S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపికి మరో వంద కోట్ల చిల్లర నోట్లు వస్తున్నాయి!

విజయవాడ, డిసెంబర్ 9: రాష్ట్రానికి 100 కోట్ల రూపాయల మేరకు చిన్న నోట్లను ఒకటి, రెండు రోజుల్లో సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిఖ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన విలేఖరులతో శుక్రవారం మాట్లాడుతూ 50, 100, 500 నోట్లు మాత్రమే ఇందులో ఉంటాయని తెలిపారు. దీని వల్ల జిల్లాల్లో చిల్లర నోట్ల సమస్య చాలా వరకూ తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్‌బిఐ ప్రత్యేకంగా ఈ మేరకు కొంత నగదును పంపనుందన్నారు. రాష్ట్రంలో నగదు కొరత సమస్య ఉన్నప్పటికీ, ఆర్‌బిఐని సమన్వయం చేసుకుంటూ ఈ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

రెండు మందుపాతర్ల నిర్వీర్యం

ముంచంగిపుట్టు, డిసెంబర్ 9: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం బరడ పంచాయితీ బొడ్డాపుట్టు రహదారి మధ్యలో మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతర్లను శుక్రవారం పోలీసులు నిర్వీర్యం చేశారు. కూంబింగ్ చేసే పోలీసులను లక్ష్యంగా చేసుకుని గతంలో మావోయిస్టులు అమర్చిన అధునాతన మందు పాత్రలను పక్కా సమాచారంతో వెలికితీసినట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 6న రూఢకోట పోలీస్ ఔట్‌పోస్టుకు రెండు కిలోమీటర్ల దూరంలో మావోయిస్టులు అమర్చిన 20 కేజీల మందుపాతరను నిర్వీర్యం చేసిన సంఘటన మరువకముందే బరడ సమీపంలో బొడ్డాపుట్టు రోడ్డు మధ్యలో అమర్చిన మందుపాతర్లను బాంబ్ స్క్వాడ్ వెలికితీసి శుక్రవారం నిర్వీర్యం చేసింది.

నోట్ల కోసం ఖాతాదారుల పాట్లు

రేణిగుంట/్భమవరం, డిసెంబర్ 9: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులపై ఖాతాదారులు ఎదురు తిరిగిన సంఘటన శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా రేణిగుంటలో చోటుచేసుకుంది. రేణిగుంట ఎస్‌బిఐలో ఉదయం 7 గంటల నుంచి తమ డబ్బులు డ్రా చేసుకోడానికి ఖాతాదారులు వేచి ఉన్నారు. అయితే ఉదయం 10 గంటలకు బ్యాంకు లావాదేవీలు కొనసాగుతుండగా అప్పటికే బ్యాంకులో డబ్బులు అయిపోయినట్లు ఖాతాదారులకు బ్యాంకు అధికారులు తెలపడంతో ఒక్కసారిగా డబ్బు డ్రా చేసేందుకు వచ్చిన ఖాతాదారులు అధికారులపై ఎదురు తిరిగారు.

రైట్..రైట్..!

అమరావతి, డిసెంబర్ 9: అనంతపురం నుంచి అమరావతి వరకు ఎక్కడా మలుపుల్లేని 598.830 కిలోమీటర్ల ఆరులైన్ల ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణానికి 26,890 (10,843 హెక్టార్లు) ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 1518.75 హెక్టార్ల అటవీ భూమి వుంది. పరిస్థితులను బట్టి సేకరణ లేక సమీకరణ ద్వారా ఈ భూమిని సమకూర్చనున్నారు. ఇంత దూరం రోడ్డు మలుపుల్లేకుండా కొనసాగించడానికి అవసరమైన చోట సొరంగమార్గాలు, వంతెనలు నిర్మించనున్నారు. దేశంలో ఎక్కడా ఇటువంటి రహదారి లేదు. ఇదే మొదటిదని అధికారులు చెప్పారు. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 29,912 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు.

ఎవరూ లేనప్పుడొస్తే బాగుండును

బెంగళూరు, డిసెంబర్ 9: నోట్ల రద్దుపై తాను మాట్లాడితే పార్లమెంటులో భూకంపం వస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తనదైన శైలిలో స్పందించారు. తాను పార్లమెంటులో మాట్లాడితే భూకంపమే వస్తుందన్న రాహుల్ వ్యాఖ్యలపై వెంకయ్య స్పందిస్తూ, ఆ భూకంపమేదో పార్లమెంటులో తాము ఎవరూ లేనప్పుడు వస్తే బాగుంటుందని అన్నారు. ‘2జి, 3జి, బొగ్గు కుంభకోణం, కామనె్వల్త్ క్రీడల కుంభకోణం.. ఒకటా.. రెండా.. యుపిఏ హయాంలో జరిగిన కుంభకోణాలకు లెక్కే లేదు. తప్పుచేసిన వాళ్లపై ఎలాంటి చర్యా తీసుకోకుండా వౌనంగా ఉండడం తెలివైన పనా?’ అని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు.

నేను మాట్లాడితే భూకంపమే

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దుపై లోక్‌సభలో తనను మాట్లాడనీయడం లేదని, తాను మాట్లాడితే భూకంపమే వస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆయన అంటూ, ఈ నిర్ణయం వెనుక అసలు కారణాలేమిటో అన్ని విషయాలను తాను లోక్‌సభలోనే వెల్లడిస్తానని శుక్రవారం లోక్‌సభ వాయిదాపడిన అనంతరం పార్లమెంటు వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఈ అంశంపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోతోందని విమర్శించారు. నోట్ల రద్దుపై సభలో మాట్లడడానికి తనకు అవకాశమొచ్చినప్పుడు ప్రధాని సభలో కూర్చోను కూడా లేరని రాహుల్ అన్నారు.

నాణ్యతపై కమిటీ

హైదరాబాద్/ గచ్చిబౌలి, డిసెంబర్ 9: మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్, తలసాని శ్రీనివాసయాదవ్, మున్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యాలు దగ్గరుండి నానక్‌రామ్‌గూడలోని ఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, యువజన కాంగ్రెస్ నేత కార్తీక్‌రెడ్డి ఘటనా స్థలిని సందర్శించారు.

నల్లధనంపై యుద్ధం తీవ్రతరం

నల్లగొండ, డిసెంబర్ 9: నల్లధనం నిర్మూలనకు పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుండి తగిన మద్దతు లభించిందని, నల్లధనంపై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తామని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి జి.మురళీధర్ రావు అన్నారు. శుక్రవారం ఇక్కడ బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత, ఈ నెల 16 నుండి బిజెపి కేంద్ర మంత్రులు, ఎంపీలు, జాతీయ పదాధికారులు దేశవ్యాప్తంగా నల్లధనం వ్యతిరేక ప్రచారాన్ని విస్తృత స్థాయిలో చేస్తారని ఆయన చెప్పారు.

సిఎస్ పదవీకాలం పొడిగించండి

న్యూఢిల్లీ,డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పదవీకాలం పొడిగించాలని ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. టీఆర్‌ఎస్ ఎంపీలు జితెందర్ రెడ్డి వినోద్‌కుమార్,బూర నర్సయ్యగౌడ్ తదితరులు ముఖ్యమంత్రి లేఖను పార్లమెంట్‌లో ప్రధానిని కలిసి అందజేశారు.ప్రధానిని కలిసిన అనంతరం ఎంపీ జితేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయాన్ని మొదటగా సమర్థించి విలువైన సూచనలు అందించిన ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ను అభినందించినట్టు వెల్లడించారు.పార్లమెంట్‌లో లోక్‌సభలో టి.ఆర్.ఎస్ పార్టీ 193 రూల్ కింద లోక్‌సభలో చర్చ ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

హైదరాబాద్, డిసెంబర్ 9: భవనం కూలిన ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర చీఫ్ లేబర్ కమిషనర్ అనిల్ కుమార్ నాయక్‌ను కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ డాక్టర్ జనార్ధన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నర్ తదితరులతో టెలిఫోన్‌లో ఆయన సమీక్షించారు. ఇంకా శిథిలాల కింద మరో పది మంది ఉన్నట్టు బాధితులు పేర్కొన్నారని మంత్రి అన్నారు. స్థానిక కార్మిక శాఖ అధికారులు, నగర మున్సిపల్ శాఖ అధికారులతో సమన్వయం చేసి తక్షణ సాయం అందించాలని ఆయన డిప్యూటి సెంట్రల్ లేబర్ కమిషనర్ పిఎం శ్రీవాత్సవను ఆదేశించారు.

Pages