S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/05/2016 - 11:55

చెన్నై: కన్యాకుమారి నుంచి బెంగళూరు వెళ్లే ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ వేలూరు జిల్లా నాటురాంపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు పక్కకు వొరిగిపోవటంతో సుమారు 50 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

02/05/2016 - 08:28

కొచ్చి, ఫిబ్రవరి 4: కేరళలో రాజకీయ వాతావరణం బిజెపి అధికారంలోకి రావడానికి అనుకూలంగా ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలా చూడడానికి మైనారిటీలుసహా అన్ని వర్గాల ప్రజలను పార్టీవైపు మొగ్గేలా చేయడానికి అదనపు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు.

02/05/2016 - 08:24

ముంబయి, ఫిబ్రవరి 4: ఆదర్శ్ కుంభకోణం కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను విచారించడానికి గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు సిబిఐకి అనుమతి ఇచ్చారు. చవాన్‌ను ప్రశ్నించే అంశంపై బిజెపి నాయత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేసింది. ‘మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు గురువారం మాజీ సిఎం అశోక్ చవాన్‌ను విచారించడానికి సిబిఐకి అనుమతి ఇచ్చారు’ అని ఓ అధికార ప్రకటనలో తెలిపారు.

02/05/2016 - 08:23

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: వివాదాలు ముదిరి కోర్టులకెక్కడానికి ముందే పరిష్కారాలను ప్రోత్సహించడంతోపాటుగా కోర్టుల్లో కేసుల సంఖ్యను తగ్గించడానికి, కోర్టు వెలుపల పరిష్కారాలకు చట్టపరమైన మద్దతు కల్పించడానికి ఒక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం వివాహపరమైన వివాదాలను పరిష్కరించడానికి మాత్రమే మధ్యవర్తిత్వ పరిష్కార మార్గాన్ని ఉపయోగించడం జరుగుతోంది.

02/05/2016 - 08:23

శ్రీనగర్, ఫిబ్రవరి 4: జమ్మూకాశ్మీర్‌లో రాజకీయ అనిశ్చితికి ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించకపోవడంతో రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా గురువారం ఇద్దరు పదవీవిరమణ పొందిన ఐఎఎస్ అధికారులను తన సలహాదారులుగా నియమించుకున్నారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలను నడపడంలో వీరిద్దరు గవర్నర్‌కు సహకరిస్తారు.

02/05/2016 - 08:21

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని పార్లమెంటరీ వ్యవహారాల ఉపసంఘం నిర్ణయించింది. ఫిబ్రవరి 25న రైల్వే బడ్జెట్‌ను, మరుసటి రోజు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 29న సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రతిపాదిస్తారు.

02/05/2016 - 04:33

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలకు జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసింది. తమ నోటీసులకు రెండు వారాలలోగా సమాధానం ఇవ్వాలని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను గ్రీన్ ట్రైబ్యునల్ మార్చి ఏడో తేదీకి వాయిదా వేసింది.

02/05/2016 - 03:34

న్యూఢిల్లీ: పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లను 50 శాతానికి పెంచడం కోసం ప్రభుత్వం వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణను తీసుకు వస్తుంది. అంతేకాకుండా మహిళా అభ్యర్థులకు వార్డుల రిజర్వేషన్లను ఇప్పుడున్న ఒక టెర్మ్‌నుంచి రెండు టెర్మ్‌లకు పెంచే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

02/04/2016 - 18:10

కోల్‌కత: ఓ మహిళ హత్య కేసులో నిందితులైన 11 మందికి మరణశిక్షను విధిస్తూ పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లా కోర్టు గురువారం సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. కృష్ణాగంజ్ ప్రాంతంలో 2014లో ఓ గృహిణి హత్యకు గురికాగా, 11 మందిని దోషులుగా పేర్కొంటూ పోలీసులు కేసు పెట్టారు. వీరందరూ ఉరిశిక్షకు అర్హులేనని కోర్టు అభిప్రాయపడింది.

02/04/2016 - 18:08

కోల్‌కత: ఇక్కడి సచివాలయంలో బాంబు పెట్టినట్లు గురువారం ఓ ఆగంతకుడు ఫోన్‌లో చెప్పడంతో పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సచివాలయంలోనే ఉన్నారు. బాంబుస్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌లతో గాలించాక ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.

Pages