S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/04/2017 - 02:15

అగర్తల, జనవరి 3: త్రిపుర సహా పలు ఈశాన్య రాష్ట్రాలను స్వల్పస్థాయి భూకంపం మంగళవారంనాడు కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. త్రిపురలో అనేకచోట్ల దీని ప్రభావానికి కొండచరియలు విరిగిపడ్డాయ. ఈ సంఘటనలో ఒకరు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారు. భూకంప తీవ్రత మాత్రం ప్రజలను భయకంపితులను చేసిందని, భయంతో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు పెట్టారు.

01/04/2017 - 02:15

న్యూఢిల్లీ, జనవరి 3: కొత్త సంవత్సరం వేడుకల సమయంలో బెంగళూరులో మహిళలపై జరిగిన సామూహిక లైంగిక వేధింపు సంఘటనపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన కర్నాటక హోం మంత్రి జి.పరమేశ్వర, సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ ఆజ్మీలకు జాతీయ మహిళా కమిషన్ సమన్లు పంపింది.

01/04/2017 - 01:36

న్యూఢిల్లీ, జనవరి 3: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 31నుంచి ప్రారంభం కానున్నాయి. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈమేరకు నిర్ణయించారు. తొలిరోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేసే ప్రసంగంతో 2017-18 బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజున ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు.

01/04/2017 - 01:34

న్యూఢిల్లీ, జనవరి 3: దేశ వ్యాప్తంగా న్యాయమూర్తుల కొరత, పెండింగ్ కేసులు పెరిగిపోవడం పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత సమాజం సమీకృత లక్షణాన్ని కాపాడుకునేందుకు భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లకు న్యాయవ్యవస్థ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టు ప్రాంగణంలో మంగళవారం వీడ్కోలు ప్రసంగం చేసిన చీఫ్ జస్టీస్ అనేక అంశాలను ప్రస్తావించారు.

01/04/2017 - 01:29

తిరుపతి, జనవరి 3: శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎప్పటికప్పుడు తలెత్తుతున్న సవాళ్లనే అవకాశాలుగా మార్చుకుని భారత్ ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో సృజనాత్మక జిజ్ఞాస దేశవ్యాప్తంగా విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ రంగాల్లో భారతావని అద్వితీయంగా రాణించాలంటే బాల్యదశలోనే పిల్లల్లో పరిశోధనాసక్తి, అవగాహనను పెంపొందించాలన్నారు.

01/03/2017 - 02:21

న్యూఢిల్లీ, జనవరి 2: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున తాము విచారణ జరపలేమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్ విచారణకు సుప్రీకోర్టు అనుమతి తీసుకురావాలని ట్రిబ్యునల్ సూచించింది.

01/03/2017 - 02:15

ముంబయి, జనవరి 2: నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన పథకాలను బిజెపి మిత్రపక్షం శివసేన ఎద్దేవా చేసింది. యుపిఏ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలనే మార్చి ప్రకటించారని ప్రధానిపై విరుచుకుపడ్డారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజల అవస్థలు పడుతుంటే పరిష్కారం చూపలేకపోయారని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో విమర్శించారు.

01/03/2017 - 02:01

హాల్దా, జనవరి 2: గత రెండు నెలలుగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అతలాకుతలం అయిపోయిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరోక్షంగా తప్పుబట్టారు. ఒకప్పుడు పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉన్న పశ్చిమ బెంగాల్, పెద్దనోట్ల రద్దు కారణంగా సమస్యల కూపంలో చిక్కుకుపోయిందని అన్నారు.

01/03/2017 - 01:59

బాలాసోర్ (ఒడిశా), జనవరి 2: భారత్ అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. అణుపదార్థాలను మోసుకెళ్తూ నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించగలిగే సామర్థ్యం గల ఈ వ్యూహాత్మక క్షిపణిని ఒడిశా తీరంలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు.

01/03/2017 - 01:57

న్యూఢిల్లీ, జనవరి 2: కొలీజియం సిఫార్సులు చేసిన తరువాత కూడా హైకోర్టు న్యాయమూర్తులను ఎందుకు బదిలీ చేయటం లేదని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బదిలీకి సిఫార్సు అయిన తరువాత కూడా సదరు న్యాయమూర్తులను అదేస్థానంలో కొనసాగించటం వల్ల తప్పుడు ఊహాగానాలకు, అపార్థాలకు తావిచ్చినట్లవుతుందని అత్యున్నత న్యాయస్థానం సోమవారం పేర్కొంది.

Pages