S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/01/2016 - 16:48

ముంబయి: శుక్రవారం కూడా సెన్సెక్స్‌ 145.19 పాయింట్లు లాభపడి 27144.91 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 40.60 పాయింట్లు లాభపడి 8328.35 దగ్గర ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 67.40 వద్ద కొనసాగుతోంది. వరుసగా అయిదో రోజు కూడా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.

07/01/2016 - 12:19

బెంగళూరు: ఇక్కడి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) సంస్థ రూపొందించిన స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ దేశ వైమానిక దళంలో చేరింది. ఇక్కడ శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో దక్షిణాది వైమానిక దళం అధిపతి ఎయర్ మార్షల్ జస్బిర్ వాలియా సమక్షంలో రెండు తేజస్ విమానాలను హెచ్‌ఎఎల్ అందజేసింది. ఈ ఏడాది 6, వచ్చే ఏడాది 8 తేజస్‌లను వైమానిక దళం సమకూర్చుకుంటుందని అధికారులు తెలిపారు.

07/01/2016 - 11:37

ముంబయి: ఈరోజు ఉదయం స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 160 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 45 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 67.44 పైసలుగా ఉంది.

07/01/2016 - 04:13

నెల్లూరు, జూన్ 30: దేశంలో రైల్వే రంగంలో వౌలిక వసతులు, నూతన రైల్వే మార్గాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే (విజయవాడ డివిజన్) ఎడిఆర్‌ఎం వేణుగోపాల్ రావు అన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు.

07/01/2016 - 04:13

హైదరాబాద్, జూన్ 30: దేశంలో 91 శాతం ప్రజలకు ఎటువంటి ఆరోగ్య బీమా లేదని హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ వివరాలను ఆ సంస్ధ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ త్రిపాఠీ తెలిపారు. భారతీయ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆరోగ్య బీమా పథకాలను రూపొందించాల్సి ఉందన్నారు.

07/01/2016 - 02:51

విశాఖపట్నం, జూన్ 30: విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో దాదాపు 655 కోట్ల రూపాయలతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఇ)ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎయులో ఇది తాత్కాలికంగా పని చేస్తుంది. మూడేళ్లపాటు ఐఐటి ఖరగ్‌పూర్‌ను ఐఐపిఇకి మెంటారింగ్ చేసేందుకు వీలుగా గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒప్పందంపై సంతకాలు చేశారు.

07/01/2016 - 02:48

న్యూఢిల్లీ, జూన్ 30: ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల పార్టీ ఫిరాయింపులపై వైకాపా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వచ్చేవారం విచారణకు రానుంది. పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేసినా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పట్టించుకోవడం లేదని, దాన్ని తక్షణం పరిష్కరించేలా ఆదేశించాలని వైకాపా తరపున ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

07/01/2016 - 02:23

న్యూఢిల్లీ, జూన్ 30: గత రెండు నెలల్లో మొదటి సారిగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు 89 పైసలు, డీజిల్‌పై లీటరుకు 49 పైసలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. తగ్గించిన ఈ ధరలు గురువారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 65.65 నుంచి 64.76 పైసలకు తగ్గింది. అలాగే డీజిల్ లీటరు రూ. 55.19 నుంచి 54.76కు తగ్గింది.

07/01/2016 - 02:10

న్యూఢిల్లీ, జూన్ 30: కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్న ప్రధాని మోదీ గురువారం అకస్మాత్తుగా మంత్రుల పనితీరును అంచనా వేసేందుకు ఉపక్రమించడం సంచలనంగా మారింది. ఇందులోభాగంగా ప్రధాని అడిగిన ప్రశ్నలకు పలువురు మంత్రులు ఠారెత్తిపోయినట్లు తెలిసింది. రేస్‌కోర్స్ రోడ్డులోని తన నివాసంలో ప్రధాని సాగించిన ఈ సమీక్ష ఆరు గంటలకు పైగా కొనసాగింది.

07/01/2016 - 01:43

న్యూఢిల్లీ, జూన్ 30: ఉత్తరప్రదేశ్ శాసనసభకు వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఐదు సూత్రాల వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నది. ఐదు సూత్రాలను అమలు చేయటంతోపాటు ప్రియాంక గాంధీని సరైన సమయంలో రంగంలోకి దించటం ద్వారా యుపి అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తాను చాటుకోవాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది.

Pages