S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/21/2018 - 22:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ప్రజాప్రతినిధులకు స్వీయ క్రమశిక్షణ ఉండాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. పాలన అలాగే సభకార్యక్రమాలు సజావుగా సాగడానికి జవాబుదారీతనం తప్పనిసరని ఆమె అన్నారు. పార్లమెంట్‌లో సభ్యుల తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌సభ నియమాల కమిటీ సమావేశం స్పీకర్ మహాజన్ అధ్యక్షతన శుక్రవారం ఇక్కడ జరిగింది.

12/21/2018 - 22:42

హైదరాబాద్, డిసెంబర్ 21: కేంద్రలో ఉన్న బిజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని అందుకు ప్రతిఘటనగా అన్ని జాతీయ కార్మి క సంఘాలు దేశ వ్యాప్త సమ్మెకు సమాయాత్తం కావాలని పిలుపు ఇస్తున్నాయి. 2019 జనవరి 8,9 తేదీల్లో దేశ వ్యాప్తంగా సమ్మె చేయడాని ఇప్పటికే జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగా పిలుపు ఇచ్చాయి.

12/21/2018 - 22:40

పానాజీ, డిసెంబర్ 21: తన పదవిని కాపాడుకునేందుకు రాఫెల్ డీల్ వ్యహారంపై ప్రధాని నరేంద్రమోదీని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్ జైపాల్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన్ ఆక్రోశ్ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పారికర్ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని, దీని వల్ల రాష్ట్రంలో పాలన స్తంభించిందన్నారు.

12/21/2018 - 22:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 21:మైత్రీ బంధంలో సరికొత్త అధ్యయనానికి భారత్-చైనాలు శ్రీకారం చుట్టాయి. ద్వైపాక్షిక, ప్రజా సంబంధాలు, సాంస్కృతిక సహకారం సహా మొత్తం పది అంశాల ప్రాతిపదికగా కలిసి ముందుకు సాగాలని బలంగా సంకల్పించాయి. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ఈల మధ్య శుక్రవారం జరిగిన విస్తృత చర్చలు ఇరు దేశాలు సహకార పథంలో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు బలమైన బాటలే వేశాయి.

12/21/2018 - 17:37

న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలకు విస్తత్ర అధికారాలు కల్పిస్తూ జారీచేసిన ఉత్తర్వులపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ గెజిట్ వ్యక్తిగత స్వేచ్ఛను హరించేదిగా ఉందని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ అని దీనిని మళ్లీ జారీ చేశామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. దేశ భద్రతపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని జైట్లీ అన్నారు.

12/21/2018 - 17:36

ముంబయి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభాను సనఫ్‌కు ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించింది. దేశంలో పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నిందితుడికి విధించిన శిక్ష సరైందేనని హైకోర్టు పేర్కొంది. ఏపీలోని మచిలీపట్నానికి చెందిన ఎస్తేర్ అనూహ్య ముంబయిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది.

12/21/2018 - 13:04

ముంబయి: షోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో 22 మందికి ఊరట లభించింది. ఈ మేరకు ముంబయి స్పెషల్ సీబీఐ కోర్టు 22 మంది పోలీసు ఆఫీసర్లను నిర్దోషులుగా స్పష్టం చేసింది. పోలీసు అధికారులను నిందించటానికి సరైన ఆధారాలు లేవని పేర్కొంది. షోహ్రాబ్ ఎన్‌కౌంటర్ 2005, నవంబర్ 25న జరిగింది. ఆరపణలు ఎదుర్కొంటున్న 22మందిలో రాజస్థాన్, గుజరాత్ జూనియర్ స్థాయ పోలీసులే ఉన్నారు.

12/21/2018 - 12:45

న్యూఢిల్లీ: సైబర్ నేరాలను అరికట్టేందుకు ఏ కంప్యూటర్‌లోని సమాచారాన్నైనా పరిశీలించేందుకు నిఘా సంస్థలకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కంప్యూటర్ నుంచి జనరేట్ అయ్యే సమాచారాన్ని ఎప్పుడంటే అప్పుడు పరిశీలించేందుకు పది దర్యాప్తు సంస్థలకు అధికారం ఇస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది.

12/21/2018 - 12:44

బెంగళూరు: కర్ణాటకలోని సులవడి గ్రామంలో ఉన్న మారెమ్మ ఆలయంలో ప్రసాదం తిని 15 మంది భక్తులు మృతిచెందిన విషయం విదితమే. ఈ కేసులో అరెస్టు అయిన ఆలయ పూజారి ఇమ్మడి మహాదేవ్ నేరాన్ని అంగీకరించారు. ప్రసాదంలో తామే పురుగుల మందు కలిపామని పోలీసుల విచారణలో వెల్లడించారు.

12/21/2018 - 12:41

న్యూఢిల్లీ: 1984 సిక్కుల ఊచకోతలో జీవితఖైదు శిక్షపడిన కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తాను లొంగిపోవటానికి నెలరోజులు గడువు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలుచేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆయన చూపిన కారణాల వల్ల గడువు పెంచాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.

Pages