S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/20/2018 - 12:45

భోపాల్: చమత్కారంగా మాట్లాడటంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అందెవేసిన చేయి. ఆయన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత భుద్ని నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ ‘‘్భయపడకండి. పులి బతికేవుంది. మీకేమి కాదు’’ అని అన్నారు. ఈయన వ్యాఖ్యలపై పలువురు పలువిధాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

12/20/2018 - 12:44

పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు పటియాల కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నపుడు ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసులో లాలూపై కేసు నమోదు అయింది. ఈమేరకు ఆయనకు జైలుశిక్ష పడింది.

12/20/2018 - 12:39

న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు రైతురుణ మాఫీని ప్రకటించటంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హార్షం వ్యక్తం చేశారు. తాము రైతురుణ మాఫీకి పది రోజులు అడిగామని, కేవలం రెండు రోజుల్లో చేశామని అన్నారు.

12/20/2018 - 12:37

కోల్‌కతా: ఏకాభిప్రాయంతోనే ప్రధాని అభ్యర్థి ఎంపిక జరుగుతుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని ఇటీవల స్టాలిన్ చేసిన ప్రకటనపై విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని అభ్యర్థిని నిర్ణయించేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు. అందరం కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

12/20/2018 - 04:45

సూళ్లూరుపేట, డిసెంబర్ 19: అత్యంత శక్తివంతమైన జీశాట్-7 ఏ విజయం దేశానికి ఇస్రో ఇచ్చిన గొప్ప కానుకని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ అన్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ ప్రయోగం విజయం అనంతరం ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి నేరుగా మీడియాతో మాట్లాడారు.

12/20/2018 - 04:31

కావేరీ నదిపై కర్నాటక చేపట్టిన మెగదాతు డ్యామ్ నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ,
బుధవారం పార్లమెంటు భవనం ఎదుట నిరసనకు దిగిన ఏఐఏడీఎంకే పార్లమెంటు సభ్యులు

12/20/2018 - 04:15

లక్నోలోని అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నదని ఆరోపిస్తూ ప్రతిపక్షం సమాజ్‌వాది పార్టీ సభ్యులు అసెంబ్లీ ఎదుట ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

12/20/2018 - 04:13

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: గత మూడేళ్లుగా జాతీయ మైనారిటీ కమిషన్ (ఎన్‌సిఎం)కు వచ్చే ఫిర్యాదుల సంఖ్య తగ్గుతూ వస్తోందని లోక్‌సభలో ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చిన మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తర్ అబ్బాస్ తమకు అందిన ఫిర్యాదులపై ఎన్‌సీఎం యాక్టు కింద ఎప్పటికప్పుడు తగిన రీతిలో స్పందించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

12/20/2018 - 04:12

చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (ఓటీఏ)లో బుధవారం శిక్షణ పొందుతున్న
అఫ్గానిస్తాన్ నేషనల్ ఆర్మీ (ఏఎన్‌ఏ) మహిళా అధికారి. అఫ్గానిస్తాన్ సైన్యంలోని అధికారులకు
వారం రోజుల పాటు శిక్షణా శిబిరాన్ని భారత సైన్యం నిర్వహిస్తున్నది

12/20/2018 - 04:07

రాష్ట్రంలో శాంతి భద్రతలపై బుధవారం భోపాల్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సీనియర్ అధికారులతో చర్చించిన తర్వాత డీజీపీ రిషి కుమార్‌తో కలిసి బయటకు వస్తున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్

Pages