S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘజల్ వింటూ... బొమ్మ గీస్తూ..

బాపు బొమ్మ, బాపు రాత, బాపు గీత, బాపు సినిమా.. మొత్తంగా బాపు మన తెలుగువారికి సొంతమై పోయిన వ్యక్తి.
వీలునామా అవసరం లేని ఆస్థి. ఆయన గొప్ప దర్శకుడుగా అందరికీ తెలిసినవాడు. కానీ, ఆయన గొప్ప సంగీత ప్రియుడన్న సంగతి ఆయనతో బాగా సన్నిహితంగా మెలిగిన వారికే తెలుసు.
1978 సం.లో ప్రసిద్ధ ఘజల్ గాయకుడు మెహదీ హసన్ ఇండియా టూర్‌కు వచ్చి, కచేరీలు చేసే రోజులలో హైద్రాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియంలో ఓ రోజు ఆయన కచేరీ జరిగింది.

-మల్లాది సూరిబాబు

బాపు.. ఓ ఉత్తరం!

సత్తిరాజు లక్ష్మీనారాయణ అంటే ఇప్పటికీ చాలామందికి తెలియకపోవచ్చు. ‘బాపు’ అంటే టక్కున గుర్తు పట్టేస్తారు. అదేంటో! అసలు... ‘పేరు’ వచ్చిన చాలామందికి, ‘అసలు పేరు’ మరుగున పడిన సందర్భాలు ఇలానే ఉంటుంటాయ్!

-సుధామ

యాత్ర అనే జాతర

ఎవరు ఎందుక వస్తున్నారు, ఎందుకు, ఎక్కడికి పోతున్నారు తెలియకుండా జనం కదులుతూ ఉంటే ‘జాతర’లాగ ఉంది, అనడం అలవాటు. యాత్ర అనే మాట నుంచి జాతర పుట్టింది.
‘జాతర వోదం నరుసు, జక్కయకుంట ఉరుసు’ అంటడు పాటగాడు. అంతట్లో ఒగ సంగతి అర్థమవుతుంది. ‘చేతుల లేదు కాసు!’ మరేం చేయాలె? ‘నీ మెడనున్న గొలుసు, నేనమ్ముకుంట సైసు!’ సైసు అంటే గుర్రాల పనివాడు. సైసు అంటే సహించు, అంటే ఓపిక పట్టు అని గూడ అర్థము. నాన్న జరమొచ్చినప్పుడు పాటలు వాడేది. అట్ల యిన్న పాట ఇది. ‘శిన్నగ నడుసుకుంటు, శిందులు దొక్కుకుంటు’ జాతరకు వోతరు ఆ జంట!

కె.బి. గోపాలం

వాస్తవాలు

మల్లాది సూరిబాబుగారు ‘అమృతవర్షిణి’ శీర్షికలో సంప్రదాయ సంగీత వారధుల వివరణలో ఎంతో వాస్తవం ఉంది. మహా సంగీత స్రష్ఠలు రూపొందించిన శాస్ర్తియ సంగీతాన్ని, లలిత సంగీతంలా మార్చి, తేలికగా రూపొందిస్తున్న విధానాలు, సంప్రదాయ సంగీతాన్ని కించపరిచేలా అన్నమయ్య పాటలు బాధాకరంగా ఉన్నాయి. సినీ గీతాలు సందర్భోచితంగా రచించబడి, గొప్ప నేపథ్య గాయనీ గాయకులు మధురంగా పాడేసిన పాటలు, అతి సులభంగా నేర్చేసుకుని, వేదికలపై పాడేస్తూ గాయకులుగా చెలామణీ అయ్యే కృత్రిమ అనుకరణలు, అసలు సంగీతమనేది ఇంకా ఉందా? అనే అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. బాణీలు రక్తికట్టేలా ఉండి, కలకాలం అవి పాడుకోబడేలా అన్నమయ్య సంకీర్తనలు కూడా ఉండాలి.

నాదస్వర చక్రవర్తి (అమృతవర్షిణి)

ఏ కారణం లేకుండా ఈ భూమీద ఎవరి పేరూ శాశ్వతంగా నిలిచిపోదు.
సహజంగా వాసన కల్గిన పుష్పం పుట్టగానే పరిమళాన్ని వెదజల్లుతుంది. పుష్పాలన్నీ కాదు. నిర్దిష్టమైన ఒక ప్రయోజనం కోసం పుట్టి, అది నెరవేరిన మరుక్షణం, వెళ్లిపోతారు - వారి స్వప్రయోజనం కోసం కాదు. అలా వారు పొందిన ఆనందాన్ని నల్గురికీ పంచటమే వారి ధ్యేయం. దాని కోసమే జీవిస్తారు. అందుకే వారు కారణజన్ములు.
సంగీత రంగంలో... నాదలోలురై బ్రహ్మానందాన్ని అనుభవించేసి, లోకానికి, ఆ ఆనందాన్ని పంచిన విద్వాంసులు ఎప్పుడూ ప్రాతఃస్మరణీయులే. ఆదర్శమూర్తులు వారే.

-మల్లాది సూరిబాబు 9052765490

ఆత్మబంధం

చాలామంది మరణించిన వారు తిరిగి రారని చెప్తారు. కొందరు మాత్రం తిరిగి వస్తారని చెప్తారు. అలాంటి వాళ్లల్లో ఎలిసన్, అతని భార్య కూడా ఉన్నారు. మరణించాక వేరే చోటికి, ఈ ప్రపంచానికి మధ్యగల ఛేదించలేని కంచెని ఎలిసన్ సంతానంలోని ఒకరు ఛేదించారు.
పెన్సిల్వేనియాలో గ్రాంట్స్‌విల్ గ్రామంలోని ఎలిసన్ కొడుకు పాల్ తన అక్క శాలీతో ఈతకి వెళ్లాడు. కాని పనె్నండేళ్ల వాడు అక్క వద్దని వారిస్తున్నా వినకుండా సరస్సు మధ్యకి ఈదుకుంటూ వెళ్లి, తిరిగి ఒడ్డుకి చేరుకోలేక మునిగి మరణించాడు.

-పద్మజ

రాగమంజరి

శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణంతో దక్షిణ భారత కర్ణాటక సంగీత స్వర ధ్వజస్తంభం స్వర్గారోహణం అయింది.
అటువంటి గంధర్వ గాయకుడిని తయారుచేసి మరల భూమి మీద ప్రతిష్ఠించటానికి ప్రకృతికి కొన్ని వేల సంవత్సరాల సమయం అవసరం అవుతుంది. నేటి నుంచి ఇంధ్రసభలో స్వర సంగీత సమ్మేళనం అవిరళంగా స్రవిస్తుంది.

-శ్రీవిరించి

ఎలా వుందీ వారం? ( డిసెంబర్ 11 నుండి 17 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

భేషజాలకు దూరంగా ఉండండి. చేపట్టిన పనులు మిత్రుల సాయంతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, విద్య, వైజ్ఞానిక, యంత్ర రంగాల వారు ఆలస్యంగానైనా అనుకున్నవి అందుకుంటారు. ఆశయాలు నిరాశలు కావు. సమయానికి కుటుంబ సభ్యులు, బంధు వర్గం సాయపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులు అవకాశాలను వినియోగించుకోవాలి. ఆర్థిక అసమానతలు లేకుండా ఖర్చులు నియంత్రించుకోవాలి. ప్రయాణాదులందు విలువైనవి చేజారకుండా చూసుకోవాలి. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలితాలనిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855

అహం (కథాసాగరం)

బొఖారా ప్రాంత రాజయిన షాయిబ్రహీం విలాసవంతమయిన జీవితం గడిపేవాడు. మెత్తటి పరుపుపై పరిమళాలు వెదజల్లే పూలు చల్లి వాటిపై నిద్రించేవాడు. కానీ అతను సత్యానే్వషి. దైవం గురించి చింతించేవాడు. సాధు సన్యాసుల్ని ఆహ్వానించేవాడు.
ఒకరోజు పడుకోబోతూ ఉంటే తన మేడపై ఎవరో తిరుగుతున్నట్లు తెలిసి వాళ్లను పిలిపించాడు. ఎందుకిక్కడ తిరుగుతున్నారన్నాడు. ‘మా ఒంటెలు తప్పిపోయాయి. అందుకని వెతుకుతున్నామ’న్నారు. ‘మీ ఒంటెలు తప్పిపోతే అవి నా మేడ పైకి ఎలా వస్తాయి?’ అన్నాడు రాజు. ‘మీరు పూలపాన్పు మీద పడుకుంటే సత్యం మీకు అవగాహన కాదు’ అన్నారు వాళ్లు.

-సౌభాగ్య 9848157909

ముగ్గులు పంపండి

ముగ్గులు వేసిన కాగితాలను కలర్ స్కానింగ్ చేయంచి ఔజూచి ఫార్మాట్‌లో umapathisharma@ymail.com కు మెయల్‌లో కూడా పంపొచ్చు. ఎప్పటిలాగే ఈసారి కూడా భూమికలో ముగ్గులు పెడుతున్నాం. మీ సృజనకు పదునుపెట్టి కొత్తకోణాల్లో ఆకర్షించే అందమైన ముగ్గులు మా

Pages