S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/11/2019 - 13:09

సిమ్లా: హిమాచల్‌లో గత కొన్ని రోజుల నుంచి మంచు వర్షం విపరీతంగా కురుస్తుంది. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. శీతాకాల సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హిమాచల్‌లో మరో వారంరోజుల పాటు భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

02/11/2019 - 13:08

జమ్మూకాశ్మీర్: రాష్ట్రంలో కురుస్తున్న విపరీతమైన మంచు వల్ల జమ్మూకాశ్మీర్- శ్రీనగర్ జాతీయ రహదారి మూతపడింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు కారణంగా జవహర్ సొరంగ ప్రాంతం, క్వాజీగంద్-బనిహాల్-రాంబన్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం, దీనికి తోడు కొండ చరియలు విరిగిపడటంతో ఐదవరోజు కూడా రహదారిని మూసివేశారు. రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టారు.

02/11/2019 - 13:06

న్యూఢిల్లీ: పీఢన సమస్య కారణంగా ఎయిర్ ఇండియా విమానంలోని ప్రయాణీకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మస్కట్ ఏయిర్‌పోర్టు నుంచి కాలికట్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రయాణీకులు అస్వస్థతకు గురవ్వటంతో సిబ్బంది వెంటనే విమానాన్ని మస్కట్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. నలుగురు ప్రయాణీకుల ముక్కు నుంచి రక్తంకారింది. మరికొందరికి చెవి పోటు వచ్చింది. ఈ విమానంలో 185 మంది ప్రయాణీకులు, సిబ్బంది ఉన్నారు.

02/11/2019 - 13:05

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు పలువులు ఏన్డీయే విపక్ష నేతలు మద్దతు ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మద్దతు తెలిపారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకుడు మీడియాకు తెలిపారు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా దీక్షావేదికపై మాట్లాడుతూ ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలవారీగా విభజించి పాలిస్తున్నారని అన్నారు.

02/11/2019 - 13:04

న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామీలను అమలుచేయాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారంనాడు ధర్మపోరాట దీక్షను దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టారు. దీక్షకు ఏపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. దీక్షకు మద్దతుగా పలు జాతీయ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాడుతున్నానని అన్నారు.

02/11/2019 - 04:59

తిరుపూర్ (తమిళనాడు): దేశ భద్రత కాంగ్రెస్ విస్మరించిందని, రక్షణ విభాగాన్ని నిర్లక్ష్యం చేసిందని, సమైక్యతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆదివారం తమిళనాడులో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.

02/11/2019 - 05:00

మథురలో హోలీ మహోత్సవ్ ప్రారంభం సందర్భంగా భక్తులపై రంగులు చల్లుతున్న బనే్క బిహారీ ఆలయ అర్చకులు. నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ హోలీ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

02/11/2019 - 04:16

శ్రీనగర్, ఫిబ్రవ9రి 10: జమ్మూకాశ్మీర్‌లోని కుల్‌గామ్ జిల్లాలో ఆదివారం భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మిలిటెంట్లు హతమయ్యారు. కెళ్లెం గ్రామంలో ఉదయం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపడుతుండగా, వారిపై ఉగ్రవాదులు కాల్పలకు తెగబడటంతో వీరు కూడా వారిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు.

02/11/2019 - 04:15

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: నిర్భయ నిధిలోనుంచి సొమ్మును భవనాల నిర్మాణానికి మళ్లించడాన్ని హోంశాఖ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థారుూసంఘం తీవ్రంగా ఆక్షేపించింది. ఇలా నిధులను మళ్లించడం వల్ల మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన నిర్భయ నిధి ప్రాజెక్టు లక్ష్యానికి తీవ్ర విఘాతం వాటిల్లుతుందని కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం నేతృత్వంలోని పార్లమెంటరీ స్థారుూసంఘం పేర్కొంది.

02/11/2019 - 04:14

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దేశంలో యువతకు భారత దేశ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రపై అవగాహన కల్పించేందుకు ఉద్దానన్ ఉత్సవ్‌ను ఈ నెల 12వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Pages