S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/04/2016 - 00:09

కోల్‌కతా, జూలై 3: దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందువుల వలసలపై వచ్చేవారం నుంచి విశ్వహిందూ పరిషత్ సర్వే నిర్వహించనుంది. జమ్ము కాశ్మీర్ నుంచి కేరళ దాకా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇళ్లూ వాకిళ్లు, ఆస్తిపాస్తులను వదిలేసి వెళ్లిపోతున్న హిందువుల పరిస్థితులపై పూర్తిస్థాయి సర్వేను నిర్వహిస్తామని విహెచ్‌పి అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా ఆదివారం తెలిపారు.

07/04/2016 - 00:08

న్యూఢిల్లీ, జూలై 3: ఎన్‌డియే ప్రభుత్వ రెండేళ్ల పనితీరుపై కాంగ్రెస్ పార్టీ ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. హామీలను తుంగలో తొక్కడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరితేరిన వాడని, అబద్ధాలనే పునాదిగా చేసుకుని ఆయన పరిపాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ‘ఎన్నికల ప్రచారంలో మోదీ వాస్తవాలను పక్కనపెట్టి దేశవ్యాప్తంగా అబద్ధాలను ప్రచారం చేశారు.

07/04/2016 - 00:04

న్యూఢిల్లీ, జూలై 3: న్యాయమూర్తులుగా పదోన్నతికోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల పేర్లను కొలీజియంకు పంపే ముందు ఆ దరఖాస్తులను పరిశీలించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.్ఠకూర్ తిరస్కరించారు.

07/04/2016 - 00:02

చెన్నై, జూలై 3: తమిళనాడులో ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతిని హత్య చేసిన దోషికి ఉరిశిక్ష వేయాలని ఆమె కుటుంబం ఆదివారం డిమాండ్ చేసింది. నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో 24 ఏళ్ల స్వాతిని హతమార్చిన నిందితుడు రామ్‌కుమార్ (22)ను పోలీసులు శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. స్వాతి హంతకుడికి కఠినాతి కఠిన మైన శిక్ష విధించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

07/03/2016 - 06:32

న్యూఢిల్లీ, జూలై 2: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిలో భారతీయ యువతి తరుషి మృతి చెందడం తనకు ఎంతో బాధ కలిగించిందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ఒక ట్వీట్‌లో తెలిపారు. ఆమె తండ్రి సంజీవ్ జైన్‌తో తాను మాట్లాడానని, మన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశానని ఆమె తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో దేశం యావత్తు ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు.

,
07/03/2016 - 04:10

రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. విందుకు హాజరైన ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ , ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ తదితరులు

07/03/2016 - 04:03

జైపూర్, జూలై 2: రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. తప్పతాగినట్లు అనుమానిస్తున్న ఒక ఎమ్మెల్యే కుమారుడు తన బిఎండబ్ల్యు కారుతో శనివారం ఒక ఆటోరిక్షాను ఢీకొట్టి ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్నాడు. అనంతరం ఈ కారు ఒక పిసిఆర్ వ్యాన్‌ను ఢీకొనడంతో నలుగురు పోలీసులు గాయపడ్డారు.

07/03/2016 - 03:59

న్యూఢిల్లీ, జూలై 2: అభివృద్ధి చెందుతున్న దేశాలకంటేౄ అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ కర్బన ఉద్గారాలను వదిలిపెడుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ అన్నారు. మానవ హక్కులను, పర్యావరణాన్ని పరిరక్షించడానికి పటిష్ఠమైన అంతర్జాతీయ చట్టం ఆయుధంగా పని చేస్తుందని కూడా అన్నారు.

07/03/2016 - 03:56

థానె, జూలై 2: కోట్లాది రూపాయల అంతర్జాతీయ మాదకద్రవ్యాల కుంభకోణాన్ని ఇటీవల ఛేదించిన థానె పోలీసులు ఈ వ్యవహారంలో కొందరు బాలీవుడ్, టెలివిజన్ నటుల పాత్రపై శోధిస్తున్నారు. మాజీ నటి మమతా కులకర్ణిని ఈ కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలిగా చేర్చిన పోలీసులు తమ దర్యాప్తులో తెరపైకి వచ్చిన మరికొందరిపై నిఘా వేశారు.

07/03/2016 - 04:12

చెన్నై, జూలై 2: చెన్నై రైల్వే స్టేషన్‌లో జరిగిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి (24) హత్య కేసులో పోలీసులు ఎట్టకేలకు అనుమానితుడు రామ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన రామ్‌కుమార్‌ను దక్షిణ తమిళనాడులోని తిరునెల్వెలి జిల్లాలో గల అతని స్వంత ఊరులో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు రావడంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Pages