S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/07/2018 - 23:35

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: పట్టణాలు, నగరాల్లో సొంత ఇళ్లు లేని పేదలను వారి మానాన వారిని నిరాశ్రయులుగా వదిలేయకుండా కనీస గృహ సదుపాయాన్ని కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. నగర ప్రాంతాల్లో గూడు లేని వారికి ఆశ్రయం కల్పించే విషయమై కమిటీలు ఏర్పాటు చేయాలన్న తమ ఆదేశాలను పాటించనందుకు 12 రాష్ట్రప్రభుత్వాలకు రూ.1.5 లక్షల వరకు జరిమానాను విధించింది.

09/07/2018 - 17:02

న్యూఢిల్లీ: మన యువత ప్రగతిపథంలో పయనిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శుక్రవారంనాడు నీతీ ఆయోగ్ నిర్వహించిన మొదటి గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్ మూవ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు వెల్లడించారు. వంద నగరాలను నిర్మించి వౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని తెలిపారు.

09/07/2018 - 17:02

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఎన్నికలు జరపాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రావత్ పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నిక ఏర్పాట్లపై సమీక్షించిన తరువాత సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు.

09/07/2018 - 12:35

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ మరో బ్రిడ్జి కూలిపోయింది. డార్జిలింగ్ జిల్లా సిలిగురి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు ఈ బ్రిడ్జిని దాటుతుండగా బ్రిడ్జి రెండు ముక్కలైంది. ట్రక్కు బ్రిడ్జి మధ్యనే చిక్కుకుపోయింది. డ్రైవర్‌కు తీవ్రగాయాలవ్వటంతో ఆసుపత్రికి తరలించారు.

09/07/2018 - 12:33

జమ్మూకాశ్మీర్:జమ్మూకాశ్మీర్ డీజీపీ ఎస్పీ వేద్‌పై వేటు పడింది. పోలీసు శాఖ ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. ముష్కరులు కిడ్నాప్ చేసిన పోలీసు అధికారుల కుటుంబ సభ్యులను విడిపించేందుకు పోలీసుల అదుపులో ఉన్న ఉగ్రవాదులను విడిపించటం జరిగింది. దీనిపై ఆయనను బదిలీ చేసినట్లు తెలిసింది. వేద్ స్థానంలో జైళ్ల శాఖ డీజీ దిల్బాజ్ సింగ్‌కు బాధ్యతలను అప్పగించారు.

09/07/2018 - 02:56

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియార్ గురువారం ఇక్కడ తోసిపుచ్చారు. రాఫెల్ విమానాల కొనుగోలుకు సంబంధించి భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన ఒప్పందంలో ఎలాంటి లోపాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని సుబ్రుతో పార్క్‌లో 38వ హేలీ పవర్ ఇండియా2 పేరులో ఓ అంతర్జాతీయ సెమినార్ ఏర్పాటయింది.

09/07/2018 - 02:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: పోలీసుల డాటా బేస్‌లో లభ్యం కాని నేరగాళ్ల వివరాలను కనుగొనడానికి సామాజిక మాధ్యమాలను ఆమూలాగ్రం తవ్వితీసి వారిని గుర్తించే ఫేస్ రికగ్నిషన్ (ముఖాన్ని గుర్తించే) సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయడానికి రక్షణ సంస్థల ఆధ్వర్యంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

09/07/2018 - 02:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక, భద్రత, రక్షణ రంగంలో పరస్పర సహకారం అందించుకునే దిశగా కీలక ఒప్పందం జరిగింది. రెండు దేశాల మధ్య 2+2 చర్చలు ఢిల్లీలో గురువారం ప్రారంభమయ్యాయి. రక్షణ ఒప్పందంతో సీమాంతర ఉగ్రవాదం, హెచ్1బీ వీసాలపై ఇరుదేశాల విదేశాంగ మంత్రులు చర్చిస్తారు.

09/07/2018 - 02:50

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపిస్తూ ఆదివాసీలు ఇచ్చిన బంద్ పిలుపుతో రవాణా వ్యవస్థ స్తంభించి పోవడంతో పాట్నాలో ఇలా రైళ్లలో ప్రయాణిస్తున్న జనం.

09/07/2018 - 02:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: అధికార కార్యకలాపాల్లో సామాన్యులకు అర్ధమయ్యేలా హిందీ భాషను వాడాలని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. సంక్లిష్టమైన పదాలు వాడడం మానుకోవాలని ప్రభుత్వ అధికారులను ఆయన ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సెంట్రల్ హిందీ కమిటీ సమావేశం జరిగింది. హిందీ భాషను విస్తృత పరచాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Pages