసులు అందుకున్న కర్ణన్ ఇప్పు డు రాజ్యాంగ ధర్మాసనానికి చెందిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు న్యాయమూర్తులకు ఈ నెల 28న తన ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.

04/14/2017 - 01:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఎనిమిది రాష్ట్రాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ పరంపర కొనసాగింది. శ్రీనగర్ పార్లమెంటు స్థానంతోపాటుగా వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు గత ఆదివారం జరగ్గా, గురువారం ఫలితాలు వెలువడ్డాయి.

04/14/2017 - 01:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: వచ్చే సంవత్సరం నుంచి ఉర్దూ మాధ్యమంలో నీట్ పరీక్ష నిర్వహిస్తారు. సుప్రీం కోర్టు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం 2018-19 సంవత్సరానికి ఉర్దూ మీడియాంలోనూ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

04/13/2017 - 07:46

రూ. 5వేల కోట్లు ఏమయ్యాయి?
ఖర్చు లెక్క లేకపోవడంపై సుప్రీం ఆగ్రహం
ఆడిట్ జరిపి రెండువారాల్లో నివేదిక ఇవ్వండి
కాగ్‌ను ఆదేశించిన న్యాయమూర్తులు
అదృశ్యం కాలేదు.. రాష్ట్రాల వద్ద ఉన్నాయి
వివరణ ఇచ్చిన అదనపు సొలిసిటర్ జనరల్
మే 5న తదుపరి విచారణ

04/13/2017 - 07:30

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఒక దేశం, ఒక పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు వీలుకల్పించిన జిఎస్టీలాంటి అత్యంత ముఖ్యమైన బిల్లులను ఆమోదించిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. లోక్‌సభ సమావేశాలు మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పించిన అనంతరం నిరవధికంగా వాయిదా పడితే, రాజ్యసభ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసిన అనంతరం వాయిదా పడింది.

04/13/2017 - 07:28

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఈ నెల 30లోగా ఆధార్‌తో అనుసంధానం కాని బ్యాంకు ఖాతాలను అధికారులు మూసివేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా 2014 జూలై 2015 తెరిచిన బ్యాంకు ఖాతాలను ఆధార్ నెంబర్‌తో ఏప్రిల్ 30లోగా ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుందని ఆదాయం పన్ను విభాగం తెలిపింది.

Pages