S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/20/2018 - 23:45

న్యూఢిల్లీ: విజయవాడలో మెట్రోరైల్ నిర్మాణంకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన అందలేదని పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

12/20/2018 - 17:02

న్యూఢిల్లీ:ఆర్ఎస్ఎల్‌పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుషవాహ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో 'మహాకూటమి'లో చేరినట్టు ఆయన ప్రకటించారు.తనను మహాకూటమిలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

12/20/2018 - 16:41

బెంగళూరు: కర్ణాటకలోని చామరాజనగర జిల్లా సూల్వాడలోని మారెమ్మ ఆలయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదంలో 15 బాటిళ్ల విషపూరితమైన పురుగుమందు కలిపారని పోలీసుల వెల్లడించారు. గాఢత అధికంగా ఉండటంతో 15మంది భక్తులు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు ఇమ్మాడి మహదేశ్వర స్వామి అలియాస్ దేవన్న మరో ముగ్గురుతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ట్రస్ట్ యాజమాన్యంతో దేవన్నకు ఉన్న విభేదాలే దీనికి కారణం.

12/20/2018 - 16:40

పాట్నా: ఆర్జేడీ చీఫ్ లలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, యహువా ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్‌కు ప్రభుత్వం కొత్త బంగ్లా కేటాయించింది. రాజకీయ పోరాటం చేసేందుకు తనకు బంగ్లా కేటాయించాలని ఆయన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం బంగ్లా కేటాయించింది.

12/20/2018 - 16:39

న్యూఢిల్లీ: సిక్కుల ఊచకోత కేసులో జీవిత ఖైదు పడిన కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్ ఈరోజు పటియాల కోర్టుకు హాజరయ్యారు. నానావతి కమిషన్ సిఫార్సుల మేరకు సీబీఐ దాఖలు చేసిన రెండో కేసులో విచారణ కోసం ఆయన పటియాల కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను జనవరి 2వ తేదీకి వాయిదా వేశారు.

12/20/2018 - 16:38

న్యూఢిల్లీ: లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈరోజు వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. లోకసభ జరుగకుండా ఏర్పడుతున్న అంతరాయాలపై ఆమే వివిధ పార్టీల నేతలతో చర్చించారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. సభలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు రేపు రూల్స్ కమిటీ వేయాలని నిర్ణయించారు. సమావేశానికి ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతో పాటు వివిధ పార్టీల నేతలు దాదాపు 20మంది హాజరయ్యారు.

12/20/2018 - 16:37

న్యూఢిల్లీ: చలి గాలులతో ఉత్తర భారతం వణుకుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఒక విధంగా మంచు కురుస్తుండటంతో సిమ్లాను తలపిస్తోందని అంటున్నారు. చత్తీస్‌గఢ్‌లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో పాటు వీస్తున్న చలి గాలులకు పశువులు అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లో 24 గంటల వ్యవధిలోనే 45కు పైగా పశువులు చనిపోయాయి.

12/20/2018 - 13:25

న్యూఢిల్లీ: నేడు కూడా ఎలాంటి కార్య క్రమాలు జరగకుండానే రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. చైర్మన్ సభను ప్రారంభించగానే టీడీపీ ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి ప్రత్యేక హోదా కోసం, కావేరీ జల వివాదంపై అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయటంతో చైర్మన్ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేస్తూ.. ఆమోదించాల్సిన బిల్లులు చాలా వున్నాయని, దేశం మనల్ని గమనిస్తుందని అన్నారు.

12/20/2018 - 13:24

చెన్నై: తమిళ సినీ నిర్మాతల సంఘంలో రగులుతున్న వివాదం రోజు రోజుకి ముదురుతుంది. సినీ నటుడు విశాల్‌ను విభేదిస్తున్న 50 మంది నిర్మాతలు నిన్న సంఘం కార్యాలయానికి తాళం వేశారు. తాళం పగులగొట్టి కార్యాలయంలోకి వెళ్లాలనుకున్న విశాల్‌ను ఈరోజు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయ. దీంతో పోలీసులు విశాల్‌ను అరెస్టు చేశారు. సినీ నిర్మాతలు సంఘం పనితీరుపై ఆగ్రహాం వ్యక్తంచేస్తున్నారు.

12/20/2018 - 12:49

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహాం ఎదుట గురువారంనాడు కూడా ఆందోళన చేశారు.

Pages