S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైట్, డిఈడీ అంతర కళాశాలల యువజనోత్సవాలను అన్ని జిల్లాల్లో నిర్వహించాలి

నరసరావుపేట, డిసెంబర్ 2: డైట్, డిఈడీ అంతర్ కళాశాలల యువజనోత్సవాలను అన్ని జిల్లాల్లో నిర్వహించాలని ఏపీ ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ప్రొఫెసర్ యంవీ రాజ్యలక్ష్మి అన్నారు.

నగదు రహిత లావాదేవీలపై కలెక్టర్ సమీక్ష

ఖమ్మం, డిసెంబర్ 2: జిల్లాలో నగదు రహిత లావాదేవీల నిర్వహణకు అవగాహన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల అమలును గ్రామీణ ప్రాంతాల్లో విస్తరింపజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యం అవసరమయ్యే నిత్యవసర వస్తువుల దుకాణాల్లో నగదు రహిత లావాదేవీల కార్యచరణ విస్తరించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.

పెద్దనోట్ల రద్దుతో రైతులకు ఇక్కట్లు

ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 2: పెద్దనోట్ల రద్దుతో రైతులు, కూలీలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన పరిణామాలపై ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ అనాలోచిత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రైతాంగం కుదేలైందన్నారు. వారు పండించిన పంటను కూడా అతి తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితులు దాపురించాయని, కనీస పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును పొంగులేటికి వినిపించారు.

పనుల నిర్వహణ ఇలాగేనా?

మధిర, డిసెంబర్ 2: మధిర రైల్వే స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులపై దక్షిణ మధ్య డివిజనల్ రైల్వే మేనేజర్ ఆశిష్ అగర్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మధిర రైల్వే స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత రైల్వే క్రాసింగ్‌లను ఆయన పరిశీలించారు. అనంతరం మధిర 1వ నెంబరు, 2వ నెంబరు ప్లాట్‌ఫారాలపై పారిశుద్ధ్య పనులు ఎంత మంది చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిసి కెమెరాల నిర్వహణ సరిగా లేనందుకు 2000 పారిశుద్ధ్య పనులు చేపట్టనందుకు 4000 కాంట్రాక్టర్‌లకు జరిమానగా విధించారు.

కొనసాగుతున్న ఉద్రిక్తత

భద్రాచలం, డిసెంబర్ 2: భద్రాచలం మన్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉద్రిక్తత కొనసాగుతోంది. మావోయిస్టుల పిఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో మన్యంలో జనజీవనం స్తంభించింది. మావోయిస్టు దండకారణ్యంకు అతి సమీపంలో ఉన్న భద్రాచలం డివిజన్ సరిహద్దున ఏ సంఘటన జరిగినా ఉలిక్కి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మావోయిస్టుల ఆర్ధిక లావాదేవీలు, ఇతర కార్యక్రమాలకు సరిహద్దు గ్రామాలు రాచమార్గాలుగా మారాయి. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలో మావోయిస్టుల రూ.12లక్షల పెద్దనోట్లను మార్చుతూ ఇద్దరు వ్యక్తులు దొరికిపోయారు. వీరితో పాటు పోస్టల్ శాఖ ఉద్యోగి కూడా చిక్కారు.

ఎన్నాళ్లీ పడిగాపులు

వైరా, డిసెంబర్ 2: నల్లధనం మాటేమిటోగాని పెద్దనోట్ల రద్దుతో సామాన్యులకు, వృద్ధులకు బ్యాంకుల వద్ద పడిగాపులు తప్పడం లేదు. ఉదయం 9గంటల సమయానికే పెన్షన్లకోసం, జీతాలకోసం పలురకాల అవసరాలకోసం ముఖ్యంగా వృద్ధులు బ్యాంకులవద్ద వేచీ చూస్తున్నారు. కాగా బ్యాంకు అధికారులు కూడా బ్యాంకు తెరుచుకున్న గంట వరకు మాత్రమే రూ. 10వేలు ఇస్తున్నారు. ఆతరువాత సరిపడా నగదు లేక రూ. 5వేలు, లేక రూ. 6వేలు మాత్రమే ఇస్తామని సూచిస్తున్నారు. దీంతో వృద్ధులు ప్రతిరోజు మేము ఇలా పడిగాపులు కాయాల్సిందేనా అని బ్యాంకు అధికారులను నిలదీస్తున్నారు. అధికారులు కూడా మాచేతిలో ఏమిలేదు నగదు ఉంటే ఇవ్వడానికే కదా బ్యాంకులు ఉన్నదని చెప్తున్నారు.

ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి

ఖమ్మం (ఖిల్లా), డిసెంబర్ 2: ఖమ్మం నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో అర్బన్‌డే సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వౌలిక సదుపాయాలు కల్పించేందుకు పూర్తి చర్యలు చేపట్టాలని సూచించారు. మల మూత్ర విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, కమ్యూనిటి టాయిలెట్స్ నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ఇంటింటికి తిరిగి చెత్త సేకరించే కార్యక్రమాన్ని వందశాతం నిర్వహించాలన్నారు.

అంతరాయం లేకుండా నగదు చెల్లింపులు

ఖమ్మం రూరల్, డిసెంబర్ 2: బ్యాంక్ ఖాతాదారులందరికీ ఎటువంటి అంతరాయం లేకుండా నగదు చెల్లింపులు చేస్తున్నామని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ రవిశంకర్ తెలిపారు. గత నెల 8వ తేదీ నుంచి ఇప్పటివరకూ ఐఓబి పరిధిలో జరిపిన బ్యాంక్ లావాదేవీలపై శుక్రవారం ఆయనను కలిసి వివరణ కోరగా పైవిధంగా స్పందించారు. ఐఓబి పరిధిలో ఖమ్మం రూరల్ మండలంలోని 14 గ్రామాలు, వరంగల్ జిల్లా ముల్కలపల్లి మండలంలోని 8 గ్రామాలకు సంబంధించి 24వేల మంది ఖాతాదారులు ఉన్నట్టు చెప్పారు. వారిలో క్రాప్‌లోన్‌కు సంబంధించి ఎనిమిది వేల మంది ఖాతాదారులు, పెన్షనర్లు సుమారు మూడువేల వరకు ఉన్నట్టు తెలిపారు.

నల్లవాగుపై బ్రిడ్జ్ కమ్ చెక్‌డ్యామ్

కొత్తగూడెం రూరల్, డిసెంబర్ 2: నిత్యం రద్దీగా ఉండే నల్లవాగు వంతెన మరమ్మత్తులు, చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ 6కోట్లు నిధులు మంజారైనట్లు ఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలపరిదిలోని కారుకొండ రామవరం గ్రామపంచాయితీ పరిదిలోగల నల్లవాగుపై బ్రిడ్జ్‌కమ్‌చెక్‌డ్యామ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నల్లవాగుపై నిర్మించిన వంతెన శిధిలావస్థకు చేరడంతో కారుకొండరామవరం నుంచి బొమ్మనపల్లి, ఇల్లందుకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రూ 6 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

విజయవంతంగా కమర్షియల్ ఆపరేషన్

కొత్తగూడెం, డిసెంబర్ 2: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని రెండవ యూనిట్‌లో శుక్రవారం సాయంత్రం కమర్షియల్ ఆపరేషన్ పూర్తిస్థాయిలో విజయవంతమైంది. దీంతో 12వందల మెగావాట్ల సింగరేణి థర్మల్‌విద్యుత్ కేంద్రంలో చివరి మైలురాయి కూడా విజయవంతమైంది. దీనిపై సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ హర్షాన్ని వ్యక్తంచేసారు. బంగారుతెలంగాణ నిర్మాణానికి సింగరేణినుండి 12వందల మెగావాట్ల విద్యుత్‌ను అందించడం తమకెంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్లాంట్ నిర్మాణం వేగంగా పూర్తికావడానికి, విద్యుత్ అందుబాటులోకి రావడానికి తమకు పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు నడిపించారని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Pages