S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/10/2019 - 04:38

చంగ్సరీ (అస్సాం): త్వరలో కేంద్రం పార్లమెంటు ద్వారా తేనున్న పౌరసత్వ సవరణ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. శనివారం ఇక్కడ జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఎటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లు ద్వారా స్థానిక ప్రజల హక్కులకు భంగం కలగదన్నారు. దీనిపై అపోహలను నమ్మవదన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.

02/10/2019 - 03:41

లక్నో, ఫిబ్రవరి 9: తన విగ్రహాల స్థాపనకు పెట్టిన ఖర్చును తిరిగి చెల్లించవచ్చని బీఎస్పీ అధినేత్రి మాయావతికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంపై బీజేపీ రాద్ధాంతం చేయడం తగదని బీఎస్పీ కోరింది. ఈ కేసులో తుది తీర్పు ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించనుంది. కోర్టు చేసిన సూచనను గోరంతలు,కొండంతలు చేసి ప్రచారం చేయరాదని మాయావతి మీడియాను కోరారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందని ఆమె చెప్పారు.

02/10/2019 - 03:38

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ) కార్యకర్తలు డెహ్రాడూన్‌లో
శనివారం నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం. ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటన సందర్భంగా
ఏఏఎస్‌యూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ‘మోదీ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు

02/10/2019 - 03:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న కుట్ర వెనక బీజేపీ జాతీయ నాయకులున్నారని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్‌ను అస్థిరపరచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్ప జేడీఎస్ ఎమ్మెల్యేతో బేరసాలకు సంబంధించి ఆడియో టేప్ బయటపడంతో కలకలం రేపింది.

02/10/2019 - 03:30

‘హెచ్‌పీ వరల్డ్ ఆన్ వీల్స్’ పేరుతో వారణాసిలో కంప్యూటరీకరించిన మొబైల్ బస్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించి,
డిజిటల్ బోర్డుపై సందేశం రాస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్

02/10/2019 - 04:44

న్యూఢిల్లీ: స్వైన్‌ఫ్లూతో గడగడలాడుతున్న గుజరాత్, పంజాబ్‌కు రెండు ప్రత్యేక బృందాలను పంపినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లో స్వేన్‌ఫ్లూ విజృంభించింది. వైరస్‌బారిన పడి పలువురు మృతి చెందారు. పరిస్థితి దారుణంగా తయారైంది. గురువారం నాటికి గుజరాత్‌లో 1,187 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. 30 మంది చనిపోయారు. అలాగే పంజాబ్‌లో 301 కేసులు నమోదయ్యాయి.

02/10/2019 - 03:27

జైపూర్, ఫిబ్రవరి 9: రాష్ట్రప్రభుత్వ పరిధిలో విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గుజ్జర్ల సామాజిక వర్గానికి చెందిన ఆందోళన కారులు చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. స్వాయి మాదోపూర్ జిల్లాలో ఉద్యమంలో భాగంగా గుజ్జర్లు రైలు పట్టాలపై బైఠాయించారు. దీని వల్ల మూడు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఒక రైలును మళ్లించారు.

02/10/2019 - 01:49

శ్రీనగర్/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఉత్తరభారత దేశంలో చలిగాలు, మంచు తీవ్రత వణికిస్తోంది. జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. శుక్రవారం రాత్రి వీచిన చలిగాలులకు మంచు గడ్డకట్టుకపోయి జనం అవస్థలు పడ్డారు. కాశ్మీర్ లోయని రహదారులన్నీ మంచుతో నిండిపోయాయి. రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైందని అధికారులు వెల్లడించారు.

02/10/2019 - 01:45

చిత్రం.. వసంత పంచమి సందర్భంగా పటియాలాలో గాలిపటాలు (పతంగులు) ఎగరేస్తున్న మహిళలు

02/10/2019 - 01:43

ఇటానగర్ (అరుణాచల్‌ప్రదేశ్), ఫిబ్రవరి 9: జాతీయస్థాయిలో వౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. శనివారం ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. మరో విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుశా దేశంలో ఒకే రోజు ఒక విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన, మరో విమానాశ్రయానికి ప్రారంభోత్సవం జరగడం ఇదేతొలిసారి అన్నారు.

Pages