S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/22/2019 - 02:37

కోల్‌కతా, జనవరి 21: ప్రధాని నరేంద్రమోదీ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామ్య విధానాలతో జనం విసిగిపోయారని సోమవారం ఇక్కడ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై ప్రశంసలు కురిపించారు. మమత మంచి పరిపాల దక్షతగల నాయకురాలని స్వామి చెప్పారు.

01/22/2019 - 02:36

న్యూఢిల్లీ, జనవరి 21: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే చర్యలు తీసుకోవాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది.

01/22/2019 - 02:35

బెంగళూరు, జనవరి 21: నగరంలోని ఓ ప్రైవేటు రిస్టార్‌లోతోటి ఎమ్మెల్యేపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన కాంగ్రెస్ సభ్యుడు జేఎన్ గణేష్‌పై హత్యాయత్నం చేసు నమోదయింది. ఆనంద్ సింగ్ అనే ఎమ్మెల్యేపై దాడి చేసిన గణేష్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. శనివారం రాత్రి ఈగల్టన్ రిసార్ట్స్‌లో ఎమ్మెల్యే కొట్టాట చోటు చేసుకుంది.

01/22/2019 - 02:18

న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన రెండు రోజుల జాబ్ మేళాలో దరఖాస్తులు తీసుకోవడానికి పోటీపడుతున్న నిరుద్యోగ యువతీయువకులు. ప్రైవేటు రంగంలోని 76 కంపెనీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 12,500 మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయ. దేశంలో నిరుద్యోగిత ఏ స్థాయకి చేరిందో చెప్పడానికి ఇదో సజీవ దృశ్యం.

01/22/2019 - 02:09

వారణాసి,జనవరి 21: భారత్‌లో యువశక్తి ఉరకలేస్తోందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. అమెరికా, జపాన్, చైనా వంటి దేశాల్లో వృద్ధ జనాభా పెరిగిపోతోందని, ఒక్క భారత్‌లోనే అత్యధికంగా యువశక్తి ఉందని స్పష్టం చేశారు. జనాభాలో వయసుపరమైన తారతమ్యం వల్ల అభివృద్ధి పథంలోనూ ఇతరాత్రనూ దూసుకెళ్లేందుకు అనూహ్యమైన అవకాశాలున్నాయని అన్నారు.

01/22/2019 - 02:08

గణతంత్ర దినోత్సవం కోసం న్యూఢిల్లీలో సోమవారం రిహార్సల్స్ చేస్తున్న
భారత సైన్యానికి చెందిన ‘డేర్ డెవిల్స్’ బృందం.

01/22/2019 - 02:59

లక్నో, జనవరి 21: మనదేశ ప్రజలు ప్రధానిగా కొత్తవ్యక్తిని చూడాలని అనుకుంటున్నారని, అందుకే బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో మోదీని కాకుండా మరో వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా నిలబెడితే మంచిదని సమాజ్‌వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు.

01/22/2019 - 00:56

బెంగళూరు, జనవరి 21: కర్నాటకలో సోమవారం ఓ పడవ బోల్తాపడ్డ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. మరో వ్యక్తి గల్లంతయ్యాడని, 17మందిని రక్షించామని నౌకాదళ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలోని కురుమగూడ ద్వీపంలో జరిగిన నరసింహస్వామి వార్షిక వేడుకల్లో పాల్గొనేందుకు వీరు వెళ్లారని, దర్శనం అనంతరం పడవలో తిరిగి వస్తూండగా ప్రమాదం జరిగిందని తెలిపారు.

01/22/2019 - 04:31

న్యూఢిల్లీ, జనవరి 21: అవినీతిపై ఉద్యమించేందుకు సామాజికవేత్త అన్నాహజారే మరోసారి సన్నద్ధమవుతున్నారు. అపరిష్కృతంగా ఉన్న రైతుల డిమాండ్లను పరిష్కరించాలని, లోక్‌పాల్ బిల్లును అమలు చేయాలని కోరుతూ ఆయన మరోసారి దీక్షకు దిగనున్నారు.

01/21/2019 - 16:31

న్యూఢిల్లీ: శివైక్యం చెందిన శవకుమారస్వామి మృతికి రాష్టప్రతి రామనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. గొప్ప ఆధ్యాత్మిక, మానవతావాది అయిన స్వామిజీ మరణం ననె్నంతో బాధించిందని, విద్యా, వైద్య రంగాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని రాష్టప్రతి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

Pages