S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/07/2018 - 02:19

బెంగళూరు, నవంబర్ 6: కర్నాటకలో జేడీఎస్- కాంగ్రెస్ పార్టీల విజయపరంపర కొనసాగుతోంది. మూ డు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జేడీఎస్ కాంగ్రెస్ కూటమి రెండు సీట్లలో, బీజేపీ ఒక సీటులో గెలిచింది.

11/07/2018 - 02:16

ఢిల్లీ, నవంబర్ 6: మూడు ఆఫ్రికా దేశాల్లో జరిపిన పర్యటన సత్ఫలితాలు ఇచ్చిందని, భారత్- ఆఫ్రికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త మలుపు తిరిగేందుకు దోహదపడుతాయని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. బోత్స్వానా, జింబాబ్వే, మాలవి దేశాల పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో ఎం వెంకయ్యనాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. అంతకు ముందు ఆయన విమానంలో విలేఖర్లతో మాట్లాడారు.

11/07/2018 - 02:14

శబరిమల (కేరళ), నవంబర్ 6: శబరిమల స్వామి అయ్యప్ప దేవాలయం వద్ద మంగళవారం కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక మహిళా యాత్రికురాలు ఆలయ సందర్శనకు రాగా, 200 మంది భక్తులు అటకాయించారు. మరో ఘటనలో మలయాళం టీవీ చానల్‌కు చెందిన ఒక కెమెరామెన్‌పై దాడి చేశారు. 52 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక భక్తురాలు అయ్యప్ప దర్శనానికి రాగా ఆందోళన కారులు అడ్డుకున్నారు.

11/07/2018 - 02:10

న్యూఢిల్లీ, నవంబర్ 6: భారత ప్రజల సొమ్మును దోపిడీ చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. భారత్ రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్న నగదు నిల్వల నుంచి 3.6 లక్షల కోట్ల రూపాయలను తనకివ్వమని కేంద్రం అడుగుతోందని, ఇదికార్యరూపం దాలిస్తే భారత దేశ చరిత్రలోనే ‘ద గ్రేట్ ఇండియన్ రాబరీ’ అవుతుందని విమర్శించింది.

11/07/2018 - 01:53

న్యూఢిల్లీ, నవంబర్ 6: ఇప్పటికే వాతావరణ కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకున్న ఢిల్లీలో దీపావళి తర్వాత ఇది మరింత ఆందోళనకరంగా పరిణమించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిని అధిగమించడానికి వారు దీపావళి తర్వాత దేశరాజధానిలో కృత్రిమ వర్షం కురిపించాలని యోచిస్తున్నారు. మేఘమథనం ద్వారా కురిపించే ఈ వర్షం వాతావరణ కాలుష్యానికి విరుగుడు అవుతుందని వారు అంటున్నారు.

11/07/2018 - 01:03

రాయ్‌పూర్, నవంబర్ 6: బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)అధినేత్రి మాయవతికి దేశ ప్రధాన మంత్రి కాగల అన్ని అర్హతలూ ఉన్నాయని చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి స్పష్టం చేశారు. జాతీయ కాంగ్రెస్‌ను వీడిన జోగి ‘చత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్’ పేరుతో సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే.

11/07/2018 - 00:55

జైపూర్, నవంబర్ 6: ఎన్నికల్లో నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ నేతలు రామమందిరాన్ని తిరిగి తెరపైకి తెస్తున్నారని రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇలా ఈ అయోధ్య వివాదాన్ని ప్రస్తావించి లబ్ధిపొందాక తిరిగి నాలుగు సంవత్సరాలపాటు వౌనం వహించడం వారికి పరిపాటేనన్నారు.

11/07/2018 - 00:37

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభకు పోటీచేసే మిగతా 37 మంది అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భక్తచరణ్‌దాస్ నాయకత్వంలోని రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో మల్లగుల్లాలు పడుతోంది. తెలుగుదేశం నుండి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశంపై వాదోపవాదాలు జరిగినట్లు తెలిసింది.

11/07/2018 - 00:21

అయోధ్య, నవంబర్ 6: అయోధ్య లక్షలాది దీపాల కాంతులతో మంగళవారం మిరుమిట్లు గొలిపింది. దీపావళి సందర్భంగా దాదాపు మూడు లక్షల దీపాలను సరయు తీరంలో ఏకకాలంలో వెలిగించారు. ఈ స్థాయిలో ఒకేసారి దీపాలను వెలిగించడం ద్వారా గిన్నిస్ రికార్డును సాధించారు. ఈ విషయాన్ని గిన్నిస్ ప్రపంచ రికార్డుల అధికారిక నిర్ధారణకర్త రుషినాథ్ వెల్లడించారు.

11/07/2018 - 00:16

న్యూఢిల్లీ, నవంబర్ 6: కర్నాటకలోని మూడు లోక్‌సభ, రెండు శాసనసభ నియోజకర్గాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు బీజేపీని ఆందోళనలో పడవేశాయి. కర్నాటక ఉపఎన్నికల ఫలితాల ప్రభావం ఈ నెలాఖరున జరుగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ శాసనసభల ఎన్నికలతోపాటు ఆ తరువాత 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలపై కూడా పడుతుందని బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆందోళన చెందుతున్నాయి.

Pages