S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/12/2015 - 05:49

పర్యావరణానికి హానిచేయని విద్యుత్‌కు కట్టుబడి ఉంటూనే, అభివృద్ధి లక్ష్యాలను సాధించడం భారత్‌కు పెద్ద బాధ్యతేకాక సవాల్ కూడానని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. న్యూఢిల్లీలోని రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఇంధనోత్సవం ఉమాంగ్ 2015ను ప్రారంభించిన సందర్భంలో డ్రమ్ వాయిస్తున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ.

12/12/2015 - 02:49

గౌహతి, డిసెంబర్ 11: నేషనల్ హెరాల్డ్ లాభార్జన కోసం పెట్టినది కాదని, అందులో నుంచి ఒక్క పైసా కూడా బయటకు రాజాలదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఇక్కడ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసును నడుపుతోంది ప్రధానమంత్రి కార్యాలయమేనని మరోసారి ఆరోపించారు.

12/12/2015 - 02:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీచేసి విజయం సాధించిన తరువాత తెరాసలోకి ఫిరాయించి మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా మరికొంతమందిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోవటానికి రెండునెలలు నిరీక్షించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ వ్యవధిలో స్పీకర్ తీసుకునే నిర్ణయంపై తదుపరి చర్య తీసుకుంటామని సుప్రీం ప్రకటించింది.

12/11/2015 - 18:15

కోల్ కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన (పార్క్ స్ట్రీట్ రేప్) సామూహిక అత్యాచారం దోషులకు కోల్ కతా సెషన్స్ కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఆంగ్లో ఇండియన్ మహిళపై గ్యాంగ్ రేప్కు పాల్పడిన రుమాన్ ఖాన్, నాజిర్ ఖాన్, సుమిత్ బజాజ్ లను దోషులుగా తేల్చిన న్యాయస్థానం శుక్రవారం పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు, లక్షరూపాయల జరిమానా విధించింది.

12/11/2015 - 17:59

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ఖాన్‌ అత్యంత ధనవంతులైన సెలబ్రిటీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్‌ ఇండియా ఈరోజు అత్యధిక సంపాదన గల (టాప్‌ ఎర్నింగ్‌ సెలెబ్రిటీ) భారతీయ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సంవత్సర ఆదాయం రూ.257.5 కోట్లతో షారుక్‌ మొదటి స్థానంలో నిలవగా.. సల్మాన్‌ఖాన్‌ రూ.202.75కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. అమితాబ్‌ బచ్చన్‌కి ఈసారి మూడో స్థానం దక్కింది.

12/11/2015 - 17:57

న్యూఢిల్లీ : పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు మార్గదర్శకాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఏడుగురు తెలంగాణ శాసనసభ సభ్యులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి పద్నాలుగు నెలలు దాటినా స్పీకర్‌ ఇంతవరకు చర్యలు తీసుకోలేదంటూ పిటిషనర్లు కాంగ్రెస్‌, తెదేపా తరపున వేణుగోపాల్‌, అశోక్‌ దేశాయ్‌ వాదనలు వినిపించారు.

12/11/2015 - 17:56

న్యూఢిల్లీ : ఎల్‌నినో ప్రభావంతోనే దక్షిణ భారత్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసినట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. భవిష్యత్‌లోనూ భారీ వర్షాలు దక్షిణ భారతాన్ని ముంచెత్తనున్నాయని నివేదిక వెల్లడించింది. మధ్య, దక్షిణ భారత్‌, ఇండోనేషియా, కొలంబియా, ఫిలిప్పీన్స్‌, థాయిలాండ్‌పై ఎల్‌నినో ప్రభావం అధికం ఉందని తెలిపింది.

12/11/2015 - 15:41

మధ్యప్రదేశ్: రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో మంత్రుల బృందం నేడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తుంది. రాష్ట్ర బృందానికి ఇండోర్ జిల్లా కలెక్టర్ నరహరి స్వాగతం పలికారు. పలు జిల్లాల్లో నీటిపారుదల ప్రాజెక్టులను మంత్రుల బృందం సందర్శించింది.

12/11/2015 - 15:40

పాట్నా : 2004లో సివాన్‌లో జరిగిన జంట హత్యల(అన్నదమ్ములు) కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్‌కు ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదును విధించింది. షాబుద్దీన్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు(రాజ్‌కుమార్ షా, షేక్ అస్లామ్, ఆరీఫ్ హుస్సేన్) నిందితులుగా ఉన్నారు. షాబుద్దీన్‌తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులకు జీవిత ఖైదును విధించింది.

12/11/2015 - 15:32

దిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సభలో గందరగోళం సృష్టించినందుకు 23 మంది కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఎం.పీలను సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎం.పీల సస్పెన్షన్ అనంతరం సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

Pages