S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/21/2018 - 12:38

హైదరాబాద్: తమను టీఆర్‌ఎస్ పక్షంలో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీ సభ్యులు శాసనమండలి సభాపతిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ తరపున ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, దామోదర్ రెడ్డి, సంతోష్ కుమార్, ఆకుల లలిత శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసి లేఖను అందించారు.

12/21/2018 - 03:52

న్యూఢిల్లీ: నిద్రమత్తులో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని ఎట్టకేలకు తాము నిద్రలేపామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యంగ్యోక్తిగా ఉన్నారు. జీఎస్టీ విధిస్తున్న వాటిలో 99 శాతం వస్తువులను 18 శాతం శ్లాబ్‌లోకి తీసుకువస్తామని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై రాహల్ స్పందిస్తూ ఈ విషయంలో మత్తులో జోగుతున్న మోదీ ప్రభుత్వాన్ని నిద్రలేపామని వ్యాఖ్యానించారు.

12/21/2018 - 02:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: సివిల్ సర్వీస్ పరీక్షల్లో ప్రవేశానికి జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు వయోపరిమితిని 27 సంవత్సరాలకు తగ్గించాలని నీతి ఆయోగ్ సూచించింది. ప్రస్తుతం 30 సంవత్సరాల వయసు నుంచి మాత్రమే ఈ పరీక్షలు రాయాలన్న నిబంధన ఉంది. కనీసం 2023-23 సంవత్సరం నాటికైనా అంచలంచెలుగా ఈ వయోపరిమితిని 27 సంవత్సరాలకు తగ్గించాలని నీతి ఆయోగ్ సూచించింది.

12/21/2018 - 02:10

కోల్‌కతా, డిసెంబర్ 20: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తలపెట్టిన ‘రథ యాత్ర’కు కలకత్తా హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రథయాత్రలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. రాష్టవ్య్రాప్తంగా బీజేపీ మూడుచోట్లనుంచి రథయాత్రలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ యాత్రలను అనుమతించిన హైకోర్టు..

12/21/2018 - 02:09

చిత్రం.. రాముడు వేషం వేసినా.. ఆధునికతకు తగ్గట్టుగానే ఉండాలి. గురువారం బెంగళూరులో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ఊరేగింపులో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న శ్రీరామ వేషధారుడు

12/21/2018 - 02:07

చిత్రం..కావేరీ నదిపై కొత్తగా నిర్మిస్తున్న ఆనకట్టలకు నిరసనగా గురువారం ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట
ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన జరుపుతున్న అన్నాడీఎంకె ఎంపీలు

12/21/2018 - 02:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: కర్నాటక ప్రభుత్వం చేపట్టిన మేకదాటు ప్రాజెక్టుకు మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ లోక్‌సభలో కలిసికట్టుగా గొడవ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాయి. కర్నాటకకు చెందిన కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి మేకదాటు ప్రాజెక్టుకు అనుకూలంగా నినాదాలిచ్చారు. అన్నా డీఎంకే సభ్యులు మేకదాటు ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తే..

12/21/2018 - 02:02

చిత్రం..గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

12/21/2018 - 01:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఆహార పదార్థాల తయారీలో మిగులు సాధిస్తున్న భారత వ్యవసాయ రంగం నుంచి వినియోగం వరకు అనుసంధానం కావాలని, అలాగే ఆహార వృథాను తగ్గించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు.

12/21/2018 - 01:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: దేశంలోని దిగువ కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి అఖిల భారత స్థాయిలో పరీక్ష నిర్వహించాలని నీతిఆయోగ్ ప్రతిపాదించింది. పాలన పట్ల జవాబుదారీతనం కల్పించేందుకు యువత, ప్రతిభావంతులైన లా పట్ట్భద్రులను న్యాయవ్యవస్థలోకి రావల్సి ఉందని పేర్కొన్నారు. అఖిల భారత న్యాయ సర్వీసుల పరీక్షలు నిర్వహించి ర్యాంకులను బట్టి ఎంపికలు జరగాలని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.

Pages