S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/12/2015 - 06:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఒడిశా, చత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతాలను ముంపునకు గురిచేసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని బీజూ జనతాదళ్ సభ్యుడు భర్తృహరి మహతాబ్ డిమాండ్ చేశారు. మహతాబ్ శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో పోలవరం నిర్మాణాన్ని ప్రస్తావించారు. ఈ అంశంపై ఆయన ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తోసిపుచ్చారు.

12/12/2015 - 06:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: భారత్-పాకిస్తాన్ సంబంధాలలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ నెల 14న పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేయనున్నారు.

12/12/2015 - 06:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: స్వతంత్రంగా వ్యవహరించే నాయకుడు ప్రధానమంత్రి వంటి ఉన్నత స్థాయి పదవిని చేపట్టకూడదని 1991లో సోనియాగాంధీ భావించారని, అందువల్లే ఆ పదవికోసం తనకన్నా పి.వి.నరసింహారావుకు ఆమె ప్రాధాన్యం ఇచ్చారని మాజీ కేంద్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు.

12/12/2015 - 06:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉందని శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో తప్పుబట్టింది.

12/12/2015 - 05:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమలుకాకుండా అవరోధాలు కల్పిస్తున్న వైకాపా అధినేత జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలబెట్టటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.

12/12/2015 - 05:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ఈ ఏడు అధిక ఆదాయాన్ని ఆర్జించిన సెలబ్రిటీలలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తిరిగి అగ్ర స్థానాన్ని ఆక్రమించారు. ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్‌ను షారుక్ రెండో స్థానంలోకి నెట్టివేశారని ఫోర్బ్స్ తన వార్షిక ఇండియా సెలబ్రిటీ లిస్ట్- 2015లో పేర్కొంది. షారుక్ ఖాన్ ఈ ఏటి అంచనా ఆదాయం రూ. 257.5 కోట్లుగా పేర్కొంది.

12/12/2015 - 05:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ అరెస్టుపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే మంజూరు చేసింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకుంటా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని కలెక్టర్‌కు కింది కోర్టు నెల రోజుల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

12/12/2015 - 05:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయరంగాన్ని ఆదుకుని రైతుల ఆత్మహత్యలను నివారించటానికి బడ్జెట్‌లో 3 శాతం వ్యవసాయ సెస్సును విభించవలసిందిగా కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయదారులను ఆదుకోవటానికి వెయ్యికోట్ల రూపాయలతో ఒక కార్పస్ నిధిని ఏర్పాటు చేయవలసిందిగా ఆయన రాజ్యసభలోప్రతిపాదించిన ప్రత్యేక తీర్మానంలో కేంద్రానికి సూచించారు.

12/12/2015 - 03:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉందని శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో తప్పుబట్టింది.

12/12/2015 - 03:03

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీచేసి విజయం సాధించిన తరువాత తెరాసలోకి ఫిరాయించి మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా మరికొంతమందిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోవటానికి రెండునెలలు నిరీక్షించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ వ్యవధిలో స్పీకర్ తీసుకునే నిర్ణయంపై తదుపరి చర్య తీసుకుంటామని సుప్రీం ప్రకటించింది.

Pages