S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/12/2018 - 02:17

భోపాల్, డిసెంబర్ 11:మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఎవరిదన్నది ఉత్కంఠభరితంగా మారింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు అధికార పీఠాన్ని చేజిక్కించుకునేందుకు నువ్వానేనా అంటూ పోటీ పడుతున్నారు. ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో ఈ రెండు పార్టీలకు అనుకూలంగా లేకపోవడంతో చిన్న పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థుల పాత్ర కీలకంగా మారింది.

12/12/2018 - 02:15

ఐజ్వాల్, డిసెంబర్ 11: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర పునరావృతమైంది. పదేళ్ల విరామం తరువాత మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్) ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఫలితాలు ఉండగా, ఈశాన్య రాష్ట్రంలో అధికారంలోఉన్న ఏకైక రాష్ట్రాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. ముఖ్యమంత్రి లాల్ తన్‌హావాలా రెండు చోట్ల పోటీ చేసి భంగపడ్డారు. సెర్ఛిప్, ఛాంఫయి నియోజకవర్గాల నుంచి ఓటమి చెందారు.

12/12/2018 - 02:13

రాయిపూర్, డిసెంబర్ 11: దాదాపు 15 సంవత్సరాలు తర్వాత చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో 90 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ 67 సీట్లతో తిరుగులేని మెజారిటీని సాధించింది. బీజేపీ 15 సీట్లతో సరిపెట్టుకోగా, 8 స్థానాలతో జేసీసీ మూడోస్థానంలో నిలిచింది.

12/12/2018 - 02:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించడంపై ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని, ప్రజా తీర్పే సర్వోన్నతమైనదని ఆయన అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ విజయాన్ని సాధించడంపై ఆయన కేసీఆర్‌ను, మిజోరం ఎన్నికల్లో గెలిచిన మిజో నేషనల్ ఫ్రంట్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో బలమైన రాష్ట్రాలను బీజేపీ కోల్పోయింది.

12/12/2018 - 02:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సమర్థంగా పనిచేయటం లేదు.. ఆయన పాలనతో దేశ ప్రజలు సంతృప్తి చెందటం లేదనేది ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినట్లే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరుతామని ఆయన ప్రకటించారు.

12/12/2018 - 02:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి పరాభవంతోనే తెలుగుదేశం పార్టీ పతనం ప్రారంభమైందని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. మంగళవారం ఢిల్లీలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజలు కూడా తిరష్కరించారని వెల్లడించారు.

12/12/2018 - 02:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తును ప్రజలు తిరష్కరించారని వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నారు. ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ .సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ విలేఖరులతో మాట్లాడారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు పరిపక్వతతో మంచి తీర్పు ఇచ్చారని చెప్పారు.

12/12/2018 - 02:07

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాల పనితీరును బట్టి వచ్చాయి తప్ప అవి మోదీ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చినవి కాదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

12/12/2018 - 02:07

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, సీపీఎం సీనియర్ నాయకుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, రసాయనాల శాఖ మాజీ మంత్రి అనంతకుమార్, ప్రస్తుత సభ్యులు డాక్టర్ భోలాసింగ్, ఎంఐ శానవాస్, మహమ్మద్ అసర్రుల్ హక్ మరణం పట్ల సంతాపం తెలిపిన అనంతరం మంగళవారం లోక్‌సభ బుధవారం నాటికి వాయిదా పడింది.

12/12/2018 - 02:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రాష్ట్రాల్లో ఓటర్లు పోట చేసిన ఏ అభ్యర్థీ నచ్చక ‘నోటా’కీ బాగానే ఓట్లేసీ అందర్నీ ఆశ్చర్చపరచారు. సాయంత్రం 5.45 గంటలకు ఎన్నికల కమిషనర్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల మేరకు ‘నోటా’కు సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి. చత్తీస్‌గఢ్‌లో నోటా 2.1 శాతం ఓట్లు సంపాదించగా, మిజోరంలో 0.5 శాతం పొందింది.

Pages