S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/28/2015 - 14:06

ఢిల్లీ :జర్నలిస్టులకు ప్రధాని నరేంద్ర మోదీ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. దివాలీ మిలన్ పేరుతో ఈ విందును ఏర్పాటుచేశారు.

11/28/2015 - 06:28

న్యూఢిల్లీ, నవంబర్ 27: అత్యవసర పరిస్థితి విధించి ప్రాథమిక హక్కులతో పాటు చివరికి జీవించే హక్కును కూడా హరించివేసిన సం ఘటనలు పునరావృతం కాకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోడానికి ప్రతి ఒక్కరు కంకణబద్ధులు కావాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమకున్న అధికారంతో రాజ్యాంగానికి కళంకం తెచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగాఉండాలన్నారు.

11/28/2015 - 06:25

న్యూఢిల్లీ, నవంబర్ 27: పార్లమెంటులో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు ఆమోదానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయే పరిణామాలు శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నాయి.

11/28/2015 - 06:24

న్యూఢిల్లీ, నవంబర్ 27: స్వాతంత్ర పోరాటంలోనే కాక ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాజ్యాంగం రూపొందించడంలో కీలక పాత్ర వహించిన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయి పటేల్, బాబూ రాజేంద్ర ప్రసాద్, వౌలానా ఆజాద్ వంటి ప్రముఖలను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్‌నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు.

11/28/2015 - 06:23

న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశంలో అసహనం, మత విద్వేషాలు పెరిగి పోయిన ప్రస్తుత వాతావరణంలో ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టడానికి బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని, రాజ్యాంగంలో ‘లౌకికవాదం’ పదం ఉండడమే దానికి ఇబ్బందికరంగా ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించారు.

11/28/2015 - 06:22

జమ్ము, నవంబర్ 27: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) పాకిస్తాన్‌లో భాగమని, ఇకముందు కూడా అది పాకిస్తాన్‌లోనే కొనసాగుతుందని, భారత్‌లో అంతర్భాగంగా ఉన్న జమ్మూకాశ్మీర్ ఈ దేశంలోనే కొనసాగుతుందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి అప్పట్లోనే పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఈ ప్రతిపాదన చేశారని ఆయన పేర్కొన్నారు.

11/28/2015 - 06:21

న్యూఢిల్లీ, నవంబర్ 27: పాకిస్తాన్‌వైపునుంచి భారత భూభాగంలోకి చొరబడడానికి ఉగ్రవాదులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని, ఈ ఏడాది అలాంటి ప్రయత్నాలు గణనీయంగా పెరిగాయని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) డికె పాఠక్ అన్నారు. బిఎస్‌ఎఫ్ 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు.

11/28/2015 - 06:20

న్యూఢిల్లీ, నవంబర్ 27: విభజన వల్ల పోలీసు శిక్షణ కేంద్రాల పరంగా ఆంధ్రప్రదేశ్‌కు కలిగిన నస్టాన్ని భర్తీ చేయటానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్టు సాంకేతిక సహాయ మంత్రి వైఎస్ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడుతో కలిసి ఆయన శుక్రవారం హోమ్ మంత్రితో సమావేశమయ్యారు.

11/28/2015 - 06:19

న్యూఢిల్లీ, నవంబర్ 27: మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీచేసింది. ఆయనతో పాటు ఆయన సహచరులకు కూడా సమన్లు పంపింది. విచారణ నిమిత్తం డిసెంబర్ మొదటి వారంలో తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీచేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే ఆయన సహచరులకు కూడా ఇదే రకమైన ఆదేశాలు అందాయని పేర్కొన్నాయి.

11/28/2015 - 06:19

న్యూఢిల్లీ, నవంబర్ 27: కార్మికుల సంక్షేమం కోసం అనేక వినూత్న పథకాలను ప్రారంభించి కార్మిక శాఖ మంత్రిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అడుగుజాడలలోనే తమ శాఖ పని చేస్తోందని కేంద్ర కార్మిక మంత్రి బం డారు దత్తాత్రేయ స్పష్టం చేశారు.

Pages