S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/08/2016 - 04:28

న్యూఢిల్లీ: పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో కలిసి భారత ఉప రాష్టప్రతి భవనం, ఇండియా గేట్, భారత గూఢచార సంస్థ కేంద్ర కార్యాలయాలను పేల్చేయాలని అనుకుందని పాక్- అమెరికన్ తీవ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ వెల్లడించినట్టు తెలిసింది. డేవిడ్ హెడ్లీ సోమవారం ముంబయిలోని ప్రత్యేక తీవ్రవాద కోర్టులో టెలికాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యం చెప్పనున్నారు.

02/07/2016 - 08:48

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: దేశాన్ని అధిక వృద్ధి మార్గంలో నడిపించడానికి కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కాగా, తమ ఉద్యోగులకు వేతన కమిషన్ సిఫార్సుల అమలుకోసం అధిక నిధులను ఖర్చు చేయాల్సిన అవసరమున్నందున కేంద్రం అదనపు కేటాయింపులు జరపాలని రాష్ట్రాలు ఆయనను కోరాయి.

02/07/2016 - 08:46

అహ్మదాబాద్: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో పాకిస్తాన్‌కు చెందిన ఓ చేపల పడవను ఇండియన్ కోస్ట్‌గార్డ్ అధీనంలోకి తీసుకుంది. అరేబియా సముద్ర తీరప్రాంతమైన జఖావువద్ద భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన బోట్‌ను అడ్డుకుని 11 మంది జాలర్లను అరెస్టు చేశారు. ‘పాకిస్తాన్ పడవ భారత జలాల్లోకి ఐదు నాటికల్ మైళ్లు చొచ్చుకొచ్చింది’ అని కోస్ట్‌గార్డ్ కెప్టెన్ అభిషేక్ మటిమన్ చెప్పారు.

02/07/2016 - 07:22

న్యూఢిల్లీ: సహకార ఫెడరలిజం గురించి గొప్పగా మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు ఆశించిన స్థాయిలో ఆర్థిక సహాయం చేయటం లేదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌పై చర్చించేందుకు శనివారం నిర్వహించిన సమావేశానికి హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు.

02/07/2016 - 07:00

న్యూఢిల్లీ: కేంద్ర అమ్మకం పన్ను (సిఎస్‌టి)ను దశలవారీగా ఉపసంహరిస్తున్న కేంద్రం ఇందుకు సంబంధించి దీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉంచిన నష్టపరిహారాన్ని త్వరగా విడుదల చేయాలని, నిధులను రానున్న సార్వత్రిక బడ్జెట్‌లో అందించాలని అనేక రాష్ట్రాలు కోరారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు శనివారం న్యూఢిల్లీలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో జరిపిన సమావేశంలో ఈమేరకు డిమాండ్ చేశాయి.

02/07/2016 - 06:57

న్యూఢిల్లీ: ఆంధ్రకు ప్రత్యేక హోదాపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్టు ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ వెల్లడించారు. విభజన మూలంగా రాష్ట్రం ఆర్ధికంగా కేంద్రంపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. వివిధ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశనికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పీవీ రమేశ్ హజరై రాష్ట్ర ప్రతిపాదనలు కేంద్రం ముందుంచారు.

02/06/2016 - 19:57

న్యూదిల్లి-రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేస్తున్న విద్యార్థి మోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో స్కాలర్ రోహిత్ ఆత్మహత్య సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంఘటన మరవకముందే అలాంటి మరో దుర్ఘటన జరగడం గమనార్హం. గైడ్ వేధింపులవల్లే మోహిత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

02/06/2016 - 16:40

ముంబై-సోషల్ మీడియాలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హవా మరింత పెరిగింది. ప్రస్తుతం ఆయనకు ఫేస్‌బుక్‌లో 23 మిలియన్లమంది లైక్స్ వచ్చాయి. ఆయనను అనుసరిస్తున్నవారి సంఖ్య ఫిబ్రవరి 5వ తేదీనాటికి 23,032,439కు చేరుకుందని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

02/06/2016 - 11:51

దిల్లీ: మరి కొద్దిరోజుల్లో వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు సమావేశమవుతున్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, కేంద్ర పథకాల నిధులు, వస్తు సేవల బిల్లుపై అభిప్రాయాల సేకరణ వంటి అంశాలు చర్చలో చోటు చేసుకునే అవకాశం ఉంది.

02/06/2016 - 03:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామీణ బీద ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరు కారుస్తున్నాయని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు.

Pages