S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండవ రోజూ డబ్బుల్లేవు!

అనంతపురం అర్బన్, నవంబర్ 2:శ్రమజీవులకు వేతనాల తిప్పలు రెండవరోజు తప్పలేదు. వేతనంతో కుటుంబాలను నెట్టుకొచ్చే ఉద్యోగులు గత నెలలో నగదు సమస్య నుంచి బయట పడ్డవారు. ఈనెల 8న ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దుతో డిశంబర్ 1న వేతనాలు అందకపోవడంతో ఇంటి అద్దెలు, పాలు, పిల్లల స్కూల్ ఫీజులు తదితర వాటికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగదు సమస్యలేదని అధికారులు కొందరు పేర్కొంటుండగా అమలులోకి వచ్చేసరికి తీవ్ర ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులకు పదివేల అందజేస్తామన్న ప్రభుత్వం చివరికి ఆ పదివేలు సైతం అందించలేక చేతులు ఎత్తేసింది. ఇక పింఛన్‌దారులది అదే పరిస్థితు వీరి అకౌంట్లు ఖాళీ చూపిస్తున్నాయి.

మడకశిరకు బంగారు భవిష్యత్తు

మడకశిర, డిసెంబర్ 2 : త్వరలో నియోజకవర్గానికి బంగారు భవిష్యత్తు వస్తుందని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న అన్నారు. శుక్రవారం మడకశిరలో నిర్వహించిన చంద్రన్న పసుపు, కుంకుమ పథకం కింద ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ మడకశిర ప్రాంత భవిష్యత్తును మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నివిధాలా కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలోని రైతుల ఆశయాలు ఆడియాశలై వలసలకు సిద్ధమవుతున్న తరుణంలో అపర భగీరథుడిగా చంద్రబాబు హంద్రీనీవా పథకం ద్వారా నీరు తెప్పించేందుకు కృషి చేస్తుండటం పూర్వఫల పుణ్యమన్నారు.

చెరువులో పడి వ్యక్తి మృతి

సోమందేపల్లి, డిసెంబర్ 2 : మండలంలోని పాపిరెడ్డిపల్లి చెరువులో వ్యక్తి శవమై తేలిన ఘటన శుక్రవారం జరిగింది. సోమందేపల్లికి చెందిన దూదేకుల ఇమాంసాబ్ (45) కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా కుటుంబానికి దూరంగా ఉండేవాడు. ఈనేపథ్యంలో వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులకు కనబడి తిరిగి అదృశ్యమయ్యాడు. అయితే సోమందేపల్లి సమీపంలో ఉన్న పాపిరెడ్డిపల్లి చెరువులో శవమై తేలాడుతుండగా పశువుల కాపర్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా మృతుడి దుస్తులు, చెప్పులు గట్టుపై లభ్యమయ్యాయి.

ఆన్‌లైన్ సేవలు వినియోగించుకోవాలి

సూర్యాపేట, డిసెంబర్ 2: కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ.1000నోట్లను రద్దుచేసిన నేపథ్యంలో తమ ఇబ్బందులను తొలగించుకునేందుకు ప్రజలు ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ అన్నారు. మండలపరిధిలోని బాలెంల గ్రామంలో గ్రామపంచాయితీ ఆవరణలో డిజిటల్ పైనాన్సియల్ లిటరసి ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రజలకు నగదు ఇబ్బందులను తొలగించేందుకు ఆన్‌లైన్ సేవలను విస్తృతపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బ్యాంకులో నగదు ఉన్న వారు ఆన్‌లైన్ ద్వారా కొనుగోళ్లు జరపాలన్నారు.

బ్యాంకులకు చేరని నగదు..!

నల్లగొండ, డిసెంబర్ 2: ఆర్‌బిఐ చెప్పినట్లుగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల బ్యాంకులకు శుక్రవారం కూడా 150కోట్ల కరెన్సీ అందలేదు. దీంతో తమ వద్ధ ఉన్న 20కోట్ల మేరకు డబ్బులను వేతనాలకు, పింఛన్లకు, ఇతర ఖాతాదారులకు బ్యాంకర్ల సర్ధుబాటు చేశారు. ఉద్యోగులకు, పింఛన్‌దారులైన రిటైర్డ్ ఉద్యోగులకు 10వేల చొప్పున కొందరికి చెల్లించగానే డబ్బులు అయిపోవడంతో మరికొందరికి నాలుగైదు వేల చొప్పున అందించి చేతులు దులిపేసుకున్నారు. తమకు ఆర్‌బిఐ నుండి డబ్బులు అందనప్పుడు తాము ఎలా ఇవ్వగలమంటు బ్యాంకర్లు, పోస్ట్ఫాస్ సిబ్బంది ఉద్యోగులకు, పింఛన్‌దారులతో చెల్లింపుల్లో తమ నిస్సాహాయతను వ్యక్తం చేశారు.

ఉత్కంఠగా కొత్త జిల్లాల టిఆర్‌ఎస్, కాంగ్రెస్ సారధుల భర్తీ..!

నల్లగొండ, డిసెంబర్ 2: కొత్త జిల్లాల ఏర్పాటుతో రాజకీయ పార్టీలు నూతన జిల్లా కమిటీలను, జిల్లా పార్టీల సారధులను నియమించుకునే ప్రక్రియను పూర్తి చేసుకుంటుండగా అధికార టిఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు మాత్రం తాత్సర్యం చేస్తున్నాయి. ఇప్పటికే వామపక్షాలు, టిడిపి, బిజెపి, బిఎస్‌పి, వైకాపా పార్టీలు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పార్టీ నూతన అధ్యక్ష, కార్యదర్శుల నియామకాలను, కమిటీల భర్తీని పూర్తి చేసుకుని ఆ జిల్లాల్లో రాజకీయంగా బలం పుంజుకునే దిశగా పక్కా కార్యాచరణతో ముందడుగు వేస్తున్నాయి.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తోటల పెంపకం

చిట్యాల, డిసెంబర్ 2: పండ్లు, కూరగాయల సాగు కోసం అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తోటల పెంపకానికి ప్రోత్సహిస్తున్నామని ఉద్యానవన, పట్టుపరిశ్రమల శాఖ జిల్లా అధికారి సంగీతలక్ష్మి అన్నారు. ఉద్యానవన-పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రం శివారులో ఆకిటి సత్తిరెడ్డి వ్యవసాయక్షేత్రంలో నూతన, సాంకేతిక అంశాలు, పథకాల అమలుపై జిల్లాలోని అధికారులకు క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అధికారులు, శాస్తవ్రేత్తలు, సిబ్బంది హాజరైనారు.

జిల్లాలో టిడిపి బలోపేతం

రామన్నపేట, డిసెంబర్ 2: యాదాద్రి జిల్లాలో టిడిపి బలోపేతం అవుతుందని పార్టీ జిల్లా అద్యక్షుడు ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది నాయకులు పార్టీమారిన గ్రామాలలో టిడిపికి కార్యకర్తల బలం పటిష్టంగా ఉందని అన్నారు. టిఆర్‌ఎస్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కవాగ్దానాన్ని సక్రమంగా నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, ప్రజాసమస్యలపై టిడిపి ఆద్వర్యంలో ఆందోళనలు చేపడుతామని అన్నారు.

మెరుగైన ఫలితాలకు ప్రత్యేక తరగతులు

నల్లగొండ టౌన్, డిసెంబర్ 2: పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ముందస్తు ప్రణాళికలకు సిద్దం కావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9,10 తరగతులకు పరీక్షల సన్నధ్దం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. స్లిప్‌టెస్టుల ద్వారా వెనుకబడిన విద్యార్ధులను ప్రోత్సహించాలన్నారు. బడి మానేసిన బాలికలను గురుకుల పాఠశాలలో చేర్పించాలని సూచించారు. పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లను పరిశుభ్రంగాంచాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఆదేశించారు.

కేబుల్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి: జెసి

నల్లగొండ టౌన్, డిసెంబర్ 2: కేబుల్ టీవి డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. శుక్రవారం జరిగిన కేబుల్ ఆపరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాల్గవ విడత కేబుల్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఎం ఎం ఒలు విధిగా ఈ నెలాఖరు వరకు పూర్తి చేసి కేంద్ర ఆదేశాలు పాటించాలన్నారు. ప్రతి కేబుల్ కనెక్షన్ దారుడినిక సెటప్ బాక్స్ బిగించాలన్నారు. లేనియోడల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Pages