S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దమ్మున్న రక్షకభటుడు

రీచాపనయ్, బాహుబలి ప్రభాకర్, పృధ్వీ, బ్రహ్మాజీ, సప్తగిరి ముఖ్యపాత్రల్లో వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై గురురాజ్ నిర్మిస్తున్న ‘రక్షకభటుడు’ చిత్ర టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పోస్టర్‌ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ఎం.ఎస్.రాజు, దిల్‌రాజు, దర్శకుడు వంశీకృష్ణ, గురురాజ్ తదితరులు పాల్గొన్నారు.

మార్పు (కథ)

అప్పటిదాకా ఆడి ఆడి అలసిపోయిన భాస్కర్‌కు ఆకలి దంచేస్తా వుంది. పరుగు పరుగున వెళ్లి, ‘‘అమ్మా!... మో! కూడెయ్‌మా!’’ అన్నాడు.
కొడుకు అరుపు విని, ఆమె గబగబా పోయి ఒక సంగటి ముద్దను సగం తుంచి గినె్నలో వేసుకుని వచ్చింది. పాపం, భాస్కర్‌కు ఆ సంగటిని చూడగానే కడుపులో మండే ఆకలి సల్లగా ఎక్కడికో పోయింది. ఏడుపు మొహం పెట్టుకున్నాడు.
‘‘తినరా! అంది’’ అమ్మ.
‘‘నాకొద్దుపో, నే తిన్ను. నాకు కూడే కావాల’’ అన్నాడు భాస్కర్ మొండిగా.
‘‘తిను నాయనా! లేని కూడు, నేను యాడికిబోయి తెచ్చేదిరా!’’ అంది రత్నమ్మ.

- ఆడేరు చెంచయ్య నాయుడుపేట, చరవాణి : 9492331449

గాత్ర గంధర్వునికి నీరాజనం

ఓ సంగీత సౌరభం నేలరాలింది
ఓ సుస్వర, సుమధుర గానామృతం
సుదూర తీరాలకేగింది
ఓ అపర త్యాగరాజు ఆహుతులను వీడి
అమరులయ్యారు
ఓ వెండితెర స్వరధ్రువతార అదృశ్యమైంది
ఓ రాగాల సృష్టికర్త అంతర్ధానమయ్యారు
ఓ వాగ్గేయకారుడు స్వర్గానికేతెంచారు
ఓ సంగీత దిగ్గజం తనువు చాలించింది
ఓ స్వరకర్త (మహాభి) నిష్క్రమించారు
ఓ గాత్రమాంత్రికుడు అవని అక్కున చేరారు
ఓ గాన గంధర్వుడు గగనానికేగారు
ఓ సుప్రసిద్ధ విద్వాంసుడు కీర్తిశేషులయ్యారు
గాన వైదుష్యంలో ఓ మేరు పర్వతం
కుప్పకూలింది
శాస్ర్తియ సంగీత జగత్తులో
ఓ మహాదిగ్గజం అస్తమించింది

నల్లధనంపై కవితలు భేష్ (స్పందన)

గతవారం మెరుపులో ప్రచురించిన నల్లధనంపై కవితలు చాలా బాగున్నాయి. అర్ధరాత్రి నిర్ణయం శీర్షికతో చాకలికొండ శారదగారు రాసిన కవిత సామాన్యుల కష్టాలను వర్ణించింది. అలాగే యుద్ధం పేరుతో కుర్రాప్రసాద్ గారు రాసిన కవిత ఇంకా బాగుంది. నల్లధనాన్ని స్వాగతిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు సహజమే.. భరిద్దాం అంటూ ఉత్తేజభరితంగా రాసిన ప్రసాద్‌గారికి ధన్యవాదములు. కొడవలూరు ప్రసాదరావు గారి కవిత నల్లధనమా పారిపో కూడా బాగుంది. కుబేరుల ఇళ్లల్లో కులుకుతూ, దేశ సౌభాగ్యం కోసం ప్రతి ఒక్కరికి సహకరిద్దాం అంటూ మంచి వాక్యాలతో కవితను మలిచిన విధం బాగుంది.
- రేఖారాణి, ఒంగోలు
- ఇల్లెందు సాయిరాజా, కోట

విమర్శలు-పరిమితులు

విమర్శ లేకుండా జీవితం గడవదు. మనకు ఇష్టం వున్నా లేకున్నా ఎప్పుడూ విమర్శ కొనసాగుతూనే ఉంటుంది. విమర్శల్లో సద్విమర్శ కూడా ఉంటుంది. విమర్శలోని మంచిని మనం గ్రహించగలగాలి. అప్పుడు కొంత వృద్ధి చేసుకోగలుగుతాం.
విమర్శ వేరు. తీర్పులు వేరు. ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు అందులోని బాగోగులు చెప్పడం, మరోలా చేస్తే బాగుండేదని చెప్పడం లాంటి విమర్శలను స్వాగతించాల్సిందే. అలా కాకుండా కొంతమంది ఇతరుల మీద తీర్పులు చెప్పేస్తుంటారు.
వాడికి ఏమీ చేతకాదు.
వాడు ఎందుకూ పనికిరాడు.
ఆ పని చేయడం వాడి శక్తికి మించి ఎక్కువ.

-జింబో 94404 83001

చిన్న ప్రయత్నం (సండేగీత)

చిన్నప్పుడు ప్రపంచమంతా మన ముందు వున్నట్టుగా అన్పించేది. ప్రతిదీ తాజాగా కొత్తగా అన్పించేది. తెలియకుండానే మనలో ఏవో కోరికలు కలిగేవి. పైకి చెప్పడానికి బిడియంగా అన్పించేది. కానీ ఎన్నో కోరికలు కలిగేవి.
మా ఇంటి నుంచి బడికి వెళ్తున్నప్పుడు పోలీసుస్టేషన్ కన్పించేది. అక్కడ కన్పించే జనాలను చూసి మా మిత్రులు ఆశ్చర్యపోయేవారు. అమీన్ సాబ్ (ఎస్.ఐ.) రోడ్డు మీదకు వస్తే అందరూ ఎంతో గౌరవం ఇచ్చేవాళ్లు. భయభక్తులతో మెలిగేవారు. అది చూసి ఓ మిత్రుడు తనకి ఎస్.ఐ కావాలని ఉందని చెప్పేవాడు.

రామాయణం.. మీరే డిటెక్టివ్ 14

తిరిగి హరిదాసు చెప్పే రామకథని ఆశే్లష వినసాగాడు.
దితి దుఃఖిస్తూ దేవేంద్రుడితో చెప్పింది.
‘నా లోపం వల్లే గర్భస్థ శిశువు ఐదు ముక్కలుగా నరకబడ్డాడు తప్ప ఇందులో నీ తప్పు లేదు. నాకో పని చేసి పెట్టు. నరకబడ్డ నా ఏడు మంది కొడుకులు అంతరిక్షంలోని వాతస్కంధాలకి (ఇవి నక్షత్ర మండలాలు, మొదలైన వాటికి ఆధారాలని పురాణాల్లో ఉంది) అధిష్టాన దేవతలై అంతరిక్షంలో సంచరించాలి. ఒకరు బ్రహ్మలోకంలో, ఒకరు ఇంద్రలోకంలో, మరొకరు వాయువు అనే అంతరిక్షంలో తిరగాలి. మిగిలిన నలుగురు నాలుగు దిక్కుల్లో తిరగాలి. వీరు ‘మరుత్తులు’ అనే పేరుతో ప్రసిద్ధి చెందాలి’

మల్లాది వెంకట కృష్ణమూర్తి

పురుషుల, స్ర్తిల, పిల్లల సంఖ్య ఎంత? (పజిల్)

ఒక ఫంక్షన్‌లో 72 మంది పాల్గొన్నారు. అందులో పురుషులకన్నా స్ర్తిలు రెండు రెట్లు, స్ర్తిలకు ఒకటిన్నర రెట్లు పిల్లలు పాల్గొన్నారు. అయితే వారి సంఖ్య విడివిడిగా ఎంత?

జ: 12 పురుషులు, 24 మహిళలు, 36 మంది పిల్లలు

-చామర్తి వెంకట రామకృష్ణ

సలహా (కథ)

ధరణీపుత్ర మహారాజుకు లేకలేక కలిగిన ఏకైక సంతానం భోగేశ్వర్. ఆ బిడ్డను ఎంతో గారాబంగా అల్లారుముద్దుగా పెంచసాగారు. గురుకులానికి పంపి విద్యాబుద్ధులు నేర్పవలసిన వయస్సు వచ్చినా ఆ విషయంపై మహారాజు అంత ఆసక్తి చూపలేదు. తన కుమారుడ్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనని మహాపండితుల్ని, గురువుల్ని రాజమందిరానికే పిలిపించి చదువు చెప్పమని ఆదేశించారు.

-షేక్ జాని

ఈ చేప విషం సైనైడ్ కన్నా ప్రమాదం

బంతిలా గుండ్రంగా కన్పిస్తున్న ఈ చేపలను ‘పఫర్’ ఫిష్ అంటారు. మామూలుగా ఉన్నప్పుడు సాధారణ చేపల్లానే కన్పిస్తాయి. కానీ ప్రమాదం పొంచి ఉందని భావించినప్పుడు పొట్టలోకి గాలి లేదా నీటిని పీల్చి ఉబ్బిపోయి ఇలా గుండ్రంగా తయారవుతాయి. గ్లోబ్ ఫిష్, టోడ్ ఫిష్, బ్లోఫిష్, స్వెల్‌ఫిష్ ఇలా ఎన్నో పేర్లతో వీటిని పిలుస్తారు. ఇవి విషపూరితమైనవి. వీటిలో టెట్రోడొటొ అనే విషం ఉంటుంది. ఇది సైనైడ్ కన్నా ప్రమాదకరమైనది. ఒక చిన్న పఫర్‌ఫిష్‌లో ఉండే విషం 30మంది మనుషులను హతమార్చేంత ప్రభావం చూపిస్తుంది. వీటికి యాంటీడోట్ ఇంతవరకూ కనిపెట్టలేదు. కేవలం షార్క్ చేపలు మాత్రమే వీటిని తిని బతకగలవు.

ఎస్.కె.కె.రవళి

Pages