S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీతాలొచ్చినా తీసుకునేదెలా?

హైదరాబాద్, నవంబర్ 29: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయటంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ. 2వేల నోటును అందుబాటులోకి తెచ్చినా, అందుకు సరిపడే చిల్లర లభించటం లేదు. ఈ క్రమంలో నగదు రహిత సేవలపైనే ప్రజలు ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా మరో రెండురోజుల్లో కొత్త నెల ప్రారంభమవుతున్నందున, ఉద్యోగులందరికీ వారి ఖాతాల్లోకి ఆన్‌లైన్‌లోనే నగదు జమ అయ్యే అవకాశముండటంతో, దానికి చిల్లర ఎలా అన్న చర్చే జరుగుతోంది. నగరంలోని వివిధ బ్యాంకులకు చెందిన సుమారు ఆరు నుంచి ఆరున్నర వేల వరకు ఏటిఎంలున్నా, వాటిలో సగానికి సగం ఏటిఎంలలో మాత్రమే డబ్బు అందుబాటులో ఉంది.

వరంగల్ జైలర్‌పై బదిలీ వేటు

హైదరాబాద్, నవంబర్ 29: గ్యాంగ్‌స్టర్ నరుూం చనిపోయినా అతని అనుచరులకు కావలసిన రాచమర్యాదలన్నీ నిరాటంకంగా జరుగుతున్నాయి. నరుూం కేసులో అరెస్టయిన అతని అనుచరులతో జైలు అధికారులు కుమ్మక్కై కావలసిన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. ఈ విషయంపై జైళ్ల శాఖ డిజి వికె సింగ్ స్పందించారు. జైల్లో ఉన్న నరుూం అనుచరుల వద్ద జైలు అధికారులు ముడుపులు తీసుకున్నట్టు సమాచారం వచ్చిందన్నారు. ఇటీవలే చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ను ఇటీవల కరీంనగర్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా వరంగల్ కేంద్ర కారాగారంలో పనిచేస్తున్న మరో అధికారిపై బదిలీ వేటు పడింది.

నిఘా భేష్

హైదరాబాద్, నవంబర్ 29: ఉగ్రవాదులను పట్టుకోవడంలో తెలంగాణ పోలీసులు తమ ప్రతిభను మరోసారి చాటారు. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఆల్‌ఖైదా నెట్‌వర్క్ బేస్ మాడ్యూల్‌కు చెందిన ముగ్గురు అనుమానితులను జాతీయ పరిశోధనాసంస్థ(ఎన్‌ఐఏ) మదురైలో అరెస్టు చేయడానికి తెలంగాణ ఇంటెలిజెన్స్ అందించిన కీలక సమాచారం బాగా తోడ్పడింది. ఈ అనుమానితులు గతంలో చిత్తూరు, కొల్లాం, మైసూరు, నెల్లూరు, మల్లపురంలో కోర్టు ఆవరణలో పేలుళ్లకు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి.

జిహెచ్‌ఎంసిలో నగదు రహిత సేవలు

హైదరాబాద్, నవంబర్ 29: జంటనగరాల్లో కోటి మందికి పౌరసేవలు, అత్యవసర సేవలను అందించే జిహెచ్‌ఎంసిలో నగదు రహిత సేవలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దీకి పూర్తి స్థాయిలో మద్దతునివ్వటంతో పాటు ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు నగదు రహిత సేవలను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించిన వెంటనే కమిషనర్ జనార్దన్ రెడ్డి నగదు రహిత సేవలను ప్రారంభించారు. ఈ మేరకు మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డి జోనల్, డిప్యూటీ కమిషనర్లతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు.

కరెన్సీ మార్పిడి ముఠా గుట్టు రట్టు

జగిత్యాల, నవంబర్ 29: కరెన్సీ మార్పిడికి పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠా వ్యాపారం గుట్టు రట్టయింది. ముఠా సభ్యులైన ముగ్గురు వ్యాపారులను జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈమేరకు మంగళవారం జిల్లా ఎస్పీ అనంతశర్మ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో మనీ ఎక్స్ఛేంజ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న చింత సంతోష్, నిజాబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బాజిరెడ్డి ప్రశాంత్, అదే జిల్లాలోని భీమ్‌గల్ మండలం పెర్కిట్‌కు మహ్మద్ ఇస్మాయిల్ నోట్ల రద్దు తరువాత పలు ప్రాంతాల్లో కమీషన్‌పై వ్యాపారానికి తెరలేపినట్లు తెలిపారు.

జడ్చర్లలో రోడ్డు ప్రమాదం

జడ్చర్ల, నవంబర్ 29: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని మాచారం గ్రామంలోని బస్ స్టేజీ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని తప్పించబోయి ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు అతి వేగంగా ఢీకొన్న సంఘటనలో ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న కేరళ రాష్ట్రంలోని పెరింతల్‌మన్నాకు చెందిన టూర్ కాంట్రాక్టర్ రాజీవ్ (30), బస్సు క్లీనర్ అల్మీర్ (28) అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న 28 మంది ఫార్మసీ విద్యార్థినీ విద్యార్థులు, ముగ్గురు లెక్చరర్లు గాయపడ్డారు.

డిసెంబర్ 31 నాటికి నగదు రహితంగా సిద్దిపేట

సిద్దిపేట, నవంబర్ 29: సిద్దిపేట నియోజకవర్గాన్ని డిసెంబర్ 31వరకు నగదు రహిత లావాదేవీల నియోజకవర్గంగా రూపొందిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, అధికారులతో 5గంటల పాటు సమీక్ష నిర్వహించారు. బ్యాంకర్లు, అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకొని బ్యాంకుల ద్వారా ఆయా శాఖల పరిధిలో, ప్రైవేట్ సంస్థల్లో ఏవిధంగా అభివృద్ధి చేయాలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ సిద్దిపేటను నగదు రహిత నియోజకవర్గంగా ప్రకటించడం అదృష్టమన్నారు. డిసెంబర్ 31వరకు ఆ దిశగా గట్టి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.

చరిత్రలో నిలిచేలా సైన్స్ కాంగ్రెస్

విజయవాడ, నవంబర్ 29: తిరుపతిలో రహదారులు, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్ట్, వర్సిటీల ప్రాంగణాలు, ముఖ్య కూడళ్లు సుందరీకరించాలి. డిసెంబర్ రెండవ వారంలోగా ఆయా పనులన్నీ పూర్తి చేసి ఇతర ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సైన్స్ కాంగ్రెస్‌పై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. చరిత్రలో నిలిచేలా ఈవెంట్ ఉండాలన్నారు.

ఇ-పోస్‌కు మారాలన్నా కష్టమే...!

భీమవరం, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎదురవుతున్న ఇబ్బందులను నివారించడంలో భాగంగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించనప్పటికీ అందులోనూ కష్టాలు తప్పేట్టులేదు. ప్రతీ దుకాణంలో స్వైపింగ్ మెషీన్ (ఇ-పోస్) అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరే సూచనలు కనిపించడంలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి రూ.500, రూ.1000 నోట్లు కేంద్రం రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు వివిధ రూపాల్లో కష్టాలెదుర్కొంటున్నారు. ఎటిఎంలు పనిచెయ్యకపోవడం, బ్యాంకుల్లో కేవలం రూ.2000 నోట్లు రావడం, భారీ రద్దీ తదితర సమస్యలు తలెత్తాయి.

సమస్యల పరిష్కారానికి వైకాపా రాజీలేని పోరు

కడప, నవంబర్ 29: సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బెదిరే ప్రశే్నలేదన్నారు. కడప జిల్లా పులివెందుల, సింహాద్రిపురం, వేంపల్లెలో జగన్ మంగళవారం పర్యటించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ప్రభుత్వంపై పోరాడాలని సూచించారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తూ దోపిడీకి పాల్పడుతోందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, నదుల అనుసంధానం పేరిట కోట్లాది రూపాయలు కొల్లగొడుతోందన్నారు.

Pages