S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కోరుబోర్డు

మొహాలీ: ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 93.5 ఓవర్లలో 283 ఆలౌట్ (జానీ బెయిర్‌స్టో 89, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ 43, మహమ్మద్ షమీ 3/63, ఉమేష్ యాదవ్ 2/58, జయంత్ యాదవ్ 2/49, రవీంద్ర జడేజా 2/59).
భారత్ మొదటి ఇన్నింగ్స్: 138.2 ఓవర్లలో 417 ఆలౌట్ (పార్థీవ్ పటేల్ 42, చటేశ్వర్ పుజారా 51, విరాట్ కోహ్లీ 62, రవిచంద్రన్ అశ్విన్ 72, రవీంద్ర జడేజా 90, జయంత్ యాదవ్ 55, ఆదిల్ రషీద్ 4/38, బెన్ స్టోక్స్ 5/26.2)

ఆ ప్రశ్నలు.. ఏడాదిలోనే ‘టర్న్’ అయ్యాయి : కోహ్లీ

మొహాలీ, నవంబర్ 24: ఏడాది క్రితం వరకు అతిగా స్పందించే నాసిరకం పిచ్‌లపై ఆడడానికి మీరు ఎందుకు ఇష్టపడుతున్నారనే ప్రశ్నలు వినిపించేవని, అయితే ఇప్పుడు ఆ ప్రశ్నలు ‘టర్న్’ అయి మంచి పిచ్‌ల మీద కూడా ఎలా గెలవగలుగుతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. దక్షిణాఫ్రికాపై సొంత గడ్డపై ఆడుతున్నప్పుడు టీమిండియాపై ఇలాంటి ప్రశ్నలు తలెత్తాయి. పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లనే ఎందుకు ఎంచుకుంటున్నారని అప్పుడు తనను చాలా మంది ప్రశ్నించారని కోహ్లీ అన్నాడు.

డబుల్ గోల్స్‌తో మెరిసిన యూసఫ్

మెల్బోర్న్, నవంబర్ 29: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రెండు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత జట్టు శుభారంభాన్ని సాధించింది. మంగళవారం మెల్బోర్న్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 3-2 గోల్స్ తేడాతో ఆతిథ్య కంగారూలను మట్టికరిపించి ఈ సిరీస్‌లో బోణీ చేసింది. యువ స్ట్రైకర్ అఫ్ఫన్ యూసఫ్ అద్భుతమైన రెండు ఫీల్డ్ గోల్స్ సాధించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే విజృంభించి ఆడిన భారత జట్టుకు 19వ నిమిషంలో తొలి ఫీల్డ్ గోల్‌ను అందించిన అఫ్ఫన్ అదే నిమిషంలో మరో ఫీల్డ్ గోల్ సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు.

ఇంగ్లాండ్‌తో వన్‌డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా దూరం

మొహాలీ, నవంబర్ 29: మొహాలీలో ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ముందు నెట్ ప్రాక్టీస్ సందర్భంగా భుజానికి ప్రాక్చర్ కావడంతో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దాదాపు ఆరువారాల పాటు పోటీ క్రికెట్‌కు దూరం కాబోతున్నాడు. ఈ కారణంగా జనవరి 15నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే వన్‌డే సిరీస్‌కు కూడా అతను అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. పాండ్యా కుడిభుజానికి హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయినట్లు వైద్య బృందం ధ్రువీకరించిందని బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఒక్క సెషన్‌లోనే 9 వికెట్లు!

హామిల్టన్, నవంబర్ 29: పాకిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. హామిల్టన్‌లో మంగళవారం ముగిసిన రెండవ, చివరి టెస్టులో న్యూజిలాండ్ బౌలర్లు అన్యూహ్య రీతిలో విజృంభించి చివరి సెషన్‌లోనే తొమ్మిది వికెట్లు కైవసం చేసుకున్నారు. దీంతో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు అత్యంత నాటకీయంగా 138 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను మట్టికరిపించి 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. పాక్‌పై న్యూజిలాండ్ సిరీస్‌ను గెలుచుకోవడం దాదాపు మూడు దశాబ్దాల (1985) తర్వాత ఇదే తొలిసారి.

భారత్ జైత్రయాత్ర

బ్యాంకాక్, నవంబర్ 29: ఆసియా కప్ మహిళల ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించి ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టును భారత బౌలర్లు ఆరంభం నుంచే సమర్ధవంతంగా నిలువరించారు. ముఖ్యంగా ఏక్తా బిస్త్ (3/20), అంజూ పాటిల్ (2/12), హర్మన్‌ప్రీత్ కౌర్ (2/16) ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు.

అమ్మో ఒకటో తారీఖు!

హైదరాబాద్, నవంబర్ 29: జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, కార్పొరేట్ బ్యాంకులు అన్న తేడాలు లేవు. అన్ని బ్యాంకుల ముందూ ఒకే రకమైన సమాచారం. ‘నో క్యాష్’, ‘నో ఎక్స్ఛేంజి’. పక్కన ఉన్న ఎటిఎంలు పనిచేస్తాయా అంటే అవీ పని చేయవు. హైదరాబాద్ నగరంలో ఏ బ్యాంకులో చూసినా ఇదే పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఈనెల 8న ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తరువాత రెండుమూడు రోజుల్లో పరిస్థితి సాధారణంగా మారుతుందని మొదట్లో భావించారు. వారం రోజుల్లో ఎటిఎంలు అన్నీ కొత్తనోట్లకు అనుగుణంగా మార్చనున్నట్టు ఆర్‌బిఐ ప్రకటించింది.

మీ లెక్కలు చెప్పండి

న్యూఢిల్లీ, నవంబర్ 29: బిజెపి పార్లమెంటు సభ్యులందరు తమ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను అందజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. మంగళవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడుతూ పెద్దనోట్లు రద్దు చేసిన నవంబర్ 8నుంచి డిసెంబర్ 31 తేదీ వరకు తమ ఖాతాల లావాదేవీల పూర్తి వివరాలను అందజేయాలన్నారు. నల్లధనం, అవినీతిని అదుపు చేసేందుకు తాను ఎంత దూరమైనా వెళ్తానని సూచించేందుకే మోదీ ఈ రకమైన ఆదేశాలిచ్చినట్లు భావిస్తున్నారు.

కల్పవృక్షంపై పద్మావతి విహారం

తిరుపతి, నవంబర్ 29: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నాలుగో రోజైన మంగళవారం కల్పవృక్ష, హనుమంత వాహనాలపై పద్మావతిదేవి విహరించారు. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య కోరిన వరాలిచ్చే కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజగోపాలస్వామివారి అవతారంలో కొలువుదీరిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కోర్కెలను తీర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలిమేలు మంగమ్మ ఆశ్రీత భక్తులకు కష్టాలను తొలగించే పరిపూర్ణ శక్తిగా భక్తులు భావించి తరించారు. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య శ్రీపద్మావతిదేవి హనుమంత వాహనంపై భక్తులకు కనువిందు చేశారు.

సూర్యనారాయణ సేవలు అసామాన్యం

హైదరాబాద్, నవంబర్ 29: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రముఖ్, 93ఏళ్ల సైద్ధాంతికవేత్త దివంగత కె సూర్యనారాయణ సేవలు అనన్యసామాన్యమని సంఘ్ నేతలు ఘనంగా కొనియాడారు. గత 19వ తేదీన బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన సూర్యనారాయణకు సంతాపంగా ఆర్‌ఎస్‌ఎస్ నేతలు మంగళవారం నాడిక్కడ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యనారాయణ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు. సూర్యనారాయణ మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు వౌనం పాటించారు. సూర్యనారాయణ కన్నుమూతతో సంఘ్ పరివార్ పెద్దదిక్కును కోల్పోయినట్టయిందని సంయుక్త ప్రధానకార్యదర్శి వి భాగయ్య పేర్కొన్నారు.

Pages