S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కత్తిమీద సాము

వరంగల్, డిసెంబర్ 9: కస్తూరిభా విద్యాలయాలలో ప్రస్తుతం పదవ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తుండగా, ఈ విద్యాలయాలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రిని పలుమార్లు కోరామని చెప్పారు. విద్యాశాఖను పటిష్టపరిచే కార్యక్రమంలో భాగంగా కొత్తగా 256గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించగా, వచ్చే ఏడాది మరో 210గురుకుల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో తరగతులు ప్రారంభిస్తామని అన్నారు.

సక్రమంగా పనులు

వరంగల్, డిసెంబర్ 9: కేంద్రప్రభుత్వం వరంగల్ నగరాన్ని ఇప్పటికే అమృత్, స్మార్ట్‌సిటీ, హృదయ్, హెరిటేజీ పథకాల కింద ఎంపిక చేసి నిధు మంజూరు చేస్తోందని, రాష్ట్రప్రభుత్వం వరంగల్ నగరానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నగరాన్ని సందరంగా మార్చేందుకు, అభివృద్ధి పనులు సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అమృత్ పథకంపై చర్చించేందుకు ఢిల్లీకి చెందిన కన్సల్టెంట్ బృందం శుక్రవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాలులో కలెక్టర్, పోలీసు కమీషనర్, వివిధ శాఖల అధికారులతో సమావేశమయింది.

ఇళ్లలో చోరీలు చేసే ఇద్దరు పట్టివేత

వరంగల్, డిసెంబర్ 9: వరంగల్ పోలీసు కమీషనరేట్ పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడే ఇద్దరు నిందితులను వరంగల్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసారు. నిందితుల నుంచి 2.88లక్షల రూపాయల విలువచేసే 57గ్రాముల బం గారం, 1.230కేజీల వెండి నగలుల, ద్విచక్రవాహనంతోపాటు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ సిసిఎస్ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సెంట్రల్ క్రైం ఇన్‌స్పెక్టర్ భీంశర్మ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణం వికాస్‌నగర్ ప్రాంతానికి చెందిన ఎం.డి.ఖాజా, గడ్డం ప్రణయ్ చిన్ననాటి మిత్రులు.

అధికారం అండతో అక్రమ కేసులు

జఫర్‌గడ్, డిసెంబర్ 9: జఫర్‌గడ్ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో కలపాలంటూ ఆందోళన చేస్తున్న జెఎసి నాయకులపై అధికారం అం డతో అక్రమ కేసులు బనాయిస్తున్నాడని మాజీమంత్రి గుండె విజయరామారావు అన్నారు. శుక్రవారం జఫర్‌గడ్ మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాభిప్రాయాలను సేకరించకుండా స్వలాభం కోసం జఫర్‌గడ్ మండలా న్ని జనగామ జిల్లాలో కలిపాడని, దీనిని అడిగినందుకే జఫర్‌గడ్ మండల జెఎసి నాయకులపై కేసులు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక్క డ ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా ముఖ్యమంత్రికి తెలియడం లేదా అని ప్రశ్నించారు.

గ్రామీణ క్రీడలకు చేయూత నిస్తాం

నర్సంపేట, డిసెంబర్ 9: 62వ పాఠశాలల క్రీడా సమాఖ్య రాష్ట్ర స్థాయి కబడ్డీ ఎంపిక క్రీడోత్సవాలను శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. నర్సంపేట పట్టణంలోని వల్లబ్‌నగర్ మినీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఎంపిక క్రీడా పోటీలు మూడు రోజుల పాటు జరగనున్న విషయం తెల్సిందే. ఈక్రమంలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించి ప్రసంగించారు. గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. చదువుతో పాటు ఆటపాటల్లో రాణించి క్రీడల్లో రాష్ట్రం పేరు ప్రఖ్యాతలను తీసుకరావల్సిందిగా కోరారు. క్రీడల వల్ల చురుకుదనం పెరుగుతుందని అన్నారు.

తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధే

నక్కలగుట్ట,డిసెంబర్ 9:తెలంగాణ రాష్ట్ర సాకారం చేసింది మహోన్నత నాయకురాలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాందీనే అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్వర్యంలో కృతజ్ఞతాదివస్‌ను నిర్వహించారు. ఈ సందర్బంగా ముందుగా నాయిని రాజేందర్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు కట్ల శ్రీనివాస్‌లు కేక్ కట్ చేసి, సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నాయిని మాట్లాడుతూ దేశానికి ఒక దిశా నిర్దేశం చేయగల సామర్థ్యం ఉన్న నాయకురాలు సోనియా అని తెలిపారు.

రక్తదానం.. మహాదానం..!

సుల్తానాబాద్, డిసెంబర్ 9: అన్ని దానాల్లోకన్నా రక్తదానం మహాదానమని, రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడినవారవుతారని పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 10వ వార్షికోత్సవం సందర్భంగా బ్యాంక్ మేనేజర్ కాసుల ముకుందరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని జ్యోతిప్రజ్వలన చేసి జెసి ప్రారంభించారు. బ్యాంక్ ఖాతాదారులు 24 మంది రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరం నిర్వహించిన బ్రాంచ్ మేనేజర్ ముకుందరెడ్డిని జెసి అభినందించారు.

అనవసర రాద్ధాంతం

భాన్సువాడ, డిసెంబర్ 9: అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహరహం శ్రమిస్తున్న తెరాస ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అర్ధరహిత విమర్శలు చేస్తూ అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్ర చేపట్టి సిపిఎం నాయకులు చేస్తున్న విమర్శల్లోనూ ఎలాంటి వాస్తవం లేదని, విమర్శలు చేసే ముందు సదరు పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు.

జనవరి నుంచి అడ్వాన్స్ బస్ ఎంక్వైరీ

విజయనగరం, డిసెంబర్ 9: వచ్చే ఏడాది జనవరి నుంచి ఆర్టీసీలోని అన్ని బస్సులకు అడ్వాన్స్ బస్ ఎంక్వైరీ సిస్టం విధానాన్ని అమలు చేస్తామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య వెల్లడించారు. శుక్రవారం ఆయన ఇక్కడి ఆర్టీసీ వర్క్‌షాపు, బస్సు డిపోలను పరిశీలించారు. అనంతరం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు అవసరమైన సంస్కరణలు చేపడుతున్నామన్నారు. సంస్థకు లాభాలు రావాలంటే సిబ్బంది ప్రవర్తనలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీపై రుణభారం రూ.1000 కోట్లు ఉందన్నారు.

కల్తీపై మరింత కఠినం

విజయవాడ, డిసెంబర్ 9: రాష్ట్రంలో కల్తీకి పాల్పడుతున్న వారిపై మరింత కఠినంగా వ్యవహరించి ఉక్కుపాదంతో అణచివేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కల్తీ వ్యాపారులను హెచ్చరించారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ శామ్యూల్ ఆనంద ఆధ్వర్యంలో ఆహార కల్తీ నియంత్రణ విభాగం, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో కల్తీకారం వ్యాపారులపై దాడులు నిర్వహించామన్నారు.

Pages