S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/15/2019 - 13:20

న్యూఢిల్లీ:ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వతీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ మాయావతి, యోగి ఆదిత్యానాథ్ మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ సూప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనిపై ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తంచేసింది.

04/15/2019 - 13:19

లక్నో:‘‘ సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’’ అనేది బీజేపీ నినాదం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మొయిదాబాద్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రజల రక్షణే మా లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. గతంలో పాక్ దాడి జరిపితే ఎవరెవరికో ఫిర్యాదులు చేసేది. అంతర్జాతీయ సమాజం ముందు ఆవేదన వ్యక్తంచేసేది. కాని ఇపుడు ఉన్నది నవభారతం. ఉరీ దాడి జరిగితే వెంటనే ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు.

04/15/2019 - 13:18

ఝార్ఖండ్: లోకసభ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయారు. బెల్బాఘాట్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనా స్థలంలో ఏకే47 రైఫిల్, 4 మ్యాగ్‌జైన్లు, బాంబులను స్వాధీనం చేసుకున్నారు. భద్రతాసిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది.

04/15/2019 - 13:16

న్యూఢిల్లీ: బీజేపీ రాంపూర్ అభ్యర్థి జయప్రదపై ఎస్పీ అభ్యర్థి ఆజాంఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రంగా స్పందించారు. ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ను ఉద్దేశించి.. ‘‘సమాజ్‌వాద్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. మీకు దగ్గర్లోనే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది. కౌరవ కురు వృద్ధుడు భీష్ముడి వలే ఉండకండి’’ అని అన్నారు.

04/15/2019 - 13:15

లక్నో: ఆజాంఖాన్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని రాంపూర్ అభ్యర్థి జయప్రద స్పందించారు. ఒకవేళ ఆజాంఖాన్ వంటివారు గెలిస్తే మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని అన్నారు.

04/15/2019 - 13:14

లక్నో: సమాజ్‌వాద్ పార్టీ నాయకుడు ఆజాంఖాన్‌పై కేసు నమోదు అయింది. రాంపూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సినీనటి జయప్రదమై ఆజాంఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.‘‘ ఆమె లోదుస్తులు పలాన రంగులో ఉంటాయని, ఆమెను అర్థం చేసుకోవటానికి మీకు 17 సంవత్సరాలు పట్టింది. కాని ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుంటుందని నాకు 17 రోజులకే తెలిసిపోయిందని’’ అన్నారు. ఆజాంఖాన్ వ్యాఖ్యలపై జాతీయ మహిళాకమిషన్ మండిపడింది.

04/15/2019 - 04:30

కాంగ్రెస్ హయాంలో ఒక్క దాడీ

జరగలేదు..
టెర్రరిస్టులతో వాళ్లది ప్రేమబంధం
-ఎన్నికల ప్రచారంలో అమిత్ షా విసుర్లు
*
పొలిమేరలో రక్కసులకు

-పొగబెట్టిన ఊసులేదు
సరిహద్దుల సర్దుబాటు -హస్తానికి

కొత్త కాదు!

కాషాయం రంగులేల -రక్షకుడికి

అమితన్నా..
ఆనాడూ ఈనాడూ -ఒకడే

సైనికుడన్నా!!

04/15/2019 - 04:09

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: భారత్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత శాంతి, అంతర్గత భద్రతతోపాటు అపరిష్కృతంగా ఉన్న ఎన్నో అంశాలపై జరుగబోయే చర్చలు ఇరు దేశాల మధ్య బంధాలను మరింత ధృడం చేస్తుందనే ఆశాభావాన్ని పాకిస్తాన్ హైకమిషనర్ సోహైల్ మహమూద్ వ్యక్తం చేశారు.

04/15/2019 - 02:23

కథువా, ఏప్రిల్ 14: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికలకు ముందు ఇతర రాజకీయ పార్టీలపై విరుచుకుపడతారని, ఎన్నికల తరువాత తిరిగి అవే పార్టీలతో కూటములు ఏర్పాటు చేస్తారని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆదివారం విమర్శించారు.

04/15/2019 - 02:18

చిక్‌బల్లాపూర్, ఏప్రిల్ 14: కర్నాటకలోని చిక్‌బల్లాపూర్ లోక్‌సభ నియోజకవర్గం ఇపుడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ నియోజకవర్గంలో గత 14 ఏళ్లుగా కరవు తీవ్రంగా వేధిస్తోంది. ఫలితంగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు.

Pages