S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/21/2018 - 01:55

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: విపత్తును ‘విఠలాచార్య సీనిమా’లా జయించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సాఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లోపల, బయట ఆందోళన కొనసాగించారు.

12/21/2018 - 01:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: దేశ రాజకీయాల్లో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకపాత్ర పోషిస్తారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ జోస్యం చెప్పారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వానికి కొన్ని పార్టీలు పార్లమెంట్‌లో అండగా వున్నాయని ఆరోపించారు. దేశంలోని ఇతర పార్టీల సహకారంతోనే బీజేపీ పార్లమెంట్‌లో విభజించు పాలించు ధోరణితో ముందుకు వెళ్తోందని ఆయన చెప్పారు.

12/21/2018 - 01:54

హిజబ్ పనాజీ, డిసెంబర్ 20: మత సంప్రదాయం ప్రకారం తన తలకు కట్టుకున్న హిజాబ్ (తలపై కట్టుకునే వస్త్రం) తీయడానికి నిరాకరించానన్న ఆరోపణలతో అధికారులు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్‌ఇటీ)కి హాజరుకాకుండా తిరస్కరించారని ఒక మహిళ (24) ఆరోపించింది. కాలేజీ, యూనివర్సిటీ స్థాయి లెక్చరర్ల అర్హతకు, జూనియర్ రీసెర్చి ఫెలోషిప్ అర్హత కోసం యూజీసీ గ్రాంట్స్ కమిషన్ ఈనెల 18న నెట్‌ను నిర్వహించింది.

12/21/2018 - 01:43

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోసం పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం ఎంపీలు నిరసనకు దిగారు.

12/21/2018 - 01:41

సూళ్లూరుపేట, డిసెంబర్ 20: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన భారత కమ్యూనికేషన్ రంగానికి చెందిన జీశాట్-7ఏ ఉపగ్రహ కక్ష్య పెంపుకార్యక్రమాన్ని గురువారం శాస్తవ్రేత్తలు విజయవంతంగా చేశారు. బుధవారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ ద్వారా జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని రోదసీలోపి పంపిన విషయం తెలిసిందే.

12/21/2018 - 01:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఎన్నికల ఓటింగ్ యంత్రాలతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలను మార్చేందుకు ఎలాంటి అవకాశం లేదని, అయితే ఇవి చాలాచోట్ల పనిచేయడం లేదన్న ఆరోపణలు వస్తున్న దృష్ట్యా ఆ లోపాలను కనిష్టస్థాయికి తగ్గిస్తామని వెల్లడించారు. రాజకీయ పార్టీలు తమ వాదనలను పదును పెట్టుకోవడానికి ఈవీఎంలలో లోపాలున్నాయని ఆరోపణలు చేయడం విచారకరమన్నారు.

12/21/2018 - 01:36

హైదరాబాద్, డిసెంబర్ 20: దేశ చరిత్రలోనే రఫెల్ పెద్ద కుంభకోణంగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అభివర్ణించారు. యుద్ధ విమానాల అసలు ధర కంటే 200 శాతం అధికంగా పెంచేసి కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌కు బుధవారం వచ్చిన మొయిలీ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చిన ప్రధాని మోదీ, రఫెల్ విమానాలను మాత్రం విదేశాల నుంచి కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారన్నారు.

12/21/2018 - 01:32

చిత్రం..కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని గురువారం ఆయన ఛాంబర్‌లో కలుసుకొని, 2014 ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం కింద తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేటాయంచిన మొత్తంలో రెండో వాయిదాను విడుదల చేయాల్సిందిగా కోరుతూ వినతి పత్రం సమర్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు

12/21/2018 - 01:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి అనుమతులు లేకుండా ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లిస్తున్నారని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలైంది. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి ఎటువంటి అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని, దీని విషయంలో ఏన్జీటీ జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్, త్రినాధ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

12/21/2018 - 00:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించిన మరింత సమాచారం కోరినట్లు తెలిసింది. రాష్ట్రపతి అదన సమాచారం కోరటం వల్లే హైకోర్టు విభజనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయటంలో ఆలస్యమవుతోందని అంటున్నారు.

Pages